Saturday 20 June 2015

కవిత నెం 158:నాన్న నువ్వంటే ఇష్టం

కవిత నెం :155
నాన్న నువ్వంటే ఇష్టం 

నువ్వంటే ఇష్టం నాన్న 
నీ రూపం నా  ఊహలకు మాత్రమే పరిమితమైనా 
నువ్వంటే ఇష్టం నాన్న 
నీ వేలుపట్టి నడకనేర్చింది గుర్తులేకపోయినా 
నువ్వంటే ఇష్టం నాన్న 
నీ భుజాలపై , ఆడుకున్నది జ్ఞాపకాలకే సొంతంఅయినా 
నువ్వంటే ఇష్టం నాన్న 
నన్ను నీ గుండెకు హత్తుకున్న స్పర్శ నాకు దూరంఅయినా 

నాన్నంటే .... తన మనసు వెన్న అని 
నాన్నంటే .... నిలువెత్తు రూపం అని 
వింటుంటే నా చెంత నువ్వెందుకు లేవనిపిస్తుంది నాన్న 

పుట్టింది అమ్మ కడుపులో నుంచైనా 
నా జన్మ నీ రక్త సంబంధమే కదా నాన్న 

పసితనంలో నేను నిన్ను నాన్న అని పిలిచానో లేదో కూడా తెలియదు 
నేను నీలా ఉన్నానని 
నేను నే రూపంలా పెరిగానని 
నిన్ను చూసిన వాళ్ళు నన్ను చూసి 
నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంటే ఆనందపడ్డాను 
నాకు నువ్వు ఇచ్చిన ఈ గుణమే ... ఓ మూల ధనము 
నాకు నువ్వు పంచిన అక్షరం .... సంస్కారం 
కాలంతో పాటు నువ్వు వెళ్ళావో .... 
ఏకాంతంలో నన్ను విడిచి వెళ్ళాలో తెలియదు నాన్న 
ఎందరు నా చెంత ఉన్నా , 
నాకు కావలసింది నాకు దొరికినా 
ఏదో తెలియని లోటు ఎద మాటున మౌనంలా మెదులుతున్నా 
నాన్న నువ్వంటే నాకు ఇష్టమే 
ఈ జన్మ ఒక అదృష్టమే నాన్న నువ్వు నాకు నాన్న వైనందుకు 



0 comments:

Post a Comment