Wednesday, 24 May 2017

కవిత నెం :289(నవ్వంటే)

కవిత నెం :289

*నవ్వంటే *

నవ్వంటే నాకిష్టం
నవ్వుతూ ఉండాలన్నది నా మనోగతం
నవ్వుతూ కనిపించే వాళ్లంటే ఒక సంతోషం
నవ్వుతూ పలకరించే వాళ్లంటే ఒక గౌరవం
మాట్లాడుతూ నవ్వు
తిడుతూ నవ్వు
నవ్వుతూ నవ్వు
నవ్విస్తూ నవ్వు
నవ్వెప్పుడూ ఆరోగ్యమే
నవ్వెప్పుడూ ఒక మహా యోగమే
మనస్ఫూర్తిగా నవ్వే నువ్వు
నలుగురికి స్ఫూర్తి నువ్వు
నవ్వుతో సమస్యలు మాయం
నవ్వుకి ఈ జగమే అవుతుంది సలాం

నవ్వంటే నా కిష్టం
నాకు నవ్వాలనే ఉంటుంది ఎప్పుడూ
నవ్వుకి నేను శత్రువును కాదు
నవ్వలేని వాళ్లకు నేను జవాబు కాను


-గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు 

Related Posts:

  • కవిత నెం72:బాల్యం కవిత నెం :72 బాల్యం అందమైన బాల్యం - అది అందరికీ అమూల్యం మధురమైన బాల్యం - అది తిరిగిరాని కాలం మరువలేని జ్ఞాపకం - ఒక తీపి సంతకం అనుభూతుల పుస్తకం - అరు… Read More
  • కవిత నెం78:సానుభూతి కవిత నెం :78 సానుభూతి ****************************************** మనం నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు మరొకరు జాలిగా చూసే చూపు ''సానుభూతి '' ఒకరి సహాయం మ… Read More
  • కవిత నెం79:ఏమౌతుంది కవిత నెం :79 //ఏమౌతుంది // ఏమౌతుంది ...................  మనసు మూగబోయింది మాట పొదుపు నేర్చింది కాలం ముందుకెళ్తుంది సమయం జారిపోతుంది ఆశ అల్లుకుప… Read More
  • కవిత నెం 77:ప్రేమ కోసం - కవితా ''కారం '' కవిత నెం :77 ప్రేమ కోసం - కవితా ''కారం '' **************************** నమస్కారం ! నువ్వంటే నాకు ''మమకారం'' కాదు అది ''చమత్కారం''  నీ నవ్వు ఒక '… Read More
  • కవిత నెం73:బాల్య సొగసులు కవిత నెం :73 బాల్య సొగసులు  : (శ్రీ పద్మ ) ************************************ అమ్మపొత్తిళ్ళలో  ముద్దుగా మురిసిన బాల్యం నాన్న గ… Read More

1 comments: