25, నవంబర్ 2016, శుక్రవారం

కవిత నెం 237: నీ ప్రేమకు సలాం

కవిత నెం : 237
* నీ ప్రేమకు  సలాం * నా మనసు మళయమారుతం లా మారింది 
నీ ముద్దు మాటల తడి నన్ను చేరగా 

నన్ను మార్చాలని ప్రయత్నించి 
నిన్ను నన్నుగా మార్చుకున్నావా నాకోసం 

నీ కలవరింత నాకోసం అని తెలియక 
నేను కలవరిస్తూనే ఉన్నా నీ జ్ఞాపకాల మాటున 

నీలో ప్రేమ పుట్టించగలనని అనుకోలేదు 
కొత్తగా పుట్టిన నీ ప్రేమ నన్ను ముగ్దుడని చేస్తుంది 

- గరిమెళ్ళ గమనాలు 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి