Sunday 29 March 2020

కవిత నెం : 337(కరోనా )

కవిత నెం : 337
కరోనా 

ఈ కరోనా ప్రభావంతో
ఒక మనిషి ఆలోచనలు
భూమి గుండ్రంగా తిరుగుతున్నట్టు
ప్రపంచం మొత్తం ఒకేసారి తక్కువ సమయంలో
వారి గతం నుంచి వర్తమానం వరకు
నేటి వర్తమానం నుంచి భవిష్యత్తు కొరకు
నిముషానికి గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుందో
అన్ని సార్లు ఆలోచన ప్రవాహాలు పరిగెత్తుతున్నాయి

ఒకవైపు ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని
అది ఉంటుందా పోతుందా అనుమానం
ఒకేసారి ప్రాణం పోయినా పర్లేదు
అది సగం గమ్యం వైపు వెళ్లి ఎక్కడ సంకటమవుతుందో అని
ఒకేసారి మన జీవం మన శరీరాన్ని విడిచిపోతే
మన చుట్టూ పేరుకుని ఉన్న బంధాలు ,బాధ్యతల పరిస్థితి
ఈ ప్రళయం విషమం కాకపోయినా మన జీవితాన్నే
ఆర్థికంగా కుదిపేస్తే మరలా మొదటినుంచి
మనిషి తన ప్రయాణం మొదలెట్టాల్సిందే

అడవిలో ఆదిమానవుడిగా ఉన్నంతసేపు
తను చాలా సంతోషంగా నిస్వార్ధంగా జీవించాడు
పోను పోను అవసరాలని బట్టి తనని తాను
మలచుకుంటూ నిదానిదానంగా అభివృద్ధి సాధించాడు
అందమైన పల్లెల్లో ఉన్నప్పుడు కూడా
కుటుంబంతో సంతృప్తిగా జీవనం సాగించాడు
బ్రతుకు తెరువుకు పల్లెని విడిచి పట్నం వాసనమెరిగి
ధనమే ప్రధానంగా అంచెలంచల బాట సాగించాడు
ధనం ఎంత సంపాదిస్తున్న కొద్దీ మనిషి నెత్తిపైకి ఎక్కి
తను చెప్పిందే వినమంటూ సుదూర సువాసనలకు మోజు పడ్డాడు
తన అభివృద్ధితో పాటు సంస్కృతి సంప్రదాయాల్ని మార్చుకున్నాడు
నేడు




0 comments:

Post a Comment