కవిత నెం :84
నేనంటే <<<<<>>>>>>>>>నేనింతే
****************************
నేనంటే ..... నేనింతే
నాలో లోపము ఇంతే
నాలో కోపము ఇంతే
నాలో స్నేహము ఇంతే
నాలో వైరము ఇంతే
నాలో భావాలు ఇంతే
నాలో భాద ఇంతే
నాలో ద్వేషం ఉండదంటే
నన్ను ఈర్షా తాకదంతే
నాలో స్వార్ధం లేదంటే
అహం అందరిలోనూ అంతే
నాలోని అహం కొంచెమంతే
పొరపాట్లు జరుగుతాయంతే
నేను తప్పు చేస్తే ఒప్పుకుంటాను ఇట్టే
నా వ్యక్తిత్వం నా సొంతమంతే
అప్పుడప్పుడు రాజీ తప్పదంతే
ఆశ...
Saturday, 21 February 2015
కవిత నెం 83:ప్రేమంటే ...
కవిత నెం :83
!! ప్రేమంటే ... !!
ప్రేమంటే రెండక్షరాలతో మొదలయ్యే కావ్యం
ప్రేమంటే రెండు మనసులలో మెదిలే ''సరిగమ'' ల రాగం
ప్రేమంటే రెండు హృదయాలతో జరిగే ''సంఘర్షణ '' యాగం
అందమైన భావం ఇది, ఏడురంగుల ఇంద్రధనుస్సు ఆకారం
ఒక రూపమంటూ లేనిది, లోకమంతటా సంచరించేది
భాషంటూ లేనిది ,ప్రతి మనసునీ చదివేస్తూ ఉంటుంది
కులమతాలకు అతీతమైనది -మానవతే తన తత్వమైనది
ప్రతి మదిలో మెదిలే ఏకైక మంత్రం ''ప్రేమ ''
ఊహలకందనిది , ఊసుల నిక్షేపమిది ''ప్రేమ ''
కనపడదు కాని, తనపై కవిత్వాలనే వ్రాయిస్తుంది ''ప్రేమ''
అందం...
Friday, 20 February 2015
కవిత నెం82:నీతో నీవు కాసేపు
కవిత నెం :82
నీతో నీవు కాసేపు
**************************
ఎప్పటికప్పుడు నువ్వే గ్రేట్ గా
చేసిన తప్పులో ఒప్పే నీదిగా
ఎందుకలా ఎదురుదాడిలా
ఉంటావిలా వితండవాదిలా
బదులే లేని ప్రశ్నలా
మనసే లేని మనిషిలా
పాతుకుపోయిన వేరులా
పనికి మాలిన చెత్తలా
ఉండిపోయావు నీవే నీలా
ఒక్కడిలా ఒక్కడిలా
ఒక్క క్షణమైనా గుర్తించావా - అది నిన్ను దాటి పోయింది
ఒక్క చోటునైనా గమనించావా - నీ రాణింపు ఎక్కడుందని //ఒక్క //
ఎదగాలిరా మనిషి పట్టుదలతో
ఎదిగి ఉండాలి మనిషి పేరు ప్రఖ్యాతలతో
ఎదుగుదలకి...
Saturday, 14 February 2015
కవిత నెం81:ప్రేమిస్తా
కవిత నెం :81
ప్రేమను ప్రేమగా పొందాను ,పొందుతున్నాను
ప్రేమను ప్రేమగా చూడటమంటే తెలుసుకున్నాను
ప్రేమకు అర్ధమే నీవని ,నీవుంటే ఏమీ అవసరంలేదని
ప్రేమలోన దాగున్న ప్రేమను నాకోసం పంచావు
ప్రేమతో నన్ను ప్రేమిస్తూ నా ప్రాణమై నిలిచావు
ప్రేమాక్షర భీజాలను నాలో నాటావు
ప్రేమాక్షయ పాత్ర లాగా నిరంతర ప్రేమను ఇస్తున్నావు
నిన్ను ప్రేమిస్తూ ,నాలోన నీపై ప్రేమను ప్రేమిస్తూ
''ప్రేమ '' మంత్రం జపిస్తూ ప్రేమికుడిలా పయనిస్తూ
నీ ప్రేమ హస్తంతో ప్రేమమయం లో విహరిస్తూ
ప్రేమతో నిండిన హృదయాలతో జీవిస్తున్నాము
ప్రేమంటే కలవరం...
Monday, 9 February 2015
కవిత నెం 80(మరణం)
కవిత నెం :80
నేడు సంభవిస్తున్న మరణాలను చూసి
మనసు వేదన చెంది మరణాన్ని ప్రశ్నిస్తున్న వేళ నా ఈ ''మరణం '' పై కవిత
//////మరణం //////////
మరణం మరణం మరణం
నీకు ఉండదా ఏ తరుణం
చల్లగా నీవు వస్తావో
నిశ్శబ్దం సృష్టిస్తావో
ఎప్పుడు ఏ మూల ఉంటావో
ఏడ ఏడ దాగుంటావో
ఎవ్వరు నీకు బంధువు కాదు
ఎవ్వరు నీకు శత్రువు కాదు
మరి ఏమని నువ్వు ఎదురొస్తావు
ఎందుకిలా శాసిస్తావు
కాలమైన నీ జోడి కాదు
నీ జడి దెబ్బకు సాటి లేదు
ఒక్కసారిగా సాగే చక్రం
ఉన్నపాటున ఆగునా ?
దిక్కులన్నీ నడిచే క్రమమున
ఏ దిక్కులేకన...
Monday, 2 February 2015
కవిత నెం79:ఏమౌతుంది
కవిత నెం :79 //ఏమౌతుంది //
ఏమౌతుంది ...................
మనసు మూగబోయింది
మాట పొదుపు నేర్చింది
కాలం ముందుకెళ్తుంది
సమయం జారిపోతుంది
ఆశ అల్లుకుపోతుంది
అవకాశం ఎదురుచూస్తుంది
అనుమానం ఎదురువస్తుంది
ఉత్సాహం ఉరకలేస్తుంది
ఒంటరి ఒంటరౌతుంది
తుంటరి ఆడుకుంటుంది
స్వరం మారిపోతుంది
స్నేహం మిగిలిపోతుంది
//రాజేంద్ర ప్రసాదు //02. 02. 15/...