కవిత నెం :287
*తనే నా వసంతం *
నడుస్తూ రోజులు గడిచిపోతున్నాయి
పరిగెడుతూ నెలలు మారిపోతున్నాయి
నా అడుగులో అడుగై
నాలో సగమై
నా జీవితంలోకి అడుగుపెట్టి
నేనే తన లోకమని భావించి
తన గురించి తానే మర్చిపోతుంది
ఈరోజు ఒక మంచిరోజు - నాకు పండుగ రోజు
నా నెచ్చెలి ,నా ప్రాణం జన్మించిన రోజు
నా అర్ధాంగిగా తన నాల్గవ పుట్టినరోజు
*************************************
తనతోనే సంతోషం
తనతోనే సమస్తం
తానే నా ప్రపంచం
గొప్ప ఆలోచనలు తనవి
నిర్మలంగా కనిపించే ముఖారవిందం తనది
స్వచ్ఛంగా సాక్షాత్కరించే చిరునవ్వు ఆమెది
అదృష్టాన్ని చూసి మోసపోదు
కష్టాన్ని నిముషమైనా వదలదు
పట్టుదలతో...
Saturday, 29 April 2017
Sunday, 16 April 2017
కవిత నెం :286ఓ శివ మహా శివ)
కవిత నెం :286
ఓ శివ మహా శివ
నీ శివాజ్ఞ ఎప్పుడయ్యా మా మీద
నీ కృప దయచూపేదెప్పుడయ్యా
ఓ శివ మహాశివ
అందరి బంధువుడవు
మా ఇంట నిలవలేవా ?
మాకు కనుల పంట చేయగా రావా ?
ఓ శివ మాహాశివ
నుదుటి మీద రాత నీవా
ఏ చీమ కదలాలన్నా కారణం నీవా
మా కనుచూపు మాపై చూపవయ్యా
ఓ శివ మహాశివా
నీవుంటే చాలు అది మహా ప్రసాదం
నీ స్మరణ అది మాకు సంతోషం
నిన్ను పూజింప మేము ధన్యులం
నందిని పంపుతావో
నీ త్రిశూలాన్ని పంపుతావో
విబూదివై మమ్ము తరిస్తావో తెలియదు
రా కదలిరా రా నువ్వు రా
ఏకైక కోరిక ...... నువ్వే లేచి రా
శివానందాన్ని మాకు అందించగా రా...
Friday, 14 April 2017
కవిత నెం :285(శ్రీ సూర్య నారాయణుడు)
కవిత నెం :285
* శ్రీ సూర్య నారాయణుడు *
సమస్త విశ్వాన్ని ప్రకాశింపచేసేవాడా - నీకు వందనం
స్వయం ప్రకాశ తేజోమయరూపమా - నీకు వందనం
సమస్త మానవాళికి జవజీవాలను ప్రసాదింపేవాడా - నీకు వందనం
అదితి పుత్రుడా ! అగ్ని గర్భుడా - నీకు వందనం
స్థితికారకుడా ! దినకరుడా -నీకు వందనం
ప్రభాకరుడా ! భువనేశ్వరుడా - నీకు వందనం
ప్రభాత ఉషోదయంతో మేల్కొలిపే భాస్కరుడా - నీకు వందనం
సర్వ దేవతలయందు మిళితమైనవాడా - నీకు వందనం
సమస్తలోక జీవరాశికి జీవం కల్పించేవాడా - నీకు వందనం
బంగారుకాంతితో ప్రకాశించేవాడా - నీకు వందనం
ఏడు గుఱ్ఱాల రథంతో ఆకాశయానం చేయువాడా -...
కవిత నెం :284(నా గురించి నా విశ్లేషణ)
కవిత నెం :284
* నా గురించి నా విశ్లేషణ *
ఆకాశమంత ఆనందం
పాతాళంలోకి తరమాలని విషాదం
నువ్వంటే నువ్వు కాదని చెప్పే కల్పితం
నాలోన మరో కోణాన్ని చూపే వాస్తవం
అందలం ఎక్కమని చెప్పే అహం
పొరపాటు చెయ్యకుండా ఉంచే విచక్షణం
అందరిలానే నాలో కూడా ఉద్రేకం
అంతలోన కూడా నన్ను వదలని శాంతం
ఎల్లప్పుడూ మేలును కోరుకునే నా హృదయం
నా మంచి కోరుకుంటూ ఉండే మంచి స్నేహమా
విషపు నీడలో పొంచి ఉండే శత్రుత్వం
కషాయాన్ని అయినా దిగమింగే ఆత్మస్థైర్యం
అంతా మన మంచికే అంటూ ఉండే మనోనేత్రం
సుడిగాలుల మధ్య చిక్కినా చెదరని మనో సంకల్పం
ఏమి జరిగినా ,ఎన్ని జరిగినా
నన్ను అభిమానిస్తూ...
Thursday, 6 April 2017
కవిత నెం 283(నేటి చిన్న తనం)
కవిత నెం 283
* నేటి చిన్న తనం *
వివేకమో ,అవివేకమో తెలియదు
గర్వమో , గారాభమో తెలియదు
కదిలిస్తే చాలు నాగు పాము పాము బుసలు
క్షణికంలో మారిపోయే మనసు తత్వాలు
ఏ కాలంలోనైనా ,గతించిన కాలమే మేలు
పెద్దలయందు ఒక గౌరవం ,భక్తి ఉండేవి
కలికాలమహిమ ఏమో కాని ....
కనువిప్పు కల్గదు నేటి జనాలకు కానీ
అంధకారంలో కనులు మూసుకుని ఉంటాయి
వెర్రి జాలం ఒకవైపు , అమాయకత్వం మరో వైపు
తెలుసుకుని మసులుదామనే కించిత్ ప్రయత్నం లేదు
అహం బ్రహ్మాస్మి అనే పొగరు పూసిన చిగురు
నేనే కదా అంటూ సాగే నేటి కధలు ఎన్నెన్నో
నేనుంటే చాలుకదా అనే నక్కవినయాలు మరెన్నో
ఏమి వస్తుంది సుమీ మీకు ఎగిరెగిరి...
Tuesday, 4 April 2017
కవిత నెం : 282(శ్రీ రామ్ )
కవిత నెం : 282
*శ్రీ రామ్ *
రామనామము రమనీయమైన కావ్యంరామనామజపం ముక్తికి మోక్షదాయకంమానవజాతికే ఆధర్సనీయం శ్రీరామజన్మంజయహో జయరామ పరందామ శ్రీరామ జయహే !
అందరికీ ''శ్రీ రామనవమి '' శుభాకాంక్షలు
శ్రీ రామ నిన్ను తలంచిన్ చాలు కష్టాలు లయమగున్
శ్రీ రామ నిన్ను పిలంచిన్ వెంటనే ఆ శ్రీమాన్ తోడుగావచ్చున్
శ్రీ రామ నీ పాదసేవ సకలలోకంబులకు మేలు కల్గించున్
శ్రీ రామ నీకృప మమ్ములను ఎల్లవేళలా కాచి కాపాడున్
ఓ శ్రీ రామ ఇది చాలు కదా మాకు నిన్ను ధ్యానించే భాగ్యమున్&nbs...