Tuesday, 28 October 2014

కవిత నెం61:అంతరంగాలు

కవిత నెం :61 అంతరంగాలు  ************************ హృదయాంతరమున కదిలే తరంగాలు  మనసు మనసుతో మెదిలే భావాతరంగాలు అంతుచిక్కని అనంత మౌన చదరంగాలు   అంతర్ముఖాన్ని అద్దంలా చూపే ప్రతిరూపాలు   ఆలోచనల అలజడిలో చేసే సుదూరప్రయాణాలు కనపడీ కనపడనట్టు ఉండే ఎండమావులు  భూత ,వర్తమానాల మధ్య జరిగే  రాయభారాలు   నిజానికి ,కల్పితానికి మద్య జరిగే సంఘర్షణలు  ఊహలను ఊరించేసి ఉరితీసే కలల సౌధాలు  ఏకాంతాన్నివింతగా...

Monday, 27 October 2014

కవిత నెం60:బాల్య - భారతం

కవిత నెం :60 బాల్య - భారతం  ********************************** ఓ అందమైన చందమామ కధ లాంటి పుస్తకం  ఒక అపురూపమైన అద్దం లాంటి జ్ఞాపకం  ఆ అనుభూతులనే నెమరువేసుకుంటే మనస్సు ఆ తన్మయత్వంతో మరలా పురుడు పోసుకుంటుంది వయస్సు  ఒక్కసారి ఎదలోతుల్లోకి చూసే బాల్యపు చూపులు  కాలాన్ని నిలిపివేసి చెప్పుకుంటాయి ఎన్నో కబుర్లు  గోరుముద్దల కేరింతలు - జోల పాటల లాలింతలు  అమ్మ దగ్గర సుకుమారం - మారం చేసే గారాభం  చిలిపి ఆటల కోలాహలం - అలసిపోని మది సంబరం  పొంగిపోయే ఉత్సాహం - నిలచిపోయే సంతోషం  మాటలకుండే మాయాజాలం - నడక నేర్చుకునే...

Friday, 24 October 2014

కవిత నెం59:ప్రకృతి వైపరీత్యాలు

కవిత నెం :59 ప్రకృతి వైపరీత్యాలు *************************** ప్రకృతి మనకు సహజంగా లభించిన సంపదైతే ఆ ప్రకృతి  ప్రళయాగ్నికి మానవ తప్పిదాలు ఎన్నో ప్రకృతి ప్రకంపిస్తుంది సునామీగా ,తుఫాన్ గా, భూకంపంగా ప్రజల ఆర్తనాదాలు ఆందోళనగా ,అందకారంగా మండే ఎండలు ,అకాల వరదలు ,బీడు భూములు ఎవ్వరు రాసుకున్నవి ఈ కలియుగ విధ్వంసాలు చెట్లు నరుకుట , కలుషిత నీరు ,కాలుష్యమే ఫైరు గాలిలో మేడలు ,అణు పరీక్షలు ,గనుల తవ్వకాలు విద్యుత్ ప్రాజెక్టులు ,వ్యర్ధ పదార్ధాలు ,విరిగే కొండలు మట్టిని మరచి మార్బుల్స్ , మూగజీవాల హంటింగ్స్ నాగరికతను విడచి కృత్రిమ జీవనంకై పరుగులు వనారణ్యాలను...

Wednesday, 22 October 2014

కవిత నెం58:భళా భళి దీపావళి

కవిత నెం :58 దీపావళి ******************************************** ఇంటింటా ఆరంభమయ్యే ఆనంద హేళీ ''దీపావళి  '' అమావాస్య చీకట్లను మాపే  నూతన వెలుగుల జాలీ ''దీపావళి '' చెడును చంపి మంచిని పుట్టించే శోభావళీ ''దీపావళి '' ప్రమిదల కాంతులు ,దీపాలంకరణలతో  పుట్టేదే ''దివ్య దీపావళి '' అనేక విజయోత్సాహాల కధలను కల్గియున్న ''దివ్య చరితావళీ'' జాతి కుల మత భేదాలు లేనిది ఈ  ''నవ్య దీపావళి '' కష్టాల్ని...

Sunday, 19 October 2014

కవిత నెం57:బందాలు .... అనుబందాలు

కవిత నెం :57 బందాలు .... అనుబందాలు  ************************************* బందాలు అనుబందాలు బహు సుందర కావ్యాలు  ఆత్మీయత నిండి యున్న అనురాగపు కెరటాలు  మమతలు పంచే మనోహర  మధుర భావాలు  మరచిపోలేని అందమైన అద్బుతమైన  అనుభవాలు  జననం నుంచి మరణం దాకా వీటితోటే మన జీవనం  అమ్మ పాల నుంచి ..అక్క ,చెల్లెల అనుబందం దాకా  సోదరుడి ప్రేమ నుంచి స్నేహితుడి సహవాసం దాకా  ప్రియురాలి వలపు నుంచి భార్యామణి పిలుపు దాకా  అత్తా మామల గౌరవం నుంచి అల్లుళ్ళ ఆర్బాటం దాకా  నాన్న స్థానం నుంచి తాత ,ముత్తాత ల ప్రస్తానం...

Wednesday, 15 October 2014

కవిత నెం56:నువ్వంటే నా ''మనసు ''

కవిత నెం :56 నువ్వంటే నా ''మనసు '' ************************** నువ్వంటే నా మనసు  నా మనసు నీకు తెలుసు  నా మనసులోని మాట  నీకు మనవి చేసుకున్నా  మన్నించి దరిచేర్చవా నన్ను  నీ మనసులోని మాట చెప్పవా  నా మనసులోని రూపం నువ్వు  నా మనసుచుట్టూ ఊపిరి నువ్వు  నా మనసు పడే ఆరాటం నువ్వు  నా మనసే నీ వశమయ్యిందే నీ మనసేదో మాయచేసిందే  నువ్వన్నది నా మనసే  నేనంటే  చిన్న అలుసే  నేనంటే పట్టనట్టు ఉంటదే  నన్నేదో కనికట్టు చేస్తాదే  నా మనసే నీవైనప్పుడు  నా మనసే నీదైనప్పుడు  ఎందుకే ఇలా...

కవిత నెం 55:ఓ సైనికా ..... నీకు సలామ్

కవిత నెం :55 ఓ సైనికా  ..... నీకు సలామ్  *********************** దేశ సంతోషం కోసం సమిదిలా నిలుస్తావు  దేశ సంరక్షణ కోసం ఫిరంగిలా మారతావు  నీ ఆనందాన్ని ఎవ్వరూ చూడరు నీ సామర్ధ్యాన్ని తప్ప  నీ జీవితం రణరంగమే కాని కుటుంబాన్ని చూడలేవు  చెమటోర్చి ఎదురీదుతావు చెక్కు చెదరకుండా  నీ నెత్తురోడినా శత్రు సైన్యాన్ని గెలువనీయవు  ఆత్మస్థైర్యంతో నీ అడుగుని కదుపుతావు  అణుశక్తిలా మారి ఆయుధమై  పోరాడతావు అలుపెరుగని సూరీడల్లే  శ్రమిస్తుంటావు  అహోరాత్రులు మరచి గమిస్తుంటావు  నీ త్యాగఫలంతో దేశ యాగం...

Thursday, 9 October 2014

కవిత నెం 54: ఇల్లాలి చదువు - ఇంటికి వెలుగు

కవిత నెం :54 ఇల్లాలి చదువు - ఇంటికి వెలుగు  ******************************* ఆడపిల్లకు చదువెందుకంటూ వంటిట్లో కుందేలుగా మార్చే వెర్రిబాగులు ఆడపిల్ల అక్షరమే ఆయుధమని తెలుసుకోవాలి ఆడపిల్ల చదువే తమ జీవితాలకు వెలుగని ఆడపిల్ల చదువే జ్ఞాన జ్యోతులు వెలిగించే దీపమని తెలుసుకుని , తనకు విలువనిచ్చే సమాజం రావాలి తను అమ్మలాగా లాలిస్తూ మొదటి గురువవుతుంది భార్యలాగా సమదీటుగా నీ భాద్యతలను స్వీకరిస్తుంది ఇంటికి ఇల్లాలే ఆధారం , ఆమెతోనే సంతోషం తను చేసే ...

Sunday, 5 October 2014

కవిత నెం53:మన చేతిలో పర్యావ ''రణం''

కవిత నెం :53 *** మన చేతిలో పర్యావ ''రణం'' **** ఓ మనిషీ ఆలోచించు నీ అవసరతను అన్వేషించి  వరమైన ప్రకృతినే పదిలంగా మలుచుకొంటూ  పర్యావరణం - అది పంచ భూతాల సమ్మేళనం  పర్యావరణం - అది సహజ వనరుల నిక్షేపం  చేయకురా కలుషితం అది చూడలేని  వికృతం  పెంచకురా  కాలుష్యం అది నీ పాలిట విషం చెట్టు ఉన్ననాడు అది నీకు ఇచ్చే గూడు  ప్రాణవాయువును పంచి అది నీ ఊపిరికే తోడు  నీటి కొరత చూడు అది భూమాతకే  చేదు  నీరు ఉంటేనేగా...

Wednesday, 1 October 2014

కవిత నెం52:ఓ బాపు......

కవిత నెం :52 ఓ బాపు .... వస్తావా మా కోసం  ************************* ఓ బాపు మహాత్ముడా ..... మహానీయుడా  నీలా ఉండటం ఈ రోజుల్లో ఎవరి తరమయా  సత్యమన్నావు ... ఏది సత్యమో తెలియలేకున్నది  నిజం  చెప్పే దైర్యం గాని ,అవసరం కాని ఎవరికున్నది? అహింసా అన్నావ్ ... హింస లేకుండా మా బ్రతుకులేవి  ఒక చెంప మీద  కొడితే ఇంకొక చెంప ఊరుకుంటుందా ?  సావధానంగా చెబితే వినేది ఎవరు ? సామరస్యంగా చర్చించుకునేది ఎందరు? అర్దరాత్రి ఆడ పిల్ల నడిచిన రోజే స్వాతంత్రం అన్నావు  నేటి ఆడ పిల్లల జీవితాలకు నూరేళ్ళు ఉన్నాయా బాపు ? అన్ని చోట్లా...

కవిత నెం51:ఒక మైలు రాయిని నేను

కవిత నెం :51 ఒక మైలు రాయిని నేను ****************** ఒక మైలు రాయిని నేను  నా  ప్రయాణంలో కాని కదిలే మైలు రాయిని నేను నా ఎదురుబాటలో ఇది నిజమా  ? భ్రమయా ? అనే ఊహ కాసేపు ఇది అవునా ? కాదా ? అనే యోచన మరి సేపు ఏది తప్పో ఏది ఒప్పో అనే స్నిగ్దత  కాసేపు ఏది తత్వం ? ఏది వేదం ? అనే సంశయం మరి సేపు ముళ్ళ బాటలో మెత్తని పువ్వుల తోటలో తెలిసి తెలియకున్నట్లు సాగుచున్న నా అంతరంగం ఇచ్చే జావాబు ద్వారాల వెనుక ఏ  అంతర్యామి లేని ఈ స్వామీ నన్ను కనుగొంటాడా అని అలుపు లేని మలుపుల వేకువ నిచ్చెనతో నడుస్తున్న తెలిసి తెలియకనే ప్రశ్నల...