Tuesday 21 February 2017

కవిత నెం 275:*గోవు (గో మాత)*

 కవిత నెం :275
*గోవు (గో మాత)*

పరమ పవిత్రతకు , శుభానికి సూచిక 'గోవు'
అనాదికాలం నుంచి ఆరాధ్యదైవం 'గోవు'
భూమాత ధరించిన రూపం ' గోవు '
ఆదిశక్తి అంశ నుండి జన్మించిన రూపం 'గోవు'
హోమంలో నుండి జనించిన అగ్నిగోత్రం 'గోవు '
ముక్కోటి దేవతలకు నిలయం 'గోవు'
సమస్త కోరికలను తీర్చే దేవత 'గోవు'
ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక 'గోవు'
యజ్ఞయాగాది క్రతువులలో పాలు పంచుకోగలిగేది 'గోవు'
అతీంద్రియ దర్శన శక్తిని కల్గినది 'గోవు'
కన్నతల్లి సమానురాలు 'గోవు '
ప్రతి ఇంటీ కల్పతరువు 'గోవు '
రైతు వెన్నుముక 'గోవు'
భూలోక పూజలందుకునే గో మాత 'గోవు'
ముల్లోకాలకే విశ్వమాత గా 'గోవు'
దేవ రహస్యాన్ని పసిగట్టగల పాడి ఆవు ఈ 'గోవు'

గంగి గోవు పాలు గరిటెడైనను చాలు
విషాన్ని హరించే శక్తి కలవి  'గోవు పాలు'











0 comments:

Post a Comment