11, డిసెంబర్ 2014, గురువారం

కవిత నెం76 (స్త్రీ..ఆవేదన)

కవిత నెం :76 
//స్త్రీ..ఆవేదన.  //
ఆడదంటే అగ్గిపుల్ల ,సబ్బుబిళ్ళ కాదురా
ఆడదంటే ఆదిశక్తి ,నీ జన్మ కారణం తానురా
భూమాత లాంటి సహనగుణం ఉందిరా
భరించలేని భాదనైనా ,విషంలాగా మ్రింగురా
అమ్మతాను .. అనురాగంతాను .. మమతలకోవెలే తానురా
అక్కతాను .. ఆప్యాయతతాను.. అభిమానించే హృదయం తానురా
భార్యతాను .. నీ బ్రతుకుతాను.. పవిత్రమైన బంధం తానురా
ఎటునుంచి నీ అడుగు సాగినా ,నడిపించే పాదం తానురా
దేవతలెందరుఉన్నా ,సృష్టికి మూలమైన శక్తిస్వరూపం తానురా
ఎదుగుతున్న సమాజంలో ,నలుగుతున్న అబలరా ,అబలరా 
అందరిలానే ఉన్న ఆడజన్మ ,ఆదిలోనే అంతానికి ఆరంభమా ?
విహరించే స్వేచ్చ ఉన్న లోకంలోనా ,స్వేచ్చాపంజరాన్ని ధరియించేనా
అనుమానాలు -అవమానాల మధ్యన ఆడపిల్ల జీవన గమనం 
బిక్కుమంటూ -భయపడుతూ మృగజీవులతో పోరాడే తరుణం 
చదువు సంద్యలలోను ,సంప్రదాయంలోనూ ప్రధమశ్రేణి లో ఉన్నా
వంటింటికుందేలుగా కట్టిపడేసే మగ పురుషాంకారం  ముందు సున్నా 
పెళ్లి అంటే పైసా రాబడి అంటూ వరకట్న రాబందుల  వేదింపులు 
నేటికాలంలో కూడా అమ్మాయికి తప్పని అరాచికా హత్యాయత్నాలు 
ఆడపిల్లని కనటం వారి పాలిట శాపమని ,ఆగని ఆత్మహత్యలు 
ఆడదంటే తన అవసరాలు తీర్చే బానిస అనేవాళ్ళు లేకపోలేదు 
ఆడది కనపడితే చాలు విచక్షణ మరచే ఉన్మాదక్రియలు  
స్నేహమని పేరు చెప్పి ,ముసుగులో చేసే తుంటరి చేష్టలు 
ప్రేమిస్తున్నామని చెప్పి ,ఒప్పుకోకపొతే  యాసిడ్ దాడులు
ఒక వస్తువులా ఉపయోగించుకుంటూ పెరిగే వ్యభిచారాలు 
అడుగడుగునా ఆడవారికి ఎదురయ్యే అర్ధరహిత  సమస్యలు 
స్త్రీ కి కరువవుతున్న ఆత్మరక్షణ ,లోలోపల ఆరని సంఘర్షణ 
ఆనాటి సీతాదేవి నుంచి ప్రతి మహిళకు కన్నీటి వేదన 
అక్కున చేర్చుకుని ఆదరణ చూప జాలి లేదురా  
స్త్రీ మూర్తిని  గౌరవించటం  మనకు తెలిసిన సంస్కారం 
ఆడవారి ఆత్మాబిమానాన్ని అబిమానంగా కాపాడుదాం 

//రాజేంద్ర ప్రసాదు // 12. 12. 14//
సాహితీ సేవ చిత్ర కవిత -8 కొరకు 






  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి