Wednesday, 22 October 2014

కవిత నెం58:భళా భళి దీపావళి

కవిత నెం :58

దీపావళి
********************************************
ఇంటింటా ఆరంభమయ్యే ఆనంద హేళీ ''దీపావళి  ''
అమావాస్య చీకట్లను మాపే  నూతన వెలుగుల జాలీ ''దీపావళి ''
చెడును చంపి మంచిని పుట్టించే శోభావళీ ''దీపావళి ''
ప్రమిదల కాంతులు ,దీపాలంకరణలతో  పుట్టేదే ''దివ్య దీపావళి ''
అనేక విజయోత్సాహాల కధలను కల్గియున్న ''దివ్య చరితావళీ''
జాతి కుల మత భేదాలు లేనిది ఈ  ''నవ్య దీపావళి ''
కష్టాల్ని కాల్చేసి మందహాసాన్ని మదికి  చేర్చే ''కిరణావళీ ''
శ్రమల్ని కరిగించి ఆశల్ని అందించే ''రూపావళీ''
అల్లర్ని కల్పించి ఆహ్లాదాన్ని నిలిపింపచేసే ''రంగేళీ ''
చిరునవ్వులు పూయించి వెన్నలకాంతులనిచ్చే ''తారావళీ''
సకుటుంబ సంతోషాల ఉషస్సుల ''ప్రవాహహేళీ''
సంబరాల సరదాల అనురాగాల రవళి ''దీపావళి ''
ప్రతి ప్రతి ఘటనలో ఉదహరించే పదం ''దీపావళి ''
ఒక్క రోజుకే కాదు ప్రతి రోజూ ప్రతి ఇంటా ఇది వెల్లివిరియాలి 
అధికమైన ఖర్చుతో భాణసంచా చేసే ''భారీ దీపావళి ''
బ్రతుకు బండి సాగలేక బిక్కుమనే వారికి రావాలి ''దీపావళి ''
అన్యాయముతో అనగదొక్కబడే వారికి కావాలి ''దీపావళి ''
ఆత్మస్థైర్యముతో అడుగిడే ఆడపడుచులకు రావాలి  ''దీపావళి ''
మానవాళి మనుగడ ప్రశాంతతకు కావాలి ''దీపావళి ''
ఈ సమస్తలోకాన్ని సంరక్షిచుటకు రావాలి ''దీపావళి ''

ప్రపంచానికే మార్గదర్శక మౌళి ''దీపావళి ''
మన భారత్ దేశ సంసృతి ఇచ్చిన పండుగ ఇది భళా భళి 

సాహితీ సేవ దీపావళి కవిత పోటీ కొరకు 
//రాజేంద్ర ప్రసాదు // 23. 10 . 2014//











Related Posts:

  • కవిత నెం154:మనతో మండిన గ్రీష్మం కవిత నెం :154 మనతో మండిన  గ్రీష్మం  గుండెలు  అదిరిపడేలా ఎండలు మండిపోతున్నాయి దప్పికను తీర్చే నీరు దాహాన్ని తీర్చనంటున్నాయి అది… Read More
  • కవిత నెం153:ప్రశ్న కవిత నెం :153 ప్రశ్న  ఆదినుంచి ప్రశ్నలు పుడుతూనే ఉన్నాయి  మనలో మనకి కలిగిన సందేహాల హారం ''ప్రశ్న '' ఏదో తెలుసుకోవాలని మెదిలే కుతూహలం ''ప్ర… Read More
  • కవిత నెం 157:మండే సూరీడు కవిత నెం : 157 మండే సూరీడు  భగభగమంటూ ,ఎర్రటినిప్పై మండుతూఉంటాడు  సెగలనుకక్కుతూ,  ప్రపంచానికే వెలుతురునిస్తాడు  ఉదయంలా వచ్చి , ఉ… Read More
  • కవిత నెం155:అంతరంగసరాగాలు కవిత నెం : 155 ఎన్నో పరిచయాలు వాటితో ఎన్నెన్నో ప్రయాణాలు  మెలివేసుకునే స్నేహ సాంగత్యాలు , ఆ స్వర రాగం లోనుంచి పుట్టే హావ భావాలు, అంతరంగ… Read More
  • కవిత నెం156:నా అభీష్టం కవిత నెం : 156 నేను మాటలే కాని చేతలకి చొరవ చూపే వాడిని కాను  నేస్తం నా జీవితపయనం ఇక  కాబోదు  నా సన్నిహితం  నా ప్రాణ … Read More

0 comments:

Post a Comment