కవిత నెం : 240
*ప్రకృతితో ప్రేమ *
పరవశించే నా మనసు ప్రకృతిని చూడగా
కలవరించే నా మనసు నీ తోడు కోరగా
ఇద్దరమూ కలిసి ఈ క్షణములో మెండుగా
హరితంలో ఆహ్లాదంగా ఆనందం పొందగా
మన ప్రేమ గుర్తులు ఈ ప్రకృతిలో మొలకెత్తగా
మన ప్రేమ పదికాలాల పాటు
పచ్చదనంతో విరబుయ్యంగా
- గరిమెళ్ళ గమనాలు // 30. 11. 2016...
Tuesday, 29 November 2016
కవిత నెం 239:అర్ధమయ్యి పోయే నీ ప్రేమ
కవిత నెం :239
*అర్ధమయ్యి పోయే నీ ప్రేమ *
నీకు నువ్వే పలకరిస్తావు
నీకు నువ్వే పచ్చి అంటావు
నాలోన అలజడి జ్వలింపచేస్తావు
నీకు నువ్వే దహనమవుతావు
నా చుట్టూ నువ్వు గీత గీస్తావు
నన్ను చుట్టుకుంటూ నా దాని వంటావు
నాకోసం వర్షమై కురుస్తూ ఉంటావు
నాకు మాత్రం ఎండమావిని మిగులుస్తావు
నీ హృదయంలో స్పందన నాదంటావు
నన్ను మాత్రం శిల్పంలా ఉండమంటావు
కనిపిస్తావు - వలపిస్తావు
కోపిస్తావు - క్షమిస్తావు
ప్రేమ నీవై - ప్రేయసి నీవై - జీవితం నీవై
ప్రపంచాన్ని నాకు...
Friday, 25 November 2016
కవిత నెం 238 :నాకున్న దిక్కు నీవే
కవిత నెం : 238
*నాకున్న దిక్కు నీవే *
నాకున్నది నువ్వే కదా నా మనసుకి మనసుగా
నాకున్నది నువ్వే కదా నా ఉనికికి ఊపిరిగా
నాకున్నది నువ్వే కదా నా భావాలకు రూపంగా
నాకున్నది నువ్వే కదా నా కనులలో కాంతిగా
నాకున్నది నువ్వే కదా నా స్నేహంలో హితంగా
నాకున్నది నువ్వే కదా నా ప్రేమకు ప్రేయసిగా
నాకున్నది నువ్వే కదా నా స్వప్నాలకు సాక్ష్యంగా
నాకున్నది నువ్వే కదా నా బాధకు ఓదార్పుగా
నాకున్నది నువ్వే కదా నా ఇజంలో నిజంగా
నాకున్నది నువ్వే కదా నా హృదయంలో దేవతగా
నాకున్నది నువ్వే...
కవిత నెం 237: నీ ప్రేమకు సలాం

కవిత నెం : 237
* నీ ప్రేమకు సలాం *
నా మనసు మళయమారుతం లా మారింది
నీ ముద్దు మాటల తడి నన్ను చేరగా
నన్ను మార్చాలని ప్రయత్నించి
నిన్ను నన్నుగా మార్చుకున్నావా నాకోసం
నీ కలవరింత నాకోసం అని తెలియక
నేను కలవరిస్తూనే ఉన్నా నీ జ్ఞాపకాల మాటున
నీలో ప్రేమ పుట్టించగలనని అనుకోలేదు
కొత్తగా పుట్టిన నీ ప్రేమ నన్ను ముగ్దుడని చేస్తుంది
- గరిమెళ్ళ గమనాలు
...
Wednesday, 23 November 2016
కవిత నెం 236:ప్రేమంటే నా మాట లో
కవిత నెం : 236
* ప్రేమంటే నా మాట లో *
ప్రేమంటే నిన్ను కోరుకోవటం కాదు
ప్రేమంటే నీ మనసుని కోరుకోవటం
ప్రేమంటే నిన్ను వేధించటం కాదు
ప్రేమంటే నిన్ను ఆరాధించటం
ప్రేమంటే నిన్ను శాసించటం కాదు
ప్రేమంటే నీకోసం శ్వాస వదిలెయ్యటం
ప్రేమంటే నిన్ను బందించటం కాదు
ప్రేమనే బంధంలో జీవించటం
ప్రేమంటే నిన్ను ద్వేషించటం కాదు
నీ ప్రేమకై కాలమంతా పరితపించటం
ప్రేమంటే స్నేహం కాదు
స్నేహం ప్రేమగా మారవచ్చు
ప్రేమించిన ప్రేమికుడు స్నేహితుడిగా ఉండలేదు
కానీ ప్రేమ దక్కిన ,లేకున్నా భక్తుడుగానే ఉంటాడు
ప్రేమ కాలాన్ని నిర్బందించలేకపోవచ్చు
కాని నిజమైన ప్రేమ నిరీక్షణలో...
కవిత నెం 235 :నీతోనే ఉంటా నమ్మవా

కవిత నెం :235
* నీతోనే ఉంటా నమ్మవా *
నా నిద్రతో నీవు నిదురిస్తున్నావా చెలీ
అందుకే నాకు నిద్రలేని ఈ రేయి
నా కనురెప్పపై కొలువున్నావా చెలీ
నా రెప్ప నా మాట వినటం లేదు
నీ జ్ఞాపకాలలో నేను గుర్తొస్తున్నా అన్నావు
నీ హృదయంలో జీవిస్తా ఆ మాట చాలు
నీ కలత నాకు సంతోషం కాదు
నువ్వు బాధ పడితే ఆ కలతకి కన్నీరు నేనవుతా
...
Sunday, 20 November 2016
మినీ కధ 1 :ఎలుకమ్మ ర్యాగింగ్
మినీ కధ
** ఎలుకమ్మ ర్యాగింగ్ ***
మా ఇంటి అలమరలో ఉంది ఒక ఎలుక
ఎప్పటి నుంచో వేసింది పాగ
దొరకకుండా తిరుగుతుంటాది బాగా
ఓ అల్లరి చేస్తుంది కిర్రు కిర్రు మనే లాగా
పట్టుకుందామంటే చూపిస్తాది దాని తోక
సబ్బులు ,బియ్యం ,కూరగాయలు ,బట్టలు
ఏది కనపడితే వాటిని వదలదు ఈ ఎలుక
ఒకసారి తలుపులు మూసి పెట్టాను పొగ
మా ఇల్లు మొత్తం అది కమ్ముకోగా
ఎలుక మాత్రం ఉంది నిబ్బరంగా
మా కొంపకంటెను పొగ సెగ దట్టంగా
దానితో నాకు ఒళ్ళు మండింది పూర్తిగా
ఒక పొడవాటి కర్రతో దానిని వెంబడించగా
ఎలుక చావలేదు ,...
Tuesday, 8 November 2016
కవిత నెం 234:నోటు నోటు నువ్వేం చేస్తావ్ అంటే !
కవిత నెం :234
నోటు నోటు
నువ్వేం చేస్తావ్ అంటే !!!!!!!
నీకు చిల్లర దొరకకుండా తిప్పిస్తా
నీతో ఉంటూ ,నీకే పనికి రాకుండా ఉంటా
పేదవానికి అందకుండా తిరుగుతా
ధనవంతులకు 'దగ్గర బంధువు'' నవుతా
బ్యాంకులను కొల్లగొడతా
కమీషన్ దందాలకు తెరచుడతా
లంచాల రుచి చూపెడతా
లంచగొండిలను సృష్టిస్తా
దొరికినంతవరకు దోచేయ్ మంటా
తరతరాలకు ఆస్థిని కూడబెడతా
కష్టపడి పని చెయ్యమంటా
సోమరితనంతో నన్ను సంపాందించమంటా
కుమ్ములాటకు దిగి కొట్టుకుచావమంతా
మత కల్లోలం కు నవాబ్ నవుతా
విద్వంసాలకు వెర్రి...
కవిత నెం 233 :చదువుల బరువులు
కవిత నెం :233
*** చదువుల బరువులు ****
చిట్టి చిట్టి చేతులకి బారెడు బాధ్యతలు
బుడి బుడి నడకలకి ఈడ్చలేని బ్యాగుల మోతలు
ఏం నేర్పుతున్నాయి పాఠశాల చదువులు
ఏం చదవగలరు ఈ చిన్నారి బాలలు
పొంతన లేని పాఠ్యంశాలు , చేరుకోలేని గమ్యాలు
అందుకోలేని పోటీలు , చిన్నారులకు అవి శాపాలు
మేమే గొప్ప అంటూ పాఠశాలల ప్రచారాలు
అర్ధంలేని మితిమీరిన ఉపాధ్యాయ బోధనలు
వారి వేగాన్ని అందుకోలేక చిన్నారుల అవస్థలు
నిస్సహాయ స్థితి లో చిక్కుకునే కన్నవారి హృదయాలు
ఆట పాటలకు నోచుకోలేని పసితనపు...
Thursday, 3 November 2016
కవిత నెం 232 :కన్నీటి చుక్క
కవిత నెం :232
***** కన్నీటి చుక్క *****
ఆకాశంలో పొడుస్తుంది వెలిగే చుక్క
మన అంతరాళంలో ప్రవహిస్తుంది ఈ కన్నీటి చుక్క
వెక్కి వెక్కి ఏడుస్తాము మనసుకి కష్టమనిపిస్తే
దుఃఖి దుఃఖి రోధిస్తాము ఎవరైనా దూరమయితే
బాధలో అయినా ,ఆనందంలో అయినా మన స్పందన ఒకటే
ఆ స్పందనలో స్పర్శ లా చేరి పంచుకునే చెలిమే ఈ కన్నీటి చుక్క
వెచ్చగా చెక్కిలిని ముద్దాడి నువ్వు ఒంటరి కాదు అని గుర్తుచేస్తుంది
మానవత్వాన్ని చూపే మనసు ఉందని మనకు తెలియచేస్తుంది
ఉప్పొంగే హృదయం ఉందని వేదనతో అది చెబుతుంది
భరించే...