Friday 27 January 2017

కవిత నెం260:వెన్నెల్లో అమావాస్య

కవిత నెం :260

*వెన్నెల్లో అమావాస్య *

ఒక  నిర్మానుష్యమైన భయం
ఒక నిశ్శబ్దపు వాతావరణం
ఎక్కడ అలికిడి జరిగిన ఉలిక్కి పడే రోజు
రోజులు మారుతున్నా మూడాచారాలు మారవు
మనం మారుతున్నా మన నమ్మకాలు మారవు
గుండెలు ఎగిరిపడే రోజు
చీకటి రాత్రులు విజృభించే రోజు
ఉన్మాదపు క్రియలు ఊపిరి పోసుకునే రోజు
ఊడల మర్రి 'విలయ తాండవం' చేయు రోజు

ఇలా అమావాస్యంటే ఎన్నో ఎన్నో ఆలోచనలు
మనం ఊరుకున్నా మన మనసు మాట వినదు
ఎక్కడికీ వెళ్లకూడదని .... ఏ పనీ ఈరోజు ఆరభించకూడదు అని
ఎన్నో ఎన్నో వినే ఉంటాం .... ఇలాంటివి మన కళ్ళముందు చూస్తూనే ఉంటాం
తీవ్రమైన  పూజలు చేస్తూఉంటాం ... విపరీతమైన భక్తితో దేవుణ్ణి వేడుకుంటాం

కనిపించే వాటికి భయపడతాం ... కనిపించని వాటికి భయపడతాం
ఇలా ప్రతీ దానికి భయపడి మన కళ్ళను మనమే చీకటి చేసుకుంటున్నాం
నువ్వు మంచి పనులు చేస్తున్నావంటే నీలోనే దేవుడున్నట్టే
నువ్వు చెడుకి  వ్యసనమవుతూ ,బానిస అవుతున్నావంటే దెయ్యమే నీవైనట్టే
ప్రతీ రోజూ చీకటి పడుతుంది ... సూరీడు రాగానే అది పోతుంది
 ఎంత చీకటి పడినా వెన్నెల ఉండనే  ఉందిగా మనతోటి ...
వెన్నెలంటే ఇష్టపడే నీవు అమావాస్య అంటే ఎందుకు అయిష్టం ?
ఎన్ని చీకటిలు మనల్ని కమ్మినా , ఏ అమావాస్య మనకెదురయినా
మన ఆత్మస్థైర్యం మనల్ని వీడకూడడు ..... వెన్నెల లాగా
మన గుండెనిబ్బరం  జారిపోకూడదు మిణుగురు  పురుగు లాగా
అందుకే గుర్తు పెట్టుకో మనం ఉన్నది ''వెన్నెల్లో అమావాస్య ''

- గరిమెళ్ళ  గమనాలు
27. 01. 2017











0 comments:

Post a Comment