2, జూన్ 2016, గురువారం

కవిత నెం 216:అత్యాశ ప్రమాదం

కవిత నెం :216
*అత్యాశ ప్రమాదం *

ఒద్దురా మనిషీ 
నీ అవసరంకు మించి 
ఆశపడి - అత్యాశ పడి 

చూడరా మనిషీ 
నీ జీవితం పంచి 
సంతోషపడి - సహాయం పడి 

మట్టి ముద్దరా ఈ జీవితం 
నీ పుట్టుకే కాదు శాశ్వతం 

ఒంటరిగానే పయనం 
ఆశించకు ఏ సహవాసం 

నువ్వు కనపడితేనే ఇష్టం 
నువ్వు లేకుంటే ఎవరికీ కష్టం 

పేరు ఉంటేనే పడతారు 
బ్రతికి చెడితే తిడతారు 

డబ్బు ఉంటేనే చూస్తారు 
జబ్బు పడ్డావో పోతారు 

ఎవరికోసం నీ ఆరాటం 
ఏముంటుంది నీతో బంధం 

అనుకున్నది చెయ్యటం 
అందలేనిది పొందటం 
అందరిలో ఉండటం
ఒక్కడిగా పోవటం 

ఇదే జీవిత సత్యం 
ఉండలేరు ఎవ్వరూ 
కాలానికి అతీతం 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి