కవిత నెం :231
* ఆర్టీసీ బస్సు *
ఆర్టీసీ బస్సు ఓ ఆర్టీసీ బస్సు
మీది మీదికొస్తావు ఆర్టీసీ బస్సు
ఆర్టీసీ బస్సు ఓ ఆర్టీసీ బస్సు
రోడ్డు మొత్తం తిరుగుతావు ఆర్టీసీ బస్సు
ఎందుకలా చేస్తావు ఆర్టీసీ బస్సు
ఎగిరెగిరి పోతావు ఆర్టీసీ బస్సు
ఏమంతా దర్జా నీది ఆర్టీసీ బస్సు
వెనక ముందు చూడవు ఆర్టీసీ బస్సు
పేరుకేమో నువ్వు ఆర్టీసి బస్సు
నియమాలు పాటించవు ఆర్టీసీ బస్సు
నీకోసం ఉంటుంది చక్కటి దారి
నీకోసమే వేచింది బస్ షెల్టరు మరి
ఆగమంటే ఆగవు ఆపించే చోట
అడ్డంగా పోతావు రోడ్డు జామున్న చోట
ఎందుకలా చేస్తావు ఆర్టీసీ బస్సు
నీ ముందు వాహనాలే తుస్సు తుస్సు
ఏమంతా దానివే...
Thursday, 27 October 2016
Saturday, 8 October 2016
కవిత నెం 230 :కన్నీరు
కవిత నెం : 230
''కన్నీరు ''
కంటి నుండి వచ్చును 'కన్నీరు'
మనసు చెమ్మగిల్లితే ఆ భాదే నీరు
ఉప్పొంగే దుః ఖమే 'కన్నీరు '
ఉప్పెనగా మారితే అది ఏమవును ,ఏమవును ?
ఆడువారిలో ఇది అగ్రస్థానము
ప్రతి సున్నితమైన మనస్సులో ఇది సుకుమారము
సంతోషమైనా ,ప్రేమైనా చలించిపోవును
మన రెండు కళ్లనూ తడిమి తడిమి తోడువచ్చును
గుండెలోన భాదకు ఓదార్పు 'కన్నీరు'
ఆత్మీయంగా హత్తుకునే స్పర్శ 'కన్నీరు'
భారాన్ని కరిగించే ఆయుధం 'కన్నీరు'
బాధలను చెరిపి మనసుని తేలిక చేసే 'కన్నీరు '
పొరపాటుని దిద్దే బెత్తం ఈ...
కవిత నెం 229 :ఎందుకే చెలీ!
కవిత నెం :229
ఎందుకే చెలీ
ఏమిటే హృదీ
చేస్తుంది అలజడీ
ఉండదా మదీ
నా జత కూడి
తెలియని తొందరేదో పడి
ఆగలేని ఆవేశమూ
అర్ధమవ్వని ఆక్రోశమూ
నీలో నువ్వే ఏకము
మనకు మిగిలే ఏకాంతము
జీవితము భారము
చిదిలిన బంధము
చేరువైన దూరము
చిన్ని ఆశ మాయము
ఎందుకీ పంతము
ఏది నీ సొంతము
తెలియని పైత్యము
తగులు మిగులు అంతము
- 08. 10. 16 //గరిమెళ్ళ గమనాలు ...
Friday, 7 October 2016
కవిత నెం 228:ప్రేమను ఆపగలిగేది ఏది ?
కవిత నెం :228
*ప్రేమను ఆపగలిగేది ఏది ?*
ఉదయించిన కిరణం
అస్తమానికి చేరుకుంటుంది
పుష్పించిన కుసుమం
వాలిపోయి ,వాడిపోవటానికి సిద్ధంగా ఉంది
నింగిలోని జాబిలి కోసం వేచి వేచి
కళ్లకు కళేభరం కాపు పట్టుకుంది
నిండుగా కనపడే ఉద్యానవనం
ఎండుగా ,ఎడారిగా మారిపోతుంది
నాలో సహనం అసహనమై ఆవహించింది
నీపై ప్రేమ చిగురుని మాని నిర్వీర్యమై నేలకొరిగింది
నాలో ఇష్టం ,నీరసించి కృషించిపోయింది
నీ ప్రేమకు అంతం పలుకుతూ ,పంతంగా బ్రతకలేనంది
- 08. 10. 2016 // గరిమెళ్ళ గమనాలు ...
Tuesday, 4 October 2016
కవిత నెం 227 :మన హైదరాబాద్ (కవితా రూపంలో )
కవిత నెం : 227
''మన హైదరాబాద్ ''
(కవితా రూపంలో )
తెలంగాణా రాజధాని మన హైదరాబాద్
తెలుగు ప్రజల గుండె చప్పుడు మన హైదరాబాద్
నవాబుల నాటి చరిత్ర ఉన్న ఈ హైదరాబాద్
ప్రపంచమంతా పేరుగాంచెను మన హైదరాబాద్
ఇది భాగ్యనగరం .... ఇది విశ్వ నగరం
భారతదేశంలోనే 5వ అతి పెద్ద మహా నగరం
ఇచ్చట కుల ,మతాలకు తావు లేదు
సర్వ భాషల గ్రంధాలయం మన హైదరాబాద్
ప్రతీ రంగమూ ఇక్కడ నుండే ఆరంభము
రాజకీయాలకు పుట్టిన నిలయం భాగ్య నగరం
సంసృతి ,సమైక్యతల సుస్థిర వారసత్వము
సుందరమైన కట్టడాలలో ఇది సంపన్న నగరము
హైదరాబాద్ నడిబొడ్డున...