Thursday, 12 October 2017

కవిత నెం :304(అమ్మ -విలువ)


*అమ్మ -విలువ *
కవిత నెం :304

నువ్వెంత ఎదిగినా 'నాన్నా ' అనే ఓ పిలుపు
నువ్వెంత తిట్టినా మరుక్షణమే కదా లాలింపు

నీ జీవితం కోసం ఆమె సాంగత్యం నీకు మరుపు
తన జీవితభారం నీకు తెలియదు అది కొసమెరుపు

అమృతం రుచి చూసుంటావా ఓ బాపూ
అమ్మ పాలు తాగావే ఏమంటావు చెప్పు

వెళతావు కనపడని దేవుళ్ల గుళ్ల వైపు
కనిపెంచిన దేవతవైపు ఉందా నీ చూపు

ఆహర్నిశలు ఆమె శ్రమ నీకు చిన్న చూపు
ఆస్తులకోసం ఆమె పంపక భారాన్ని ఇక ఆపు

దెబ్బ తగిలితే గుర్తొచ్చేదే అమ్మా అనే పిలుపు
తల్లి మనసు నొప్పిస్తుందని గమనించావా చెప్పు

కష్టమొస్తే తట్టుకోలేని మనసు కదా నీది
నీ సుఖం కోసం ,ఎంత కష్టమైనా భరించే గుణం ఆమెది

పెరిగావని ,పెళ్ళాం తోడుండని వద్దంటున్నావ్ నీ నీడని
పరిపూర్ణమైన ప్రేమత్వాన్ని గ్రహించావా అది అమ్మలోని ఉందని

అమ్మ ఆరాటపడుతుంది నీ ప్రేమ కావాలని
పెళ్ళాం చాడీలు చెప్తుంది మీ అమ్మ ఇలా అందని

ఈ సృష్టిలో కల్తీ లేనిది ఒక్కటే అది అమ్మ ప్రేమ
మరణం లేని మనసుందంటే అది ఒక అమ్మ మనసే

వర్షించనీ అమ్మ ప్రేమను ఆటంకం చూపకుండా
ప్రవహించనీ ఆ ప్రేమ ధారను నీ గుండెల నిండా

- గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్






Related Posts:

  • కవిత నెం 181:ఒంటరితనం కవిత నెం :181 ఒంటరితనం మన ఊసుల్ని  గుర్తుచేస్తుంది ఒంటరితనం మన మనసు బాసల్ని గుర్తుచేస్తుంది ఒంటరితనం నీతో ఉన్న మదుర క్షణాలని గుర్తుచేస్… Read More
  • కవిత నెం182:ఓ ప్రియతమా ! కవిత నెం :182 ఓ ప్రియతమా ! కలలో చూసిన సౌందర్యరూపం  అది నే మేను యొక్క అందం. చంద్రబింబం లాంటి నీ సోయగం నా మదిలో రేపెను కలవరం ప్రియా ! నీ పర… Read More
  • కవిత నెం 256 :రిపబ్లిక్ డే కవిత నెం  :256 ** రిపబ్లిక్ డే ** భారత దేశంలో రాజ్యాంగం అమలు ప్రారంభమైన రోజు భారత దేశం గణతంత్ర దేశంగా ప్రకటించుకున్న రోజు  'గణతంత్ర ది… Read More
  • కవిత నెం 184:నువ్వంటే ఇష్టం కవిత నెం :184 *నువ్వంటే ఇష్టం * స్వచ్చమైన నీ చిరునవ్వంటే  నా కిష్టం  వెన్నెలమ్మ హాయిని చూపే నీ చూపంటే నా కిష్టం లోకం మరచి,నీతో ఉండి ,… Read More
  • కవిత నెం 183:ఆశ కవిత నెం :183 నీతో నడవాలనే ఆశ నీతోపాటు ఉండిపోవాలనే ఆశ నీ నవ్వు చూడాలనే ఆశ నిన్ను నవ్వించాలనే ఆశ నీతో ఎకాంతంగా గడపాలనే ఆశ నీ చెంతనే ఉండి సేద తీ… Read More

0 comments:

Post a Comment