Tuesday, 6 May 2014

కవిత నెం29(నీ ఓటే ఒక ఆయుధం)

కవిత నెం :29

***నీ ఓటే ఒక ఆయుధం***

చతికిలపడ్డ సమైక్యత ను నిద్ర లేపటానికి
అలసిపోయిన ప్రజాస్వామ్యాన్ని కదపటానికి
నీ ఓటే ఒక ఆయుధం  //2//
నీ గుండెచప్పుడు గెలవటానికి
నీ మనసు స్వచ్చత ను నిలపటానికి
నీ ఓటే ఒక ఆయుధం //2//
రాజ్యాంగాన్ని తిరగరాసే సిరా ఏరా ఈ ఓటు ఆయుధం
రాజకీయవ్యవస్థను ప్రక్షాళన చేసే ఈ ఓటు ఆయుధం
నీ గళం సుస్థిరం కావాలంటే ఏమ
నవచైతన్య పునాదులు లేవాలంటే
నీ ఓటే ఒక ఆయుధం //2//
అంధకార చీకట్లు తోలగాలంటే
అదికార దాహాలను దించాలంటే
నీ ఓటే ఒక ఆయుధం //2//


 అవినీతిని బహిష్కరించటానికి
నిజాయితీ నీడ మిగలటానికి
నీ ఓటే ఒక ఆయుధం //2//
ప్రజల విలువ తెలియ చెప్పటానికి
ప్రజా క్షేమం కాపాడటానికి
నీ ఓటే ఒక ఆయుధం //2//
ప్రతి మనిషి ఒక సైనికుడై రావాలి
నీ చేతిలో ఆయుధమే ఒక ఓటుగా
దానిని వాడి చూడు ఇక సూటిగా
వెలుగును చూపే సూర్యుడు నీవే
భవితను మలచే సమర్దుడు నీవే
కళ్ళు తెరచి చూడు
కుళ్ళు కడిగెయ్ నేడు
నీ అస్త్రం సందించి అర్జునుడు గా రా రా
శ్రమజీవులు అణ్వాయుధం ఈ ఓటురా
సమ సమాజ నిర్మాణం ఈ ఓటురా
నీ ఓటే ఒక ఆయుధం //2//

Related Posts:

  • కవిత(360)కవిత ఓ కవితఅందమైన వనితనీ పేరులో ఉంటుంది బావాత్మకతనిన్ను చూడగా ఎదలో ఏదో కలవరింతనీ స్నేహంతో మొదలైంది నాలో పులకరింతఆగదేమో ఇప్పట్లో ఈ కేరింతఅలజడిలా అనిపిస… Read More
  • ప్రేమ సిద్దాంతం (359)ప్రేమ సిద్దాంతం ప్రేమించేటప్పుడు నువ్వే నా ప్రాణమనిపిస్తుందిప్రేమలో ఉన్నప్పుడు నువ్వే నా సర్వమనిపిస్తుందిప్రేమలో గెలిస్తే ,కల నిజమైంది అనిపిస్తుం… Read More
  • కవిత నెం27 కవిత నెం :27 మనసును చదవగలరా ఎవరైనా ఆత్మను అవగాహన చేసుకోగలరా ఎవరైనా అర్ధం పర్ధం లేని జీవితంలో 'అపార్ధాల' పంటలు పండిస్తున్నారు  మమకారం చూపించే మన… Read More
  • నేనేప్రేమా(357) నాకు లేడీస్ తో మాట్లాడటం రాదునా మాట కరుకునాకు ఉండదు బెరుకుఅందుకే నేనంటే అందరికీ చిరాకునువ్వు దూరంగా ఉండాలనిఅనుకోవటంలో తప్పు లేదుఆడపిల్లలతో కేరిం… Read More
  • 358 (వలపుతెర) నా మనసు నీ సాంగత్యం కోసం ఎదురుచూస్తుంటేనువ్వేమో నా మనసుని ఎప్పుడు గెలుద్దామా అని చూస్తున్నావ్నువ్వు నాతో ఉన్నావని తెలుసుగా నీ జతలేని నేను ఒ… Read More

0 comments:

Post a Comment