Wednesday 3 December 2014

కవిత నెం72:బాల్యం

కవిత నెం :72

బాల్యం
అందమైన బాల్యం - అది అందరికీ అమూల్యం
మధురమైన బాల్యం - అది తిరిగిరాని కాలం
మరువలేని జ్ఞాపకం - ఒక తీపి సంతకం
అనుభూతుల పుస్తకం - అరుదైన జీవితం 
అమ్మఒడిలో, కొంగు చాటున పెరిగిన  బాల్యం 
గోరుముద్దలు ,బుగ్గ బుగ్గలో పెట్టుకున్న బాల్యం 
కల్మషాలు లేని స్నేహాలను పొందిన బాల్యం 
బడి కెల్లనని  మారంచేస్తూ చదువుకున్న బాల్యం 
గోలి ఆటలు ,గోడుం బిళ్ళ ఆడుకున్న బాల్యం 
పిప్పరమెంట్లు ,నిమ్మతొనలు చప్పరించు  బాల్యం 
మరమరాలు ,పప్పు చెక్కలు ఆరగించు బాల్యం 
ఏటిగట్టున, ఎడ్లబండిపై విహరించు బాల్యం 
తాటిముంజులు ,ఈతకాయలు  ఇష్టపడిన బాల్యం 
5 పైసలు ,రూపాయి నోటులు ఖర్చు చేసిన బాల్యం 
కొబ్బరాకు గాలిపటాలు ,కాగితపు పడవల బాల్యం 
మట్టితోటి బొమ్మలు చేసి మురిసిపోయిన బాల్యం 
సైకిళ్ళ పరుగులు తీసి సరదాలు చూసిన బాల్యం 
పండగల ,పబ్బాలకు అల్లరి చేసిన బాల్యం 
అలసట లేకుండా రేయింబవళ్ళు ఆడిన బాల్యం 


0 comments:

Post a Comment