Friday, 28 August 2015

కవిత నెం164(రక్షా బంధన్)

కవిత నెం :164 రక్షా బంధన్ - రక్త సంబంధం  అన్నా చెల్లెళ్లకి  అక్కా తమ్ముళ్ళకి  వారి మధ్య ఉన్న ప్రేమకి  ఒకరంటే ఒకరికి  వెంట నడిచే తోడుకి  అనుబంధాల తీపి గుర్తుకి  రాఖీ - రక్షా బంధన్  రాఖీ - ప్రతి ఇంటికీ ఒక బంధన్  అమ్మలోని ''అ '' పదం  నాన్నలోని ''న్న '' పదం కలిపితేనే ''అన్న '' అమ్మ తర్వాత అమ్మగా  నాన్న లాగ బాధ్యతగా తోడుండేదే ''అక్క '' అన్నైనా -తమ్ముడైనా  నీకు అందివ్వగలిగేది ఆనందమే  అక్కైనా -చెల్లెలైనా  అపురూపమైన ఆప్యాయతల కొలువురా  మర్చిపోయే బంధాలను కలిపేది రాఖీ  మారిపోయే...

Wednesday, 26 August 2015

కవిత నెం 163:ఒక ఉల్లి కధ

కవిత నెం :163 ఒక ఉల్లి కధ ***********************  అనగనగా ఒక ఉల్లి  అవసరం ఇది మనకు డైలీ  వంటలరుచిలో ఇది బుల్లి చెల్లి  ఆరోగ్యాన్నిచ్చే పెద్ద తల్లి  ఏడిపిస్తుంది మన కళ్ళను గిల్లి  తినాలనిపిస్తుంది మళ్లీ మళ్లీ  దీని ధరలేమో డొల్లి డొల్లి  అందనంత దూరంగా వెళ్లి  పెడుతుంది పెద్ద లొల్లి  మన కడుపులు కాలి కాలి  ఉల్లి వాడకాన్ని స్లోలీ స్లోలీ  తగ్గించి వేస్తున్నాము గల్లీ గల్లీ  మరి చూపుతుందా మనపై జాలి  పెరిగిన ధరలను తగ్గించి మళ్లీ  చేసుకోగలమా ఉల్లితో హోలీ  మన రైతన్నలకు  ఇది...

Tuesday, 18 August 2015

కవిత నెం 162:అందమా .... చంద్రబింభమా

కవిత నెం :162 అందమా .... చంద్రబింభమా నన్ను నిద్దురపోనీయక చేసే రూపమా ప్రాణమా ... నా ప్రతి రూపమా నా  ఊపిరిని అందనీయకుండా చేసే పరువమా కావ్యమా .... ఖజూరహో శిల్పమా నీ ధ్యాసతో కుదురు లేకుండా చేసే పరిహాసమా గంధమా ... సుగంధమా నీ ఎద పరిమళాలతో మతిని పోగొట్టే  ప్రణయమా మౌనమా ... మధుర భావమా నీ జ్ఞాపకాలతో తిమ్మిరి పుట్టించే మౌనరాగమా రమ్యమా .... లావణ్యమా నన్నే పలకరిస్తూ ,నాకు ఎదురొచ్చే చిరు ధరహాసమా ప్రియతమా ... నా హృదయమా  నాకై తపిస్తూ ,నన్నే జపిస్తూ   నిరీక్షించే నా బంధమా               ...

Tuesday, 11 August 2015

కవిత నెం161:ఎందుకిలా చేస్తావు

కవిత నెం :161 *ఎందుకిలా చేస్తావు * మబ్బువై  కప్పేస్తావు  మనసు నిండా దాగుంటావు  మల్లెవై మురిపిస్తావు  ముద్దు ముద్దుగా గుర్తొస్తావు  ఊసులెన్నో పలికిస్తావు  ముచ్చట్లెన్నో చెప్పేస్తావు  నిజమై నిన్ను చేరవస్తే  సఖి ఎందుకిలా నిట్టూర్పై ఎదురొస్తావు  కలలోకి వస్తావు  ప్రేమ కధలెన్నో చెప్తావు  కళ్ళు తెరవగానే  వెక్కిరించి పోతావు  నీ జాడ లేని ప్రపంచంలో  ఒంటరిగా నన్ను మార్చావు ...