Friday, 24 October 2014

కవిత నెం59:ప్రకృతి వైపరీత్యాలు


కవిత నెం :59
ప్రకృతి వైపరీత్యాలు
***************************
ప్రకృతి మనకు సహజంగా లభించిన సంపదైతే
ఆ ప్రకృతి  ప్రళయాగ్నికి మానవ తప్పిదాలు ఎన్నో
ప్రకృతి ప్రకంపిస్తుంది సునామీగా ,తుఫాన్ గా, భూకంపంగా
ప్రజల ఆర్తనాదాలు ఆందోళనగా ,అందకారంగా
మండే ఎండలు ,అకాల వరదలు ,బీడు భూములు
ఎవ్వరు రాసుకున్నవి ఈ కలియుగ విధ్వంసాలు
చెట్లు నరుకుట , కలుషిత నీరు ,కాలుష్యమే ఫైరు
గాలిలో మేడలు ,అణు పరీక్షలు ,గనుల తవ్వకాలు
విద్యుత్ ప్రాజెక్టులు ,వ్యర్ధ పదార్ధాలు ,విరిగే కొండలు
మట్టిని మరచి మార్బుల్స్ , మూగజీవాల హంటింగ్స్
నాగరికతను విడచి కృత్రిమ జీవనంకై పరుగులు
వనారణ్యాలను ఖబ్జా చేసి స్మగ్లింగ్ దందాలు
మన ఎదగటమే ముఖ్యం  మన చర్యలే ప్రకృతికి శాపం
రోదిస్తోంది ఆకాశం ప్రకృతి విలయతాండవం చూసి
కన్నెర్ర చేసింది కాశ్మీరం మన కార్య కలాపాలను కాంచి
అమ్మ ఒడి లాంటిదిరా ప్రకృతి పాడుచేయకు 
సోమ్ములకోసం ఆశపడి ప్రకృతిని అమ్ముకోకు 
అందంగా ఉంచావో అది పర్యావరణం లేకుంటే రణం 
సహజ వనరుల నిక్షేపం అది మార్చకు దాని  ఆకృతి
పర్యావరణ క్షేమమే ప్రజా సంక్షేమము ,దేశ సౌభాగ్యము 

Related Posts:

  • కవిత నెం 259:సమయం లేదా మిత్రమా కవిత నెం :259 * సమయం లేదా మిత్రమా * కాలం చాలా విలువైనది ,నిరంతరంగా ప్రయాణించేది సమయ పాలన విలువ పెరిగి నిజంగానే  క్షణ తీరిక లేకుండా పోతున్నాం … Read More
  • కవిత నెం 247 :అంతర్యుద్ధం మనసుతో కవిత  నెం  : 247 *** అంతర్యుద్ధం మనసుతో ****** ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంది కుదురుగా ఉండదు కదా ఈ మనసు పైకి ప్రశాంతంగా ఉన్నా లోపల అలజడి అన్నీ… Read More
  • కవిత నెం 232 :కన్నీటి చుక్క కవిత నెం  :232 ***** కన్నీటి చుక్క ***** ఆకాశంలో పొడుస్తుంది వెలిగే చుక్క  మన అంతరాళంలో  ప్రవహిస్తుంది ఈ కన్నీటి చుక్క  … Read More
  • కవిత నెం 252 : కారణం లేని కోపాలు కవిత నెం : 252 * కారణం లేని కోపాలు * ఎందుకు కోపాలు ఎందుకు తాపాలు కాలం మళ్లీ తిరిగీ రాదు  కరగని పైత్యాలు అద్భుతమైన అనుబంధాలు ఆత్మీయతల అనురాగాలు … Read More
  • కవిత నెం 242 మన క్రియలే -మన ఖర్మలు కవిత నెం  : 242 *మన క్రియలే -మన ఖర్మలు * మనం ఏం చేస్తే అదే తిరిగి పొందుతాం అంటే ''బంతి సిద్ధాంతం '' ఒక నిర్వచనం  నువ్వు తిడితే తిరిగి తిడుత… Read More

0 comments:

Post a Comment