Friday 27 January 2017

కవిత నెం 261:నిద్ర

కవిత నెం :261

నిద్ర గాడంగా
మనసు భారంగా
కనులు ఆపంగా
కునుకు దీర్ఘంగా

కనులు ఎరుపెక్క
తలంతా తిక్క తిక్క
నా కనుబొమ్మలు అటకెక్క
నా ఒళ్ళంతా తిమ్మిరెక్క

ఎదురుగా ఉంది పని
ఆపేది ఏమిటని
నాలోన అనుకున్నా గాని
కాసేపు కునుకేద్దామని
పిలిచాను నిద్రలోకాన్ని

నిద్ర భలే
దీని ముద్ర భలే
ఇది బహు తమాషాలే
రమ్మంటే  రాదులే
పొమ్మంటే పోదులే

పుస్తకం పట్టుకుంటే
వస్తుంది మనవెంటే
పని చేసుకుందామంటే
మొట్టికాయ మొడతదంతే

కమ్మగా నిద్రపోగలిగితే అది 'స్వర్గం '
నిద్ర లేక అవస్థపడుంటే అది 'నరకం '

- గరిమెళ్ళ గమనాలు
(27. 01. 2017)





0 comments:

Post a Comment