Tuesday 31 January 2017

కవిత నెం264:* జీవన పోరాటం *

కవిత నెం :264

*జీవన పోరాటం *

పొద్దుగాడ లేస్తూనే
పొట్టకూటి కోసం
ఎన్నో పనులు
మరెన్నో బాధ్యతలు

గీ రోజు  మంచిగా గడిస్తే చాలు
గీ  దినం మనం బతకనీకి సంపాదిత్తే చాలు
ఎన్నో హృదయాల ఆర్భాటం
మరెన్నో హృదయాల బ్రతుకు పోరాటం

మనిషి ఆశలకు హద్దుల్లేవు
మనోషి ఊహలకు నియమాలు లేవు
కొద్దిమంది  మేడలు , మిద్దెల్లో కాపురముంటే
మరి కొద్దిమందికి నిలువ నీడ లేక తపించేవారు

ఏముంది ఈ భూమిలో అంతా మట్టేకదా
ఏముంది ఈ గాలిలో అంతా తేమే కదా
అవి ఉన్నోడికి ,లేనోడికి అంతా ఒకటే కదా
మరేంది జట్కాబండి బ్రతుకులు
మరేంది ఆకలి అరుపుల ఆర్తనాదాలు

ఉన్నోళ్లు ఆశ చావక ఆకాశం వైపు పోతుంటే
లేనోడు ఈ పొద్దు గడిస్తే చాలు అంటూ ఎదురు చూపులు



0 comments:

Post a Comment