కవిత నెం :264
*జీవన పోరాటం *
పొద్దుగాడ లేస్తూనే
పొట్టకూటి కోసం
ఎన్నో పనులు
మరెన్నో బాధ్యతలు
గీ రోజు మంచిగా గడిస్తే చాలు
గీ దినం మనం బతకనీకి సంపాదిత్తే చాలు
ఎన్నో హృదయాల ఆర్భాటం
మరెన్నో హృదయాల బ్రతుకు పోరాటం
మనిషి ఆశలకు హద్దుల్లేవు
మనోషి ఊహలకు నియమాలు లేవు
కొద్దిమంది మేడలు , మిద్దెల్లో కాపురముంటే
మరి కొద్దిమందికి నిలువ నీడ లేక తపించేవారు
ఏముంది ఈ భూమిలో అంతా మట్టేకదా
ఏముంది ఈ గాలిలో అంతా తేమే కదా
అవి ఉన్నోడికి ,లేనోడికి అంతా ఒకటే కదా
మరేంది జట్కాబండి బ్రతుకులు
మరేంది ఆకలి అరుపుల ఆర్తనాదాలు
ఉన్నోళ్లు ఆశ చావక ఆకాశం వైపు పోతుంటే
లేనోడు...
Tuesday, 31 January 2017
Saturday, 28 January 2017
కవిత నెం263:మేలుకో నవతేజమా
కవిత నెం :263
*మేలుకో నవతేజమా *
సమాజాం పిలుస్తుంది రా కదలిరా
నవ సమాజం పిలుస్తుంది రా కదలిరా
గుర్రు పెట్టి నిద్రబోతే ఏముందిరా
కలం పట్టి గళం పాడే చోటుంది రా
నాలుగు గోడల మధ్య ఏముందిరా
నలుగురితో కలిసి చూడు రా కదలిరా
నవ్వుకుంటూ ,తిట్టుకుంటూ ఎంతకాలం రా
నిజమేంటో నీ సిరాతో చెప్పి చూడరా
నీ సుఖం , నీ పక్షం ఎంతసేపురా
ఎదుటివారి బాగు కోసం రా కదలిరా
న్యాయ అన్యాయాల గుణింతమేలరా ?
ఎదురించే గుండె చాలు రా కదలిరా
కడుపులోనే కుళ్ళు దాచి కంపుకాకురా
ఈ సమాజంలో కుళ్ళు కంపు పెకలిద్దాం రా
ఉడుకు నెత్తురుంటే చాలా ఏమాంటావురా
ఉడుములాగా ఉరకాలి ఆగిపోకురా
నీకెందుకు అనుకుని...
Friday, 27 January 2017
కవిత నెం 262:పిచ్చి మా తల్లి
కవిత నెం :262
*పిచ్చి మా తల్లి *
నువ్వెంత మగాడివి అయినా
ఏదైనా భరించగలిగే శక్తి ఉన్నది ఒక్క ''స్త్రీ '' మాత్రమే
కానీ తనను , తన ప్రేమను భరించే శక్తి నీకుండాలి
అమ్మ ప్రేమను కలిపి తినిపిస్తుంది
భార్య తన ప్రేమను , జీవితాన్ని నీతో పంచుకుంటుంది
సోదరి నువ్వు తనకు శ్రీ రామ రక్ష గా భావిస్తుంది
పొరపాటున కూడా నీ విసుగు వారిపై ప్రదర్శించకు
ఎంత ఎదిగినా ,ఎంత బిజీ గా ఉన్నా వారిని చులకన గా చూడకు
తను అలసిన వేళ ,సుకుమారంగా చూసుకో
తను విసిగిన వేళ , నీ ఔదార్యం చూపించుకో
నీ ఒత్తిడిని తనతో పంచుకో నీకు ఊరట లభిస్తుంది
నీ ప్రేమ ప్రదర్శన కాదు తనకి అది...
కవిత నెం 261:నిద్ర
కవిత నెం :261
నిద్ర గాడంగా
మనసు భారంగా
కనులు ఆపంగా
కునుకు దీర్ఘంగా
కనులు ఎరుపెక్క
తలంతా తిక్క తిక్క
నా కనుబొమ్మలు అటకెక్క
నా ఒళ్ళంతా తిమ్మిరెక్క
ఎదురుగా ఉంది పని
ఆపేది ఏమిటని
నాలోన అనుకున్నా గాని
కాసేపు కునుకేద్దామని
పిలిచాను నిద్రలోకాన్ని
నిద్ర భలే
దీని ముద్ర భలే
ఇది బహు తమాషాలే
రమ్మంటే రాదులే
పొమ్మంటే పోదులే
పుస్తకం పట్టుకుంటే
వస్తుంది మనవెంటే
పని చేసుకుందామంటే
మొట్టికాయ మొడతదంతే
కమ్మగా నిద్రపోగలిగితే అది 'స్వర్గం '
నిద్ర లేక అవస్థపడుంటే అది 'నరకం '
- గరిమెళ్ళ గమనాలు
(27. 01. 2017)
...
కవిత నెం260:వెన్నెల్లో అమావాస్య
కవిత నెం :260
*వెన్నెల్లో అమావాస్య *
ఒక నిర్మానుష్యమైన భయం
ఒక నిశ్శబ్దపు వాతావరణం
ఎక్కడ అలికిడి జరిగిన ఉలిక్కి పడే రోజు
రోజులు మారుతున్నా మూడాచారాలు మారవు
మనం మారుతున్నా మన నమ్మకాలు మారవు
గుండెలు ఎగిరిపడే రోజు
చీకటి రాత్రులు విజృభించే రోజు
ఉన్మాదపు క్రియలు ఊపిరి పోసుకునే రోజు
ఊడల మర్రి 'విలయ తాండవం' చేయు రోజు
ఇలా అమావాస్యంటే ఎన్నో ఎన్నో ఆలోచనలు
మనం ఊరుకున్నా మన మనసు మాట వినదు
ఎక్కడికీ వెళ్లకూడదని .... ఏ పనీ ఈరోజు ఆరభించకూడదు అని
ఎన్నో ఎన్నో వినే ఉంటాం .... ఇలాంటివి మన కళ్ళముందు చూస్తూనే ఉంటాం
తీవ్రమైన పూజలు చేస్తూఉంటాం ... విపరీతమైన...
Tuesday, 24 January 2017
కవిత నెం 259:సమయం లేదా మిత్రమా
కవిత నెం :259
* సమయం లేదా మిత్రమా *
కాలం చాలా విలువైనది ,నిరంతరంగా ప్రయాణించేది
సమయ పాలన విలువ పెరిగి నిజంగానే క్షణ తీరిక లేకుండా పోతున్నాం
బంధాలు , బంధుత్వాలు అంటూ అందరిమధ్యన పెరిగిన మనకు
నేడు ఎవ్వరి తోడూ లేకుండా , ఏకాంతంలో బ్రతుకుతున్నాం
అమ్మా , నాన్న తోడు లేకుండా ,వారిని చూడకుండా ఉండలేని రోజులు
నేడు వారితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడలేక విసుక్కుంటున్నాం
ఉత్తరాలు , ప్రతుత్తరాలతో కమ్మని కబుర్లు లేఖల్లో పంచుకున్నాం
నేడు వాట్స్ అప్ ,ట్విట్టర్స్ అంటూ కాలాక్షేపాలు చేస్తున్నాం
నీ అవసరాల కోసం ఉన్న ఊరుని , కన్న వారిని విడిచి దూరంగా...
Monday, 23 January 2017
కవిత నెం :258
కవిత నెం :258
పసి హృదయంలో ప్రేమని పుట్టించావు
ఆశలతో నా మనసుకి నడక నేర్పించావు
నీ వలపుల ఊసులతో ఉరకలు వేయించావు
అన్నీ చేసి ఇలా ఓడిపొమ్మని నన్నొదిలి వెళ్లిపోయావు
ఊహాలోకంలో నా మనసుకి ఊరట నిచ్చింది నీ ప్రేమ
ఉలిక్కి పడి చూస్తే అది ఊహే అని ఒప్పించింది కూడా నీ ప్రేమే&nbs...
కవిత నెం257:నేతాజీ నీకు జోహారు
కవిత నెం -257
* నేతాజీ నీకు జోహారు *
స్వాతంత్ర సమరంలో పోరాడిన యోధుడా
వెన్ను వంచక శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడా
జోహార్లు నీకు జోహార్లు
పోరుబాట తో ఉద్యమాన్ని ముందుకు నడిపిన సమరుడా
ఆంగ్లేయులు నిర్బంధించినా రొమ్ము చూపిన రణధీరుడా
జోహార్లు నీకు జోహార్లు
ధైర్యానికి ,సాహసానికి నిలువెత్త్తు రూపం నీవురా
భారత స్వాతంత్ర సంగ్రామంతో కదిలిన భవదీయుడా
జోహార్లు నీకు జోహార్లు
నీవు నమ్మిన సిద్ధాంతాలతో ఫిరంగులా కదిలావురా
దేశ దేశాలు తిరిగి సైనికులకు వారధిలా నిలిచావురా
జోహార్లు నీకు జోహార్లు
ఉడుకు నెత్తురు ఊఫుతోటి ఉడుములా మారావురా
కలలు...
Wednesday, 18 January 2017
కవిత నెం 256 :రిపబ్లిక్ డే
కవిత నెం :256
** రిపబ్లిక్ డే **
భారత దేశంలో రాజ్యాంగం అమలు ప్రారంభమైన రోజు
భారత దేశం గణతంత్ర దేశంగా ప్రకటించుకున్న రోజు
'గణతంత్ర దినోత్సవం ' గా జాతీయ పండుగ జరుపుకునే రోజు
భారత దేశ చరిత్రలో భారతీయులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన రోజు
బ్రిటీష్ వారి రాజ్యాంగ విధానాలు రద్దు కాబడిన రోజు
ప్రజాస్వామ్య విధానాలతో నూతన రాజ్యాంగం అమలు కాబడిన రోజు
ప్రజలే ప్రభుత్వం గా ప్రభుత్వమే ప్రజలుగా ప్రజా ప్రభుత్వం గా మారిన రోజు
డా. బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్
డాక్టర్ బి . ఆర్ .అంబెడ్కర్ చైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ
అన్నీ...
కవిత నెం 255 : పల్లెటూరు పిలుస్తోంది (పార్ట్ -1)
కవిత నెం :255
** పల్లెటూరు పిలుస్తోంది (పార్ట్ -1) **
కొక్కొరొక్కో అంటూ నిద్రలెమ్మని చెప్పే కోడి
ఆతృతగా పాలు కుడుస్తూ ఆకలి తీర్చుకునే లేగదూడ
అమ్మా పాలు , అయ్యా పాలు అంటూ చీకటివీడకుండా వచ్చే పాలవాడు
అంబా అంటూ పోగేసిన మెత్తని గడ్డిని నెమరేసే మా ఇంటి ఎర్రగేద
దట్టంగా కమ్మేసిన మంచులో పని చేసుకుంటూ పోయే మా తాత
వేడివేడిగా పాలు పితికి అందరికీ టీ అందించే మా అమ్మమ్మ
పేడ కలిపిన నీళ్ళతో కల్లాపు చిమ్మగా ఒళ్లు విరుచుకునే మా ఇంటి వాకిలి
ముగ్గుల చుక్కల అల్లికలతో ముస్తాబు చేసుకునే మా ముంగిలి
కొబ్బరి ఆకులను చీల్చుకుని మా ఇంటి సూరిని తాకే సూర్య కిరణాలు
ఏరు...
Tuesday, 17 January 2017
కవిత నెం 254 : బాపూజీ
కవిత నెం :254
* బాపూజీ *
కరెన్సీ నోటుపైన కనిపిస్తాడు
వీధి వీడి వీధి విగ్రహాల రూపంలో నిలుచుంటాడు
మన ముందు తరాల వారికి అయన మహాత్ముడు
చరిత్రలో మన జాతి పేరును చిర స్థాయిగా నిలిపిన జాతిపిత
నేడు మన చిన్నారుల మదిలో బోసినవ్వుల తాత
మరి రాబోవు తరాలలో మన బాపూజీ స్థానమెంత ?
ఏది ఏమైనా ఆయన ఖ్యాతి మరువలేనిది ,కీర్తించదగినది
ఒక్కసారి స్మరణ చేసుకుందాం ఆయనను ,ఆయన సిద్ధాంతాలను
...
కవిత నెం 253 :ఆలోచనల తీరు
కవిత నెం :253
* ఆలోచనల తీరు *
స్థిమితమైన ఆలోచన నీకు మేలు చేస్తుంది
ఆదుర్దాపడిన ఆలోచన నిన్ను ఆలోచింపకుండా చేస్తుంది
ఆవేశపూరిత ఆలోచన నిన్ను అతలాకుతం చేస్తుంది
సమయానుకూలతతో చేసే ఆలోచన నీలో తెలివిని నిద్రలేపుతుంది
మన ఆలోచనలే మనకు పెట్టుబడి
మన ఆలోచనలే మన కార్యాచరణకు ప్రతిరూపాలు...
Friday, 13 January 2017
కవిత నెం 252 : కారణం లేని కోపాలు
కవిత నెం : 252
* కారణం లేని కోపాలు *
ఎందుకు కోపాలు ఎందుకు తాపాలు
కాలం మళ్లీ తిరిగీ రాదు కరగని పైత్యాలు
అద్భుతమైన అనుబంధాలు
ఆత్మీయతల అనురాగాలు
ఇన్ని ఉన్నా ఈ లోకంలో ఎగిరెగిరే పంతాల ? //2//
కాసేపు ఓపికగా ఉండలేని మనుషుల తత్వాలు
కూసేపు కూడా ప్రతీక్షించని మనసు ఆగడాలు
ప్రేమించటం కాదు మనిషి ప్రేమ పొందరా ప్రేమతోటి
జీవించటం కాదు మనిషి అనుభవించరా హాయితోటి
ఒక మాటైనా మాట్లాడు మంచిని పెంచేట్టు
వ్యర్థపు మాటలకు కళ్లెం వెయ్యి కలిసి ఉండేట్టు
మమకారం వెటకారం కాబోదురా
మన మమతల విలువేమిటో చూడరా
కసిగా పెరిగే కోపం విరోధాలకు నిలయం
మబ్బులా కమ్మే రోషం కలిగించదు...
Tuesday, 3 January 2017
కవిత నెం 251 : అమ్మ ప్రేమాలాపన
కవిత నెం :251
** అమ్మ ప్రేమాలాపన **
తనకంటూ ఉన్నా లేకున్నా
తనకంటూ ఏమీ దాచుకొని అమ్మతనం
తన రెక్కల కష్టంతో బిడ్డలను సాకేదే తల్లి గుణం
తన పిల్లల కోసం ప్రయాస పడటం ఆమె ఆరాటం
తన కడుపులో నీళ్లు ఆవిరవుతున్నా తరగని ప్రేమ వైనం
ఆ పూటకి దొరికిన ఆహారాన్ని తన నోటితో పిల్లలకు అందిస్తూ
వారి ఆకలి తీరినాక తన ఆకలికి మర్చిపోయే మాతృత్వం
తన దుఃఖాన్ని సైతం విస్మరించి మమకారం చూపే అమ్మబంధం
తన పిల్లల సుఖాల కోసం నిరంతరం శ్రమిస్తూ సాగే కల్పవల్లి .
ఎన్నో ఎదురుదెబ్బలను ఓర్చుకుంటూ బ్రతికే చిట్టి తల్లి
ఎన్ని...
కవిత నెం 250 :గత సంవత్సరపు -జ్ఞాపకాలు
కవిత నెం :250
గత సంవత్సరపు -జ్ఞాపకాలు
కొన్ని సంఘటనలు గుర్తుండేవి గుర్తుండి పోయేవి
కొన్ని వాస్తవాలు కదిలించేవి కదిలించి చంపేవి
ప్రతీ మనిషికి విజయం - పరాజయం తప్పదు
ప్రతీ మనిషికి అవమానం - అపమానం అనుభవం తప్పదు
మంచితో పాటు చెడు కూడా వస్తుంది
కష్టం వెమ్మటే సుఖం దాగుంటుంది
ఎంత వేదన చెందినానో అంత ఆనందం పొందినాను
ఎంత అభిమానం పొందినానో అంత అవమానింపబడినాను
జీవితం అంటే బరువు ,బాధ్యతలతో పాటు సర్దుబాటు ఉండాలని
జీవితం అంటే కాయ , కష్టం లతో పాటు కళాపోషణం ఉండాలని
తెలిసింది పాతదే కానీ ఆచరణ కొత్తగా అనిపించింది
అయిన...