Wednesday 26 August 2015

కవిత నెం 163:ఒక ఉల్లి కధ

కవిత నెం :163
ఒక ఉల్లి కధ
*********************** 

అనగనగా ఒక ఉల్లి 

అవసరం ఇది మనకు డైలీ 
వంటలరుచిలో ఇది బుల్లి చెల్లి 
ఆరోగ్యాన్నిచ్చే పెద్ద తల్లి 
ఏడిపిస్తుంది మన కళ్ళను గిల్లి 
తినాలనిపిస్తుంది మళ్లీ మళ్లీ 
దీని ధరలేమో డొల్లి డొల్లి 
అందనంత దూరంగా వెళ్లి 
పెడుతుంది పెద్ద లొల్లి 
మన కడుపులు కాలి కాలి 
ఉల్లి వాడకాన్ని స్లోలీ స్లోలీ 
తగ్గించి వేస్తున్నాము గల్లీ గల్లీ 
మరి చూపుతుందా మనపై జాలి 
పెరిగిన ధరలను తగ్గించి మళ్లీ 
చేసుకోగలమా ఉల్లితో హోలీ 
మన రైతన్నలకు  ఇది కల్పవల్లి 
వీటి ధర బాగుంటే వారెంతో జాలీ 
ధర తగ్గితే డీలాపడతారు సొమ్మసిల్లి 
మరి ఏం చిత్రం చేస్తుందో ఈ ఉల్లి బుల్లి 
ఉల్లంటే మన అందరికీ ఎంతో లౌలీ 
కాదని చెప్పగలరా సో సిల్లీ 
                             - గరిమెళ్ళ గమనాలు 



                   




0 comments:

Post a Comment