9, జూన్ 2016, గురువారం

కవిత నెం 219:ప్రయత్నే కార్యసిద్ది

కవిత నెం : 219
*ప్రయత్నే కార్యసిద్ది *
ఒక ప్రయత్నం .... దానికి లేదు నిర్దేశం 
ప్రయత్నిస్తూ - విఫలమవుతూ 
అందుతూ - జారిపోతూ 
ఊరిస్తూ -వెక్కిరిస్తూ 
ఆశ అంటూ పెట్టుకోలేదు కాని 
అది నన్ను మోసం చేస్తూనే ఉంది 
నిరాశ నీడలోన నన్ను నడిపిస్తూ 
మరో సారి నన్ను ప్రయత్నించమంటూ 
బ్రతిమాలదు కాని నన్ను అది వదలదు 
ఓటమిస్తుందో ,గెలిపిస్తుందో చెప్పదు 
విమర్శ వద్దంటుంది 
కాని నన్ను ప్రయత్నించటం 
మానవద్దు అంటుంది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి