Wednesday, 28 October 2015

కవిత నెం 201(అప్పుల తిప్పలు)

కవిత నెం :201 'అప్పుల తిప్పలు '' అప్పుల తిప్పలు  ఇవి ఎవ్వరికే చెప్పుడు  ఆదియందు అందంగా  రాను రాను భారంగా  మన ఆలోచనలను ఘోరంగా  అంతరాత్మలో కలత నిరంతరంగా  నిద్రవచ్చినా పోనీయ'కుండా  ఆకలివేసినా తిననీయకుండా  వెక్కిరిస్తుంటుంది వెటకారంగా  వేడుక చూస్తుంటుంది వినోదంగా  జీవితానికి అవసరం డబ్బైతే  అవసరమైన వేళ అది సర్దుబాటుకాకపోతే  నేనున్నా అంటూ ''స్నేహమై '' నిన్ను చేరేదే అప్పు  ఒకప్పుడు అప్పు దొరకటం చాలా కష్టమే  ఇప్పుడు తలుచుకుంటే చాలు తలుపు తడుతుంది  అది తీర్చేంత వరకు నిన్ను...

Tuesday, 27 October 2015

కవిత నెం 200:గుండె చప్పుడు

కవిత నెం :200 గుండె చప్పుడు  నాలో నేనే నీలా  నీలో నీవే నాలా  ఒక్కసారిగా ఒక్కటై  ప్రతిస్పందన మొదలై  మనలో మనమే చేరగా  ఏమంటారు దానినే  గుండె చప్పుడు ... గుండె చప్పుడు  నీ ఆలోచనలో నేనే ఉండగా  నా ఆలోచనలో నీవే నిండగా  నా కనులలో వెలుగు నీవేగా  నీ శ్వాషలో ఊపిరి నేనుగా  ఒకరికి ఒకరం  ఒక్కసారిగా ఇద్దరం  అంటారేమో దీనినే  గుండె చప్పుడు ... గుండె చప్పుడు  నీ వెళ్లే చోటనే నేనే రానా  నే నడిచే బాటలో అడుగివి నీవుగా  వింటున్నా నీ పేరే ఒక సంగీతంలా  నీ పిలుపే నాకు...

Sunday, 25 October 2015

కవిత నెం 199:అసమాంతరాలు

కవిత నెం :199 *అసమాంతరాలు * అక్షరాలు రేకుండా పదాలు సమకూర్చలేము  అవాంతరాలు లేకుండా గమ్యం చేరలేము  ఏది ఏమైనా నిజాన్ని నమ్మలేము  అనుకున్నది ఏమైనా జరగకుండా ఆపలేము  నిరీక్షణ ఏమైనా ఫలితాన్ని మార్చలేము  జరిగిన దానిని తలుచుకుంటూ  జరగవలసినది ఆలోచిస్తూ  ప్రస్తుతంలో ఏమి చేయలేని అయోమయంలో  ఎందుకు  నేస్తం నీవుండాలి  నిన్న అనేది ఓ పునాది  చేదు అనేది రుచి కి ప్రతి నిది  తెలుసుకోవటానికి అడుగు ముందుకు వెయ్యి  అనీ తెలిసినట్టుగా ఉండటం మర్యాద కాదోయి  జీవితం అనేది ఒక్క గతంతో ఆగేది కాదోయి  జీవితం...

కవిత నెం 198:మౌన శబ్దం

కవిత నెం :198 *మౌన శబ్దం * కలలు అలలై కావ్యమై  కురిసినవి వర్షపు చినుకులై  కదిలించే నాలో తలపులే  కదిలోచ్చే నాతొ ఊహలే  ఎదలో చెరుగని గుర్తులే  వికసించే నేటి కుసుమమై  మెరిసింది మెరుపు కాంతియై  రమ్మంది పిలుపు గమ్యమై  ఆగింది నా మనసు నిశబ్దమై....  నిశబ్దమై ............  ...

కవిత నెం 197:ఒకరిలో ఒకరం

కవిత నెం :197 *ఒకరిలో ఒకరం * నువ్వున్నావులే నా కోసమే  నా జన్మాంతము నీతో సాగులే  నింగీ నేలకు దూరం కరిగెనే  నిన్ను కలిసిన వేళలో నే లోకం మరుచులే  ఎదలో ఏదో ఆశ  నా కలలో నిన్నే తలచా  ఏ క్షణము విడువని శ్వాస  నిన్ను చూసి కదిలేను తెలుసా  ఎవరికెవరు తెలియని ఏమౌతామో మనకని  అని తెలిసి తెలియని తరుణం  నిన్ను పరిచయం చేసిన సమయం  ఎంతో ఇష్టమే...

కవిత నెం196:దాచుకున్న మనసు

కవిత నెం :196 * దాచుకున్న మనసు  * నేనంటే  ఇష్టాన్నీ నీలో దాచుకుంటావా  నేనే నీ ప్రాణమని నాకు తెలియదంటావా  మాట తెలిపే వేళ మౌనమెందుకే  నీ మనసు తెలుసే బాల కోపమెందుకే  బంగారం నిన్నోదిలి నేను ఎలా ఉండనే  పెంచుకున్న ఈ దూరంలో నువ్వు ఏమి అవుతావే  నీ కళ్ళలోన నా రూపం - కనపడుతుంది  నీ కనుపాప దానినేమో కప్పి వుంది  నీ పెదవులలో నా పేరు దాగివుంది  నా పిలుపు కోసం అది వేచియుంది  బంగారం ఈ నిముషం ఏమి తెలియదంటావా  నీ కోసం ఆకాశమై ఎదురు చూడమంటావా  నీ గుండెలోన మనప్రేమ నిలచివుంది  ఎందుకనో...

కవిత నెం195:మరో జన్మంటూ ఉంటే

కవిత నెం :195 మరో జన్మంటూ ఉంటే  మరో జన్మంటూ నాకు ఉంటే  నేనిలాగే మనిషిలానే జన్మించాలి  ఈ జన్మలో ఉన్నవాళ్ళు నాకు మరో జన్మలోనూ కావాలి  నేను కోల్పోయిన వాళ్ళను మరో జన్మలో చూడగలగాలి  అమ్మప్రేమ ఇలానే నాకు తోడుండాలి  రాజును కానక్కరలేదు కాని సంపన్నుడిని కావాలి  రాజ్యాన్ని పాలించనక్కరలేదు ఉన్నతంగా జీవించాలి  మహోన్నతుడిని కానాక్కరలేదు  మానవత్వం ఉంటే చాలు  చిరంజీవిని కానక్కరలేదు చిరునవ్వుతో బ్రతికితే చాలు  సొంత ప్రయోజనాలకు లోబడని నిస్వార్డుడిని అయితే చాలు  పరాక్రమవంతుడుని కానక్కరలేదు గుండె...

Friday, 23 October 2015

కవిత నెం 194:నేటి స్నేహ వైఖరి

కవిత నెం  :194 ''నేటి స్నేహ వైఖరి  '' ప్రతీ మనిషికీ అలవాటు ''స్నేహం '' ప్రతీ మనిషికీ అవసరం ''స్నేహం '' స్నేహం పేరుతోనే ఒకరికి ,ఇద్దరవుతుతారు  ఆ ఇద్దరూ ,ఇరవై ,వందలవుతుంటారు  అంతా బాగానే ఉంటుంది  మన అవసరం ,ఆనందం కోసం ''స్నేహం '' అవసరమే  మన కష్ట -సుఖాలను పంచుకునేది ఒక్క ''స్నేహితుల'' తో మాత్రమే  ఆ స్నేహం పద్దతిగా ,హుందా తనంగా ఉంటే మంచిదే  ఆ స్నేహం చిక్కగా ,చక్కగా బలపడితే ఇంకా మంచిదే  ఇకపోతే కబుర్లు ,కాకరకాయలు అన్నీ పంచుకున్నాక  ఏమి చెయ్యాలో తెలియక కొత్త మోజు ,జబ్బు పుడుతుంది  ఒకరిలో ఒకరు...

Wednesday, 21 October 2015

కవిత నెం 193:సమాజపు పోకడ

కవిత నెం : 193 *సమాజపు పోకడ * నమస్కారానికి ప్రతి నమస్కారం - అది సంస్కారం  ఆ నమస్కారాన్ని పాటిస్తున్నదెవరు ? అదే సంస్కారం అని గుర్తిస్తున్నదెవరు ? హాయ్ అని ,నమస్తే అని , సలాం అని  తెలుగు భాషని ,సాంప్రదాయాన్ని పక్కన పెట్టి  పొడి పొడి అక్షరాలను చేర్చి , సాగించుకుంటున్నారు  నువ్వు ఎదుగుతున్న కొద్దీ ,నీలో మార్పు ఉంటుంది  మరి నువ్వు నేర్చిన మాటలకెందుకు మౌనముంటుంది  సిల్లీగా సారీ అంటారే ,క్షమించు అంటానికి శ్రమనా నీకు ? ఓహ్ థాంక్యూ అంటారే ,ధన్యవాదముకు దండాలు ఎందులకు ? ప్రతీ పదం ఆంగ్లం , ప్రతీ పద్దతిలో వెస్ట్రన్  బుద్దిగా...

Tuesday, 20 October 2015

కవిత నెం 192:నువ్వే నాకు - నీవే నాకు

కవిత నెం :192 నువ్వే నాకు - నీవే నాకు  నేనెక్కడున్నా  నాతోనే ఉంటూ  నా పక్కనే ఉంటూ  నాలో సగమై ఉంటూ  నేను పాలు అయితే  తను నీళ్లు లా ఉంటూ  నేను జీలకర్ర అయితే  తను బెల్లం లా ఉంటూ  నేను నీడ అయితే  తను తోడుగా ఉంటూ  నాకు స్నేహితురాలిలా  నా ప్రియురాలిలా  నా హృదయంలా నన్నంటి ఉంటూ  అమ్మ తర్వాత అమ్మంత ప్రేమ చూపిస్తూ  నా బాధ్యతను పంచుకుంటూ  నా కష్టాలకు ఓదార్పునిస్తూ  నా ఇష్టమై నాలో ఐక్యమై ఉంటూ  నా భాదను మరిపిస్తూ  నాకు సంతోషాన్ని కలిగిస్తూ  నేను చేసే ప్రతి...

Tuesday, 13 October 2015

కవిత నెం191:అల్ప సంతోషి

కవిత నెం :191 *అల్ప సంతోషి  * ప్రపంచం చాలా పెద్దది  దానిలో మన ఆలోచనలు అనంతం  అంతా మనమే అనుకుంటూ ఉంటాం  కాని మనల్ని బొమ్మగా చేసి ఆడుకుంటారు  జీవితం అంటే ఇంటే ఒక చదరంగం  ఆడదాం ఓడిద్దాం అని మొదలెడతాం  గెలుపు వరకు వెళ్తాం ఓడించబడతాం  గెలిచినా మన గెలుపులో మరొక హస్తం  ఆనందిస్తాం సంతోషం వస్తే  బాదపడతాం విచారమనిపిస్తే  కాని రెండింటినీ ఒకేలా స్వాగతించం  స్నేహమనుకుంటాం ...బంధం అనుకుంటాం  అంతా మనవారే అనుకుంటుంటాం  మనతోటి కలిసి ,మనవెంటే తిరిగి  మనమంతా ఒకటే అని నమ్మించబడతాం  మనం...

కవిత నెం 190:పేగుబంధానికి విలువెక్కడ ?

కవిత నెం :190 పేగుబంధానికి విలువెక్కడ ? అమ్మా నాకు చిన్న నలతగా ఉంటే  నువ్వు కలత చెంది ,కన్నీళ్లు పెట్టుకునేదానివి  అమ్మా నేను అడగకుండానే  నాకు ఆకలివేస్తుందని గ్రహించి నా బొజ్జ నింపేదానివి  చిన్నప్పుడు ఒక నిముషం నువ్వు కనపడకపోతే  కిందపడి ,వెక్కి వెక్కి ఏడ్చే వాడిని  నిన్ను విడిచి దూరంగా ఉండాల్సి వస్తే  బెంగ పెట్టుకుని ,నీ కోసం ఎదురు చూసేవాడిని  నాకు భయమనిపిస్తే  నీ ఒళ్లో తలపెట్టి దాక్కుండేవాడిని  నాకు నిద్దుర రాకపోతే  నీ జోల పాట వింటూ హాయిగా నిద్రపోయేవాడిని  నువ్వంటే ఎంతో ఇష్టం...

Monday, 12 October 2015

కవిత నెం189(ఆదిపత్య పోరు)

కవిత నెం :189 ఆదిపత్య పోరు  నేనంటే నేను అంటూ  నేనేలే ముందు అంటూ  నా పేరే ఉండాలంటూ  నన్నే అందరూ కీర్తించాలంటూ  ప్రతి మదిలో దాగుంటుంది గుట్టు  పైకి  ప్రేమ ,అభిమానం చూపించుకుంటూ  ఎటువంటి భేషజాలకు చోటులేదంటూ  ''నేనే '' అన్న అహంకారాన్ని పూసుకుంటూ  ''నేనే'' అన్న స్వార్దాన్ని అంటించుకుంటూ  ఉండలేరుగా ఒకరంటూ ఊరకిట్టూ  ప్రతీ కులానికి ఉంటుంది ఒక గట్టు  ప్రతీ ప్రాంతానికి ఉంటుంది ఆనకట్టు  ప్రతీ మనిషీ వాటితోనే చేస్తుంటాడు కనికట్టు  ఎందుకో తెలియని ఆకాంక్షను పెంచుకుంటూ  సమాజంలో...

Wednesday, 7 October 2015

కవిత నెం188:గురువారం

కవిత నెం :188 గురువారం  గురువారం  గురు బలం ఉన్న వారం  శ్రీ సాయి కాటాక్షం పొందే వారం  ఇది లక్ష్మీ వారం  లక్ష్య సిద్ది కలిగే వారం  అనుకూలమైన వారం  ఇది ఆనంద సాయి వారం  మన గుండె నిండే వారం  గురు భక్తికే గురువారం  శ్రేష్టమైన వారం  ఇది సాయి సన్నిధానం  మహిమ గల వారం  మహోన్నతమైన వారం  అందరికే ప్రియమైన వారం  నాకెంతో నచ్చే వారం  అందుకే ఇది గురువారం ...

Thursday, 1 October 2015

కవిత నెం187:ఎక్కడికి వెళ్తున్నాం మనం

కవిత నెం :187 ''ఎక్కడికి వెళ్తున్నాం మనం'' మనం పుట్టక ముందు ప్రకృతి అంటే పులకరించే వాళ్లం   నేడు మన అవసరాల కోసం కాలుష్య సహవాసం చేస్తున్నాం  ఒకప్పుడు అన్నం ,ఆవకాయ ముద్దతో ఆకలి విలువ తెలుసుకున్నాం  ఇప్పుడు ఫీజా ,బర్గర్స్ అంటూ మన శరీరాన్ని చెత్తతో నింపుతున్నాం  నిజాయితీ ,నిబద్దత అంటూ ఆ చదువులోనే నేర్చుకున్నాం  మనం బ్రతకటానికి ఏ  బీతి లేకుండా తప్పు దోవలో పోతున్నాం  మన తల్లిదండ్రుల ప్రేమలో ఎంతో ఎదుగుతూ వస్తున్నాం  మనవారిని మరచి ,మన దేశం విడచి ఆనాధలుగా ఉంటున్నాం  బడిలో చదివన వారమే ,పద్దతిగా...