Sunday 19 March 2017

కవిత సంఖ్య :279 (వస్తుంది ఉగాది !)

కవిత సంఖ్య :279

కవితా శీర్షిక : వస్తుంది ఉగాది !

తెలుగింటి ముంగిలి లోకి 
ఇష్టం పెంచుకుని మరీ వస్తుంది ఉగాది 
స్వచ్ఛమైన మనసులకు ఆహ్లాదం అందివ్వటానికి 

పిండి వంటల ఘుమ ఘుమలతో ..
ఉవ్విళూరిస్తూ.. వస్తుంది ఉగాది  
ఉరకలేసే సంతోషాల సంబరం తేవటానికి 

కొత్త కొత్త అందాలను తనతో తెస్తూ వస్తుంది ఉగాది
ఆమని సొగసులతో .. పగడాలను కూర్చటానికి 


కమనీయమైన ఆలాపనతో వస్తుంది  ఉగాది
కోయిలమ్మ పలుకులు వినిపించటానికి

మురుస్తూ ,మెరుస్తూ వస్తుంది ఉగాది
మామిడాకుల తోరణాలతో మది నింపటానికి

పరిపూర్ణమైన పచ్చదనంతో వస్తుంది ఉగాది
ప్రకృతితో కలిసి మయూరిలా నర్తించటానికి

మల్లె జాజుల పరిమళ గంధం పుస్తూ..వస్తుంది  ఉగాది
ఆంద్రుల ఆడపడుచులతో.. పెనవేసుకున్న బంధం చూపటానికి


తెలుగు సంవత్సరంలో అడుగుపెట్టే ఉగాది
ప్రధమమైన పండుగతో శోభను విరాజిల్లటానికి

షడ్రుచుల సమ్మేళనంతో వస్తుంది ఉగాది
జీవితంలో అన్ని కర్మలకు అలవాటుపడటానికి

ఒక వేడుకలా వచ్చిన ఉగాది
మనకెంతో నేర్పే వెళ్తుంది ఈ ఉగాది

వసంతఋతువుకు వన్నెల చిన్నారి ఉగాది
పంచాగశ్రవణం తో సూచనలు చేసే ఉగాది

అందమైన అనురాగబంధం ఉగాది
చైత్ర శుద్ధ పాడ్యమితో సరి కొత్త నామంతో
ప్రతీ వత్సరం మన సంస్కృతి -సంప్రదాయాలతో 
నిత్య నూతన ,మంగళకర మహోత్సవం ఈ ఉగాది 
- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్ 
(21. 03. 2017) 







0 comments:

Post a Comment