Wednesday 24 May 2017

కవిత నెం :290(మారాలి)

కవిత నెం :290

మారాలి మారాలి
ఈ ప్రపంచం మారాలి
నువ్వూ మారాలి నేనూ మారాలి
మనం మారాలి ఈ జనం మారాలి
చూస్తూ ఉంటే రోజులు పోతాయి
కూర్చుని తింటే కొండలు కరుగుతాయి
మనకెందుకు అనుకుంటే
మనల్ని కూడా వదిలించే రోజులు వస్తాయి
ముందుకు కదిలితేనే అడుగు పడుతుంది
వెనకకి తిరిగితే లక్ష్యం దూరమవుతుంది
మారాలి మారాలి
ఈ ప్రపంచం మారాలి
ఎదో ఒకసారి
ఎప్పుడో ఒకప్పుడు
ఎక్కడో ఒకచోట
మార్పు అనేది అవశ్యం
మార్పు ఉండనిదే తత్వం మారదు
మార్పు లేనిదే వ్యక్తిత్వం పుట్టదు
మనం మారుతూనే ఉంటాం
మన పరిసరాలు మారుతూనే ఉంటాయి
కదిలే కాలంతో పాటు
కదిలే మనుషులతో పాటు
మనమూ మారకతప్పదు
మనలో కొంతైనా మార్పు రాక తప్పదు
కాబట్టి మార్పు అనేది ఉండాలి
మార్పు అనేది జరగాలి
ఒక పెనుమార్పు ప్రపంచాన్నే మార్చేస్తుంది
మార్పుకి సమయం , ముహూర్తం ఉండదు
మార్పు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు
మార్పు జరిగితే సంతోషించు
మంచి మార్పు కోసం నువ్వు పరిత్యజించు
ఒక మార్పుతో నీ జీవితాన్ని కొత్తగా జీవించు

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు 

0 comments:

Post a Comment