కవిత నెం :77
ప్రేమ కోసం - కవితా ''కారం ''
****************************
నమస్కారం !
నువ్వంటే నాకు ''మమకారం''
కాదు అది ''చమత్కారం''
నీ నవ్వు ఒక ''అలంకారం''
నా మనసు చేస్తుంది ''ఝూంకారం''
చెయ్యకు సుమా నీవు దాన్ని ''వెటకారం''
నీ కోసం తింటా ''గొడ్డుకారం''
నిన్ను చూసి నేర్చుకున్నా ''ఉపకారం''
మరి నాకైతే చెయ్యవుగా ''అపకారం''
నా కళ్ళలో కొట్టకు ''సూరేకారం''
నా ప్రేమకు ఆ పంచభూతాలే ''సాక్షాత్కారం''
నా ప్రేమ మంత్రం ''ఓంకారం''
నీ ప్రేమకొరకు కట్టా ''శ్రీకారం''
చిరాకుతో చూపకు ''ఘీంకారం''
మన...
Friday, 19 December 2014
Thursday, 11 December 2014
కవిత నెం76 (స్త్రీ..ఆవేదన)
కవిత నెం :76
//స్త్రీ..ఆవేదన. //
ఆడదంటే అగ్గిపుల్ల ,సబ్బుబిళ్ళ కాదురా
ఆడదంటే ఆదిశక్తి ,నీ జన్మ కారణం తానురా
భూమాత లాంటి సహనగుణం ఉందిరా
భరించలేని భాదనైనా ,విషంలాగా మ్రింగురా
అమ్మతాను .. అనురాగంతాను .. మమతలకోవెలే తానురా
అక్కతాను .. ఆప్యాయతతాను.. అభిమానించే హృదయం తానురా
భార్యతాను .. నీ బ్రతుకుతాను.. పవిత్రమైన బంధం తానురా
ఎటునుంచి నీ అడుగు సాగినా ,నడిపించే పాదం తానురా
దేవతలెందరుఉన్నా ,సృష్టికి మూలమైన శక్తిస్వరూపం తానురా
ఎదుగుతున్న సమాజంలో ,నలుగుతున్న అబలరా ,అబలరా
అందరిలానే ఉన్న ఆడజన్మ ,ఆదిలోనే అంతానికి ఆరంభమా ?
విహరించే స్వేచ్చ...
Wednesday, 10 December 2014
కవిత నెం75(తెలుగమ్మాయి)
కవిత నెం :75
తెలుగమ్మాయి
**********************************
కాటుక సొగసుల మాటున కలువల్లాంటి కళ్ళు
దోరతనం పూసుకున్న దొండపండు లాంటి పెదాలు
చక్కిలి గింతలు పెట్టే చేమంతుల్లాంటి చెక్కిళ్ళు
చంద్రబింబాన్ని పోలినది ఆమె అరవిందం
నుదుట మద్యన జ్యోతిలా ప్రకాశించే సింధూరము
ఊగుతూ మనసు లాగుతూ ఉండే వయ్యారి వాలుజడ
కొప్పులో దాగి పరిమళాలతో దోబూచులాడే మల్లెలు
వాలుజడకు మరింత అందాన్ని పెంచే పట్టు పావడాలు
చెవులకు వేలాడుతూ గుసగుసలాడే జూకాలు
విరిసిన కుసుమం లాంటి చిరు దరహాసము
గలగల పారే...
Monday, 8 December 2014
కవిత నెం74(ప్రాస కనికట్టు )
కవిత నెం :74
ప్రాస కనికట్టు
****************************
మంచికొక లైక్ కొట్టు
చెడునైతే చెదరగొట్టు
చిరునవ్వు కివ్వు తొలిమెట్టు
హాస్యాన్ని పంచిపెట్టు
న్యాయానికి జై కొట్టు
అన్యాయంకెయ్యి ఆనకట్టు
స్వార్ధాన్ని మట్టుపెట్టు
పరమార్ధాన్ని కనిపెట్టు
సత్యాన్ని నిలబెట్టు
అబద్దాన్ని కట్టిపెట్టు
మానవతకు ముద్దుపెట్టు
ఉన్మాదం పనిపట్టు
స్నేహానికి చెయ్యిపట్టు
శత్రువులను విడిచిపెట్టు
కోపాన్ని అదుపుపెట్టు
ప్రశాంతతను పిలిచిపెట్టు
భయాన్ని దాచిపెట్టు
ధైర్యానికి పదునుపెట్టు
దేవుడికి...
Wednesday, 3 December 2014
కవిత నెం73:బాల్య సొగసులు
కవిత నెం :73
బాల్య సొగసులు : (శ్రీ పద్మ )
************************************
అమ్మపొత్తిళ్ళలో ముద్దుగా మురిసిన బాల్యం
నాన్న గారాబంతో గుఱ్ఱపు ఆటలు ఆడిన బాల్యం
చందమామ పాటలతో గోరుముద్దలు తిన్న బాల్యం
గోనెసంచులు కప్పుకుని వానలో చిందులేసిన బాల్యం
కాగితపు పడవలు చేసి కేరింతలు కొట్టిన బాల్యం
బడి కెళ్ళనని మారం చేస్తూ ,బెట్టు చేసిన బాల్యం
వేమనపద్యం ,సుమతీ శతకాలు అప్పచెప్పిన బాల్యం
వెంకటేశ్వర & కో పుస్తకంలో ఎక్కాలను గణించడాలు
పుట్టమన్నుతో బొమ్మరిల్లు కట్టి ,చేసిన బొమ్మల పెళ్లిళ్లు
చింత...
కవిత నెం72:బాల్యం
కవిత నెం :72
బాల్యం
అందమైన బాల్యం - అది అందరికీ అమూల్యం
మధురమైన బాల్యం - అది తిరిగిరాని కాలం
మరువలేని జ్ఞాపకం - ఒక తీపి సంతకం
అనుభూతుల పుస్తకం - అరుదైన జీవితం
అమ్మఒడిలో, కొంగు చాటున పెరిగిన బాల్యం
గోరుముద్దలు ,బుగ్గ బుగ్గలో పెట్టుకున్న బాల్యం
కల్మషాలు లేని స్నేహాలను పొందిన బాల్యం
బడి కెల్లనని మారంచేస్తూ చదువుకున్న బాల్యం
గోలి ఆటలు ,గోడుం బిళ్ళ ఆడుకున్న బాల్యం
పిప్పరమెంట్లు ,నిమ్మతొనలు చప్పరించు బాల్యం
మరమరాలు ,పప్పు చెక్కలు ఆరగించు బాల్యం
ఏటిగట్టున, ఎడ్లబండిపై విహరించు...
కవిత నెం71:వెన్నెలమ్మ ఒడిలో
కవిత నెం :71
వెన్నెలమ్మ ఒడిలో
***********************************
జామురాత్రి నీడలో ,జాబిలమ్మ జోలలతో
వెండిమబ్బుల కాంతులలో ,నీలిరంగు వెన్నెలలో
ఆలోచనలకు స్వస్తి చెప్పి ,హాయిగా మనసు పెట్టి
తేలికైన భావాలతో ,తుమ్మెదలాంటి స్వేచ్చతో
పాలపుంతలను పలకరిస్తూ ,తారలను లెక్కిస్తూ
కమ్మని కలల విందు చెయ్యమని
కలత లేని ప్రశాంతతను ఇవ్వమని
మన నిదురరాజును బుజ్జగించి
మనల్ని బొజ్జోపెట్టమని అడుగగా
నిదురపొదామా ఆదమరచి వెన్నెలమాటున
...
Tuesday, 2 December 2014
కవిత నెం70:అంత్యాక్షరి
కవిత నెం :70
అంత్యాక్షరి
***************************
అందరినీ అలరించే సరిగమ లహరి
మెదడుకు పదునుపెట్టే సంగీత కచేరి
గాత్రాలకు పని చెప్పే గానామృత హేళి
సందడిని మేలుకొలిపే సరికొత్త సవేరి
ఆహ్లాదాల సంగమంలో ప్రవహించే గోదావరి
మనసులను రంజింపచేసే రంగుల హోలి
గాన సుగంధాలను వెదజల్లే గుళేభకావలి
చిన్న ,పెద్దలను ఏకంచేసే పాటల రవళి
కాలాన్ని మై మరపింపచేసే మనో కావ్యాంజలి
అందరికీ ఇష్టమైనది ఈ అంత్యాక్షరి
అంతరిక్షమైన కదిలొస్తుంది సరాసరి
//రాజేంద్ర ప్రసాదు // 30. 11. 14//&nbs...
కవిత నెం69:నా చెలికత్తె
కవిత నెం :69
నా చెలికత్తె
**********************
నా జతవు నీవు ,నా చెలికత్తెవు నీవు
నా తనువు నీవు ,నా తారామణి నీవు
నా ఎదపై వాలిన ప్రేమతుమ్మెదవు నీవు
నా హృదయంలో నిదురించే నా చెలివి నీవు
కలలో నిదురరానీయకుండా చేసే కలలరాణివి నీవు
వెండిమబ్బుల పల్లకిలో నుంచి వచ్చిన చందమామవు నీవు
ఆకాశం నుంచి నేలపై జారిన మెరుపువు నీవు
నా కోసం మిగిలిన ఒకే ఒక్క దేవకన్యవు నీవు
అందాలలోకంలో విహరించే ప్రపంచసుందరి నీవు
నా పదిలమైన పిలుపులో స్వరం నీవు
నా సున్నితమైన శ్వాసకు ఊపిరి నీవు
నే నెటువెళ్ళినా వెంబడించే...
Monday, 1 December 2014
కవిత నెం68:నీవుంటే చాలు .. నీకై నేనుంటాను
కవిత నెం :68
నీవుంటే చాలు .. నీకై నేనుంటాను
***************************
నిన్ను తలుచుకుంటే చాలు
ప్రేమ సుగంధాలు వీస్తున్నాయి
నీవు నా చెంత ఉన్నావన్న ఊహ చాలు
నాలో ప్రణయ ప్రకంపనలు బయలు దేరతాయి
నీ చెలిమి అందింది నా కది చాలు
జన్మజన్మాంతము జీవించే ఆయుష్షునిస్తుంది
నీ నయన లోగిళ్ళు నా వెంట ఉంటే చాలు
నీ వలపు కౌగిళ్ళలో నన్ను బందించటానికి
నీ అధరామృత స్పర్శ చాలు
నాలో ప్రేమధారలు పొంగి పొరలుటానికి
నీపై నేను కావ్యాలు కురిపించలేను
కాని కమనీయమైన ప్రేమ మాధుర్యాన్ని పంచగలను
నీ...