
కవిత నెం :50
మహిషాసురమర్దిని
********************
రంభుడు అనే రాక్షసుణి పుత్రుడు మహిషుడు
బ్రహ్మ వరంతో వరగర్వితుడై లోక కంటకుడయ్యాడు
మదబలముతో దేవేంద్రుని ఓడించి ఇంద్రపదవినొందాడు
మహిషునిపై పుట్టిన క్రోదాగ్ని తేజముగా ఉద్భవించే
ఆ త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై స్త్రీ రూపముగా జన్మించే
శివుని తేజము ముఖముగా ,విష్ణు తేజము భాహువులుగా
బ్రహ్మ తేజము పాదములుగా - దుర్గా దేవిగా అవతరించే
పద్మా సనస్థయైన ఆ తేజో : పుంజరూపిణికి
సర్వదేవతలు...