Sunday, 5 October 2014

కవిత నెం53:మన చేతిలో పర్యావ ''రణం''

కవిత నెం :53

*** మన చేతిలో పర్యావ ''రణం'' ****
ఓ మనిషీ ఆలోచించు నీ అవసరతను అన్వేషించి 

వరమైన ప్రకృతినే పదిలంగా మలుచుకొంటూ 
పర్యావరణం - అది పంచ భూతాల సమ్మేళనం 
పర్యావరణం - అది సహజ వనరుల నిక్షేపం 
చేయకురా కలుషితం అది చూడలేని  వికృతం 
పెంచకురా  కాలుష్యం అది నీ పాలిట విషం
చెట్టు ఉన్ననాడు అది నీకు ఇచ్చే గూడు 
ప్రాణవాయువును పంచి అది నీ ఊపిరికే తోడు 
నీటి కొరత చూడు అది భూమాతకే  చేదు 
నీరు ఉంటేనేగా కూడు పండే దండుగా 
రణగొణమను ధ్వనులతో చెయ్యకు యుద్ధం 
ఆ ధ్వనుల ఆక్రోశం మన పాలిట అనారోగ్యం 
పుడమితల్లి పసిడి కాంతులను బూడిద చేస్తూ 
వ్యర్దాలను పుట్టించే పరిశ్రమలకు పునాదులు వేస్తూ 
శాంతికపోతములైన పావురాలు మనము 
అహింసను సృష్టించే అణు భాంబు కూడా మనము 
ఎటు వెళ్ళిపోతున్నాం విమానా రెక్కలతో మనము 
విష క్రోరల ఉష్ణమునే మనలో విలీనం చేస్తూ 
భావితరాలకు అందించు భవితనే బంగారు దీపంగా 
పాటిస్తూ నీ విధులు ఈ పర్యావరణ సంరక్షకునిగా 

//రాజేంద్ర ప్రసాదు //07. 10. 2014

సాహితీ చిత్ర కవితల పోటీ కోసం  






Related Posts:

  • కవిత నెం :327(యాదాద్రి -శిల్ప కళా వైభవం ) కవిత నెం :327 ''యాదాద్రి -శిల్ప కళా వైభవం '' నల్లరాతి శిలల నుంచి జీవం పోసిన  అద్భుత కళాఖండాలు యాదగిరీశుడి సన్నిధిలో కొలువుదీరే సౌందర్య రూపాలు… Read More
  • కవిత నెం :326 (సి.నా .రె) కవిత నెం :326 *సి.నా .రె * కవితా శీర్షిక : సి .నా .రె క్రమ సంఖ్య : 68 రచన : గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్ బీరం గూడ ,హైదరాబాద్ తెలంగాణా ముద్దు బిడ్డ మ… Read More
  • కవిత నెం :322(నా జ్ఞాపకం) కవిత నెం :322 * నా జ్ఞాపకం * పుస్తకంలోని కొన్ని పేజీలు తిరగేస్తుంటే ఆ పేజీల మాటున ఒక ఫోటో (చిత్రం) అమాంతం గాలికి ఎగిరి నా ఎదపై వచ్చి వాలింది దాన్ని… Read More
  • కవిత నెం : 325 కనులు కలిసి కబురు తెలిసి గుండె పిలిచి నిన్ను తలచి మనసు అలసి గొంతు సొలసి నన్ను వలచి నీవు మరచి కధగా మలచి నీ ప్రేమ పరచి నా జెబ్బ చరచ… Read More
  • kavita samkya :332(నా మౌనం) kavita samkya :332 శీర్షిక : నా మౌనం  గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు  హైదరాబాద్ కకావికలమై క్రోధిస్తున్నది జకాశకలమై జ్వలిస్తున్నది తపోభూమిలో తపి… Read More

0 comments:

Post a Comment