Friday, 21 March 2014

కవిత నెం 17:అమ్మంటే

కవిత నెం :17

అమ్మంటే ప్రేమకు అపురూపం 
అమ్మ  అను పిలుపే ఆయుష్షునిచ్చే అమృతం 
కనిపించే మమతల కోవెల అమ్మ 
కదిలొచ్చే  ఆమని వెలుగు అమ్మ 
మాతృత్వానికి మానవతా రూపం అమ్మ 
ఆప్యాయత అనురాగాల అవని అమ్మ 
మనసులో మెదిలే భావాక్షరం అమ్మ 
కలత చెందగా శక్తినిచ్చే మాతృబలం అమ్మ 
ఏ కష్టమంటూ దరిచేరనీయంది అమ్మ 
ఏ కల్మషం తెలియని కారుణ్యమూర్తి అమ్మ  
బాధను గుండెలో దాచుకొని ప్రేమను పంచేది అమ్మ 
ఈ జగతికే జనని ,సృష్టి కే ప్రతి సృష్టి అమ్మ 
ఎంత చెప్పినా తక్కువే అమ్మ గురించి 
తీర్చుకోలేని ఋణము కదా  మన నుంచి 
''మాతృ దేవో భవ '' అన్నది మరువకురా 
ఆదిలోనే అమ్మ ప్రేమను త్రుంచకురా
అమ్మ నువ్వెప్పుడూ బాగుండాలి 
అమ్మ నీ ప్రేమదీవెన మాకు తోడుగా ఉండాలి  

Related Posts:

  • కవిత నెం93:ఎక్కడ ఉందొ ఆ జాభిలమ్మ కవిత నెం :93 కవిత పేరు    : ఎక్కడ ఉందొ ఆ జాభిలమ్మ రచన           : రాజేంద్ర ప్రసాదు … Read More
  • కవిత నెం90:happy new year కవిత నెం :90 అందరికీ అభివందనం ఆహ్వానాల నీరాజనం పల్లవి : హిమాలయమంత  మనస్సుతో - happy new year  నయాగరా ఉషస్సులా - happy new year ఎవరైనా ఎప్… Read More
  • కవిత నెం91:ATM కవిత నెం :91 ATM ఓయ్ నేనే అంటే నీకు తెలుసా ? తెలియదు ఎందుకు తెలుస్తుంది నా పేరు ATM ALL TIME MONEY అని నన్ను పిలుస్తారు అవసరమైన టైం లో ఆకస్మాత… Read More
  • కవిత నెం94:చదువు కవిత నెం :94 చదువు  రచన : 19 , హైదరాబాద్  అ, ఆ, ఇ, ఈ ల చదువు  అమ్మ , నాన్నల పదాలకే చదువు  ఆరు బయట చదువులు  వీడ… Read More
  • కవిత నెం89:నేటి పదవులు - వాటి విలువలు కవిత నెం :89 నేటి పదవులు - వాటి విలువలు  ఏమిటి ఈ రాజకీయము  ఎక్కడుంది ప్రజాస్వామ్యము  మన నాయకుల ఇష్టారాజ్యము  ఎటువెళ్తుంది ప్రజ… Read More

0 comments:

Post a Comment