22, సెప్టెంబర్ 2014, సోమవారం

కవిత నెం 46:భాద పడే భావం

కవిత నెం :46

భాద పడే భావం 
***********************

ఏం బాధరో ఇది పొంగుతున్నది 
ఏం బాధరో ఇది ఉబుకుతున్నది 
ఏం బాధరో ఇది ఆగకున్నది 
ఏం బాధరో గుండె పిండుతున్నది 

కళ్ళ నుంచి నీరు గార్చి 
కలతనేమో మనసుకిచ్చి 
ఒళ్ళంతా తడిపేసి 
చెమటలాగా చిందులేసి 

చిత్రవదనే చూపిస్తది 
విరిగిపోని వేదననే మిగులుస్తది 

కోపాన్ని భయటపెట్టి 
అసహనం చేతికిచ్చి 
ఏడ్వటమే మార్గమంటది 

వెర్రితనం  జతచేసి 
విచక్షణ చెరిపేసి 
వెక్కి వెక్కి దు:ఖాన్నే రగిలిస్తది 

అందమయిన మనసును 
మందంగా మార్చేసి 
మొండితనంతో మొరాయిస్తది 

ఎందరెన్ని చెప్పినా 
ఎంత ఓదార్చినా 
రచ్చ చేయటమే ఆపకుంటది 
  అందరినీ దూరంచేసి 
ఒంటరిని పరిచయం చేసి 
నీ నెత్తి మీద కుండ లాగా కూర్చుంటది 

నీ మాట మాత్రమే అది వింటది 
ఆనందమే తనకు దూరమంటది 

భాద అంతా భయటికి పోయినాక 
రాయి లాంటి మనసునే హాయి చేస్తది 

//గరిమెళ్ళ గమనాలు//22. 09. 2014//

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి