Thursday, 17 December 2020

గరిమెళ్ళ కవితలు నెం.1

సంపుటిలోని కవితలు యొక్క క్రమం1. అమ్మ విలువ2. అజరామరం -నా తెలుగు3. సమయం లేదా మిత్రమా4. మేలుకో నవతేజమా5. ఆగకూడదు నీ గమనం6. జీవనమంత్రం7. పెనుమార్పు8. కోపం ఒక శాపం9. నిశీధిలో నేను10. వెన్నెల్లో అమావాస్య11. ఇదే జీవితం12. మాతృత్వపు ధార13. అంతర్యుద్ధం మనసుతో14. పిచ్చిమాతల్లి15. లోకంలో ఆడపిల్ల16. కన్నీటి చుక్క17. ప్రాస కనికట్టు18. పేస్ బుక్ చిత్రాలు19. తెలుగమ్మాయి20. రక్షా బంధన్21. బాల 'కర్మ 'కులు22. ఆటోవాలా23. తొలకరి జల్లు24. మన పల్లెసీమ25. దిక్సూచి26. ఆకాశం27. భూమిపుత్రుడు28. ఓ సంద్రమా29. అసహనం30.నిద్రలోకం31. వేశ్య ఎవరు?32. మలినమైన మానవత్వం మధ్య33. వెధవ...

Thursday, 10 December 2020

కవిత నెం :342 (ఒక స్వప్నం కోసం )

*ఒక స్వప్నం కోసం *•••••••••••••••••••నిద్రించే నిన్ను మేల్కోలిపేదే స్వప్నంఅలజడితో మొదలై ఆశను పుట్టించి ఆశను మలుపుకున్నావో ఆశయమే నీదినీ స్వప్నం నిజమవుతుందినీ స్వర్గం చేరువవుతుంది స్వేచ్ఛగా విహరించవోయి స్వాప్నికుడా గుండెలోపల దాగున్న భారాన్ని చేధిస్తూనిన్ను వెంటాడే బాధల్ని తరిమేస్తూనీ మనసుకు ఆనందపు రెక్కలు తొడుగుతూనీ స్వప్నాన్ని వారధిగా చేసుకుని రధసారధివై నీ గమ్యాన్ని మార్చుకోపోగొట్టుకున్న చిన్ని చిన్ని సంతోషాలనుఅడ్డుగోడగా మారిన అవరోధాలనుఅనిశ్చితుణ్ణి చేసిన అవమానాలనుగరళంగా భ్రమించిన సందర్భాలనునీ లక్ష్యంతో లక్షణంగా పలకరించుప్రతి...

Sunday, 30 August 2020

గురువే నమః

మనుమసిద్ధి కవన వేదిక అంశం :గురుబ్యోనమః శీర్షిక : గురువే నమః అక్షర జ్ఞానాన్ని అందించే గురువుకు నమః అజ్ఞాన తిమిరాన్ని తొలగించే గురువుకు నమః మంచి నడవడితో నడక నేర్పించే గురువుకు నమః బుద్ధి -సిద్ధిలను ప్రసాదించే జ్ఞానజ్యోతినకు నమః ఉన్నత విధ్యను మహోన్నతంగా ఇచ్చే శిఖరంకు నమః బంగారు భవితకు మార్గదర్శి అయిన గురువుకు నమః సన్మార్గ సంప్రదాయాలకు భీజమైన గురువుకు నమః ధర్మబోధన చేసే భోదకుడైన గురువుకు నమః ఉన్నత భావాలకు రూపకల్పకుడైన గురువుకు నమః చక్కటి సంస్కారనముకు మనోనేత్రమైన గురువుకు నమః సర్వం తెలిసిన...

Wednesday, 19 August 2020

చిరంజీవి

కొణిదెల శివశంకరవర ప్రసాదు "చిరంజీవి" సినీ రంగం లో జన్మించాడు పునాదిరాళ్లతో పునాది నిర్మించుకుని స్వయంకృషితో స్వయంగా ఎదిగినాడు కోట్లాదిమంది హృదయాల సంపన్నుడు తన అందం, అభినయంతో విజేతగా నిలిచాడు  అభిమానుల కోసం దిగివచ్చిన "జగదేకవీరుడు "నవతరానికి వారధిగా,ఆదర్శనీయమైన నటుడు అందరికీ అందేవాడు ఈ అందరివాడు రక్తదానంతో ప్రాణాలను పోసే సంజీవుడు వెండితెరలో వెలుగొందే "మగ మహారాజు "బాసులకు బాస్, అయన చూపులో ఏదో గ్రేసు "చిరు "పేరులో ఏదో ప్రభంజనం "చిరు " ని చూసి ఎదిగాం మేమందరం స్టార్స్ ఎందరు ఉన్నా అయన స్థానం...

Thursday, 2 July 2020

341(లోకంలో ఆడపిల్ల)

కవిత నెం  :341 కవితా శీర్షిక : లోకంలో ఆడపిల్ల ప్రతీ రోజు పేపర్లో ప్రతీ రోజు వార్తల్లో ఎక్కడో ఒకచోట కనిపించే అమానుషం వినిపించే ఆర్తనాదం ఏ తల్లి కడుపు ఆవేదనో ఏ కాముకుడి విషపు క్రోరకో ఏ క్రూరత్వం కన్నెర్ర చేసెనో చూస్తుంటే నిస్సాయత నీడలా నడుస్తుంటే చూస్తుంటే వారి ఆశలు నిప్పుల్లో దహిస్తుంటే ఎలా ఎలా జరుగుచున్నవి మానవత్వం లేని ''మాన భంగాలు '' ఎలా ఎలా మార్చేస్తున్నవి హృదయం లేని మృగ '' మగ రాజు '' లని ఛి వారి బ్రతుకు ఎందుకు ? వావి వారసలేని కుక్కలవలే ఆడదంటే ఎగబడుతూ తన పుట్టుక ఒక ఆడపేగు అని తెలిసి మరచే ఆ దౌర్భాగ్యం ఎందుకు ? ఆనాడు సీత ,ద్రౌపది మాతల...

Sunday, 28 June 2020

కవిత నెం :340(నీ జ్ఞాపకంలో - నేనున్నా నాన్న )

కవిత నెం :340 కవితా శీర్షిక : నీ జ్ఞాపకంలో - నేనున్నా నాన్న  నువ్వంటే ఇష్టం నాన్న నీ రూపంటే ఇష్టం నాన్న నీ ఊహ తెలియకుండా ఎదిగా నాన్న నువ్వంటే ఇష్టం నాన్న నీ పేరంటే ఇష్టం నాన్న నిన్ను ''లేటు '' అని చెప్పే పరిస్థితి ఏంటి నాన్న ? నీ వేలుపెట్టి నడిచానో లేదో తెలియదు నీ స్పర్శ కావాలనిపిస్తుంది నాన్న నీ భుజాలపై ఆడానో లేదో తెలియదు నా విజయకెరటం నీ భుజాలపై నిలపాలనుంది నాన్న నీ గుండెలపై హత్తుకున్నావో లేదో తెలియదు నీ హృదయాన్ని హత్తుకోవాలనుంది నాన్న నా చిన్నప్పుడు మా నాన్న అలా -ఇలా అనే వాడిని  నాన్న నిన్ను తలుచుకుంటూ బ్రతికేసా...

Thursday, 16 April 2020

కవిత నెం :339(జబ్బు మనుషులు)

కవిత నెం :339 కవిత పేరు : జబ్బు మనుషులు మనస్ఫూర్తిగా నవ్వలేరు నవ్వినా ఆనందాన్ని అనుభవించలేరు వయసుకీ ,మనసుకీ సంబంధం ఉండదు విచిత్రదోరణిలోనే బ్రతికేస్తుఉంటారు క్రమశిక్షణ లేని విచక్షణ వైరాగ్యులు క్రమం లేని పరిక్రమించని జీవులు కోపతాపాలను దాచను లేరు ప్రేమాభిమానాలను పంచను  లేరు ఎందుకూ పనికిరాని అనుభవం ఎవ్వరి సంక నాకటానికి ఎందుకు ఉపయోగపడిని జ్ఞానం ఏ విత్తులు సంపాదించటానికి అందరిలో ఉన్నా ఒంటరిగా వైనం తలతిక్కపట్టిన తింగరి వ్యక్తిత్వం కసాయి గుండె కాదు ప్రాణాలు తీసే పాషాణం కానే కాదు వీరి తత్వంలో ఎదుటివారిని సూదిమందులా చంపే మానవ మనోరోగం...

Tuesday, 7 April 2020

కవిత నెం :338(మట్టి మనిషి)

"మట్టి మనిషి " మట్టిలో పుట్టాం  మట్టిలో ఆడుతూ పెరిగాం  మట్టితో సహవాసం సాగిస్తున్నాం  మనం తినే తిండి మట్టిలోనుంచే  మనం కట్టే బట్ట మట్టిలోనుంచే  ఆఖరికి మనల్ని కాల్చే కట్టే కూడా మట్టిలోనుంచే  పల్లెలో పెరిగిన వారిని అడుగు మట్టిగురించి  పల్లెలో తిరిగిన వారినడుగు మట్టితనం గురించి  తొలకరిజల్లు పడే వేళలో అనుభవించు మట్టివాసనని  ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మన కాయం ఆణువణువు కూడా మట్టి పదార్థమే  పిడికెడు మన్నుతో అందమైన బొమ్మలు చెయ్యవచ్చు  ఆ పిడికెడు మన్నుతో మన కాయాన్ని ఖననం చెయ్యవచ్చు  ధనికుడైనా,...

Sunday, 29 March 2020

కవిత నెం : 337(కరోనా )

కవిత నెం : 337 కరోనా  ఈ కరోనా ప్రభావంతో ఒక మనిషి ఆలోచనలు భూమి గుండ్రంగా తిరుగుతున్నట్టు ప్రపంచం మొత్తం ఒకేసారి తక్కువ సమయంలో వారి గతం నుంచి వర్తమానం వరకు నేటి వర్తమానం నుంచి భవిష్యత్తు కొరకు నిముషానికి గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుందో అన్ని సార్లు ఆలోచన ప్రవాహాలు పరిగెత్తుతున్నాయి ఒకవైపు ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని అది ఉంటుందా పోతుందా అనుమానం ఒకేసారి ప్రాణం పోయినా పర్లేదు అది సగం గమ్యం వైపు వెళ్లి ఎక్కడ సంకటమవుతుందో అని ఒకేసారి మన జీవం మన శరీరాన్ని విడిచిపోతే మన చుట్టూ పేరుకుని ఉన్న బంధాలు ,బాధ్యతల పరిస్థితి ఈ ప్రళయం విషమం కాకపోయినా...