Sunday 5 February 2017

కవిత నెం 268:సొంత గూటి బంధాలు

కవిత నెం  : 268
భావగీతి కవన సంకలనం కోసం 

కవిత నెం :3


* సొంత గూటి బంధాలు *

పొద్దున్నే లేవగానే
శుభోదయం , శుభదినం అంటూ
అందరినీ పలకరిస్తావు
పక్కనున్న పెళ్ళాన్ని మాత్రం
నవ్వుతూ ఒక చూపు
గౌరవంగా ఒక మాట
మౌనమే మీ ఇద్దరి మధ్య గోడ

ఎవరో ముక్కూ , మొహం తెలియని వారిని
భావ - మామ , అన్నయ్య -వదిన
అంటూ సంబోదించి మరీ పిలుస్తాం
నీ సొంత చెల్లెలతో , అక్కలతో
ఒక్కసారి అయినా పద్దతిగా మాట్లాడావా ?

ఇంట్లో బంధాలకు జైలు వాటం
ఆన్ లైన్లో స్నేహాలకు ఉండదు మొహమాటం
నీకు కష్టమొస్తే ఆర్చేది , తీర్చీది వారేనా
సంతోషంలో ఏ సొంత బంధం గుర్తు రాదు
భాదలో మాత్రం అందరూ కావాలనిపిస్తుంది

నీకన్నా పెద్దవారికి అతిపెద్ద గౌరవం చూపెడతావ్ 
మాతృ సమానులు ,పితృ సమానులు అంటూ 
నీ ప్రేమను చూపి , ఆత్మీయత నందుకుంటావ్ 
మన అమ్మ , నాన్న లతో నిముషం ముచ్చటించవు 
కొంతమంది అమ్మ , నాన్నలకు ఆశ్రమాలే గతి 

అయినవారిని , కాని వారిని ఇంటికి ఆహ్వానిస్తావు 
పండగలకు -పబ్బాలకు స్నేహితులే నీ చుట్టాలు 
ఒక్కసారి ఆలోచన చేశావా నీ సొంతవారితో కలయికకోసం 
ఆత్మీయ సమ్మేళనాలు , కుల గ్రూప్ ల మీటింగులు 
మన చుట్టాల ఆప్యాయతలు అంత వెగటునా నీకు ?

మన సొంతవారైతే తిట్టుకుంటాం , అరుసుకుంటాం 
ఒక ప్రేమతో చనువు , ఒక పెద్దరికపు సలహా 
నేడు నీకు అవి బరువా ? భారమా ?
తుమ్మితే ఊడిపోయే కొత్త స్నేహాలు ఎన్నో 
వెతుకుతూ పొతే అల్లుకుపోయే నీ వారి బంధాలు ఎన్నో 

నిన్న కాక మొన్న పరిచయం అయిన వారిని 
నా ప్రాణం , నా ఆప్తుడు అంటావే 
నువ్వంటే ఇష్టపడే సొంతవారిని గుర్తించావా మరి 
సొంతవారు సొంత వారే , భయట వారు భయట వారే 
బంధాలు కలుపుకుంటే బంధుత్వాలు పెరుగుతాయి 
అంతమాత్రాన రక్త సంభందాలు , చుట్టరికాలకు 
విలువ నివ్వకుండా ఎదిగిపొమ్మని కాదు 

నీ సొంతవారి తర్వాత పేరుకున్న సంబంధాలు 
సొంత గూడు సొంత గూడే !!!!!!!!!!!!!!!

- గరిమెళ్ళ గమనాలు 
06 . 02. 2017






0 comments:

Post a Comment