12, డిసెంబర్ 2017, మంగళవారం

కవిత నెం :311(మన పల్లెసీమ)




కవిత నెం :311

మన పల్లెసీమ


ప్రకృతితో దర్శనమిచ్చేది
బద్దకాన్ని వదిలించేది
ఆరోగ్యాన్ని ప్రసాదించేది
''మన పల్లె సీమ ''

అందాలతో విందుచేసేది
ఆమని సొగసులనందించేది
ఆడపడుచుల అనురాగమది
''మన పల్లెసీమ ''

చిన్నా పెద్దా బేధం లేనిది
చీకు చింత చూపకుంటది
ఆటలు -పాటలు కలుపుకుంటది
''మన పల్లెసీమ ''

పేదా ధనిక పొంతలేనిది
పాడిపంటల భాగ్యమున్నది
రైతుకు మిక్కిలి ఊపిరైనది
''మన పల్లెసీమ ''

అందరికీ బందువైనది
ప్రతీ బంధం విలువైనది
ప్రేమకు పెన్నిధిగా ఉన్నది
''మన పల్లెసీమ ''

మానవత్వం జాడ ఉన్నది
మనిషిగా నిన్ను కన్నది
మమతల సమతల తోడుకలది
''మన పల్లె సీమ ''


సద్దన్నం బలము అన్నది
ఊరగాయలో రుచిఉన్నది
ఆవగాయలో ఆకలి ఉన్నది
''మన పల్లె సీమ ''


సరదాల  జాతరున్నది
సంబరాల మోత ఉన్నది
పండుగలకు నిలయమైనది
''మన పల్లె సీమ ''


జీవనాన్ని నీకు నేర్పింది
నీ జీవితాన్ని నీకు ఇచ్చింది
నేడు ఒంటరిగా తాను మిగిలింది
''మన పల్లెసీమ ''

విదేశీ చదువుల  ధ్యాసలో
పాశ్చాత్త అలంకరణ మోజులో
స్వార్ధపు యోచన క్రమములో
మన సంస్కృతి మరచిన వేళలో

నీకోసం వేచి ఉంటుంది
''మన పల్లెసీమ ''
ఒక్కసారి అయినా తనని చూడమని
వేడుకుంటుంది '' మన పల్లెసీమ ''













కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి