Wednesday 18 January 2017

కవిత నెం 256 :రిపబ్లిక్ డే

కవిత నెం  :256

** రిపబ్లిక్ డే **

భారత దేశంలో రాజ్యాంగం అమలు ప్రారంభమైన రోజు
భారత దేశం గణతంత్ర దేశంగా ప్రకటించుకున్న రోజు
 'గణతంత్ర దినోత్సవం ' గా జాతీయ పండుగ జరుపుకునే రోజు

భారత దేశ చరిత్రలో భారతీయులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన రోజు
బ్రిటీష్ వారి రాజ్యాంగ విధానాలు రద్దు కాబడిన రోజు
ప్రజాస్వామ్య విధానాలతో  నూతన రాజ్యాంగం అమలు కాబడిన రోజు
ప్రజలే ప్రభుత్వం గా ప్రభుత్వమే ప్రజలుగా ప్రజా ప్రభుత్వం గా మారిన రోజు

డా. బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్
డాక్టర్ బి . ఆర్ .అంబెడ్కర్ చైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ
అన్నీ కలగలిపి అతి పెద్ద లిఖిత రాజ్యాంగం గా
మన భారత రాజ్యాంగం చరిత్రలో నిలచిన రోజు


భారతీయుల ఆత్మ స్థైర్యానికి ప్రతీకగా నిలచిన రోజు
అమర వీరుల త్యాగనిరతిని వెలిగెత్తి కొనియాడుకునే రోజు
జాతి వైషమ్యాలను విడచి 'జన గణ మన ' అంటూ గీతాలాపన చేయు  రోజు







0 comments:

Post a Comment