Friday 26 September 2014

కవిత నెం47:వరకట్నం

కవిత నెం : 47//వరకట్నం //

వరకట్నం ........ 
ఇది వధువు తల్లిదండ్రులకు ఆత్మస్థైర్యమైతే 
వరుడికి మాత్రం అంటుకున్న దురహంకారం 
జీవం పోసిన ఆ దేవుడే ''కట్నం '' అనే మరణాన్ని కూడా ఇచ్చాడు 
ఇది ఆడపిల్ల బ్రతుకుపాలిట నిలచిన ఒక పాపం 
ఆడపిల్ల అంటేనే భయపడే స్థితిని తెచ్చింది ఈ ''కట్నం ''
అబ్బాయిలకు మాత్రం ఇది వరం లాంటి ఒక ఆయుధం 
చట్టాలు ఎన్ని తెచ్చినా చలించదు ఈ సమాజం 
రెండు జీవితాలను కలపాలంటే ఈ కట్నమే ప్రధానం 
ఆడపిల్లరా అది ఆట బొమ్మ కాదురా 
''వరకట్నం '' అనే తూకంతో అమ్మాయి మనసు కొలువకురా 
కన్నవారి హృదయాలకు తను ఒక ప్రాణం రా 
నిన్ను నమ్మి వచ్చింది నువ్వే తన ప్రాణం రా 
నీ కోసం విడిచిపెట్టి తన కుటుంబాన్ని ,ఆత్మాబిమానాన్ని 
పసి పాప రా తాను , కసి తీరా వేధించకురా 
తాళి నీవు కట్టావురా ,ఉరి తాడులా దాన్ని మార్చకురా 
ఆడపిల్ల అంటేనే మహాలక్ష్మీ స్వరూపంరా 
ఆ మహాతల్లి చాలదా ఇంకా లక్ష్మీ అంటూ కాంక్ష ఏలరా 
వరకట్నం అనే ''ఊబి '' లోకి దిగకండిరా 
వరం లాంటి జీవితాన్ని నాశనం చేసుకోకండిరా 

0 comments:

Post a Comment