Friday 13 January 2017

కవిత నెం 252 : కారణం లేని కోపాలు

కవిత నెం : 252
* కారణం లేని కోపాలు *
ఎందుకు కోపాలు ఎందుకు తాపాలు
కాలం మళ్లీ తిరిగీ రాదు  కరగని పైత్యాలు

అద్భుతమైన అనుబంధాలు
ఆత్మీయతల అనురాగాలు
ఇన్ని ఉన్నా ఈ లోకంలో ఎగిరెగిరే పంతాల ? //2//

కాసేపు ఓపికగా ఉండలేని మనుషుల తత్వాలు
కూసేపు కూడా ప్రతీక్షించని మనసు ఆగడాలు

ప్రేమించటం కాదు మనిషి ప్రేమ పొందరా ప్రేమతోటి
జీవించటం కాదు మనిషి అనుభవించరా హాయితోటి

ఒక మాటైనా మాట్లాడు మంచిని పెంచేట్టు
వ్యర్థపు మాటలకు కళ్లెం వెయ్యి కలిసి ఉండేట్టు

మమకారం వెటకారం కాబోదురా
మన మమతల విలువేమిటో చూడరా

కసిగా పెరిగే కోపం విరోధాలకు నిలయం
మబ్బులా కమ్మే రోషం కలిగించదు శాంతం

అన్నీ తెలుసు మనకి అంతా తెలియనిది ఎవరికీ
వెర్రి కోపంలో విచక్షణ మాయమైపోతది
కాసేపు ఆగాక అది సిగ్గులా పుడతాది  ..... సిగ్గులా పుడతాది

మనకు మనమే ఆలోచన చేస్తే అది నిగ్రహం అవుతాది .... నిగ్రహం అవుతాది
సర్వం  నాశనం అంతా వినాశనం
రగిలే కోపం రేగే క్రోధం అంతా క్షణికం
అసూయలాగా పగ లాగా మార్చేసే భూతం .... భూతం ... భూతం

- గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు




0 comments:

Post a Comment