Tuesday, 28 February 2017

కవిత నెం 278: అంతా మిధ్య

కవిత నెం :278 * అంతా మిధ్య * ఎక్కువగా ఏదీ కోరుకోకు  పొందినదాన్ని చేతులారా చేజార్చుకోకు  అంతా నీదేనని మిధ్యపడకు  ఇంతలో ఏముందని తేలికపడకు  సమస్తం తెలుసునని మిడిసిపడకు  అందరూ వెర్రివాళ్లు అని చులకనపడకు  సుఖంలో ఏదోఉందని సంబరపడకు  కష్టం బహుకఠినమని దిగులుపడకు  మెరిసేదే బంగారం అని తుళ్లిపడకు  మెరుపుకన్నా వేగం లేదని మభ్యపడకు  ...

Wednesday, 22 February 2017

కవిత నెం 277:*కారులో ...... *

కవిత నెం :277 *కారులో ...... * కారులో షికారుకెళ్ళండి నాయనా రోడ్లపై క్యూలో వెళ్ళండి నాయనా నీకున్నది ఒక్కకారు చూసుకుంటూ మురిసేవు నాజూకుగా నడిపేవు నీ పక్కకి రాక దడిసేము నీ పక్కకి రాక దడిసేము కారులో షికారుకెళ్ళండి నాయనా రోడ్లపై క్యూలో వెళ్ళండి నాయనా సందు సందులో నడిపేవు సైడు ఇవ్వకుండా పోతావు నీ కారు సైడుకి చిన్న గీతెడితే సీన్ చింతకాయ చేస్తావు సీను చింతకాయ చేస్తావు కారులో షికారుకెళ్ళండి నాయనా రోడ్లపై క్యూలో వెళ్ళండి నాయనా ...

కవిత నెం276:తెలుగు వెలుగు

కవిత నెం :276 శీర్షిక పేరు :  తెలుగు వెలుగు  మరో జన్మకేగినా , మరల జన్మించినా మాతృభాష  తెలుగవ్వాలనీ విదేశాలకేగినా ,విచ్చలవిడి తిరిగినా తెలుగంటే  అంటు కారాదని ఏ భాష నేర్చినా , ఏ యాస పలికినా తెలుగులాంటి తేనే బాషఉండదనీ చదువెంత  యున్నా , సంస్కారం నేర్పే సరళమైన భాష తెలుగేననీ అవయవాలు కదిలించి , ఆరోగ్యం కల్పించే మన తెలుగు భాష ఒకటేననీ తెలుగు జాతి ఖ్యాతిని చూపి , తెలుగోడని ఎలుగెత్తి చూపే భాష మన తెలుగనీ అక్షరాలు ఎన్నున్నా , లక్షణంగా  పలకగల తెలుగు భాష మనదేనని  ఈ అవనిలో  అఖండంగా దశ దిశలా ధ్వనించి రవళించే భాష మన తెలుగనీ  తెలుగును...

Tuesday, 21 February 2017

కవిత నెం 275:*గోవు (గో మాత)*

 కవిత నెం :275 *గోవు (గో మాత)* పరమ పవిత్రతకు , శుభానికి సూచిక 'గోవు' అనాదికాలం నుంచి ఆరాధ్యదైవం 'గోవు' భూమాత ధరించిన రూపం ' గోవు ' ఆదిశక్తి అంశ నుండి జన్మించిన రూపం 'గోవు' హోమంలో నుండి జనించిన అగ్నిగోత్రం 'గోవు ' ముక్కోటి దేవతలకు నిలయం 'గోవు' సమస్త కోరికలను తీర్చే దేవత 'గోవు' ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక 'గోవు' యజ్ఞయాగాది క్రతువులలో పాలు పంచుకోగలిగేది 'గోవు' అతీంద్రియ దర్శన శక్తిని కల్గినది 'గోవు' కన్నతల్లి సమానురాలు 'గోవు ' ప్రతి ఇంటీ కల్పతరువు 'గోవు ' రైతు వెన్నుముక 'గోవు' భూలోక పూజలందుకునే గో మాత 'గోవు' ముల్లోకాలకే విశ్వమాత...

Monday, 20 February 2017

కవిత నెం274:మన ఆవు గురించి మనం తెలుసుకుందాం

కవిత నెం  : 274 అంశం : మన ఆవు గురించి మనం తెలుసుకుందాం (వ్యాస రచన ) గోవు అందరికీ తల్లి . అందుకే వాడుకలో గోమాత అని పిలుస్తాము . గోవు పవిత్రతకు మరియు శుభానికి గుర్తు . హిందువులకు ఎంతో పవిత్రమైనది , ఆరాద్యమైనది ఆవులో సకల దేవతలు కొలువుంటారని ప్రసిద్ధి గోవు కుడి క్రొమ్ము ప్రక్క బ్రహ్మ , ఎడమ ప్రక్క విష్ణువు , కొమ్ముల చివర సకల తీర్ధాలు , నుదుట శివుడు , ముక్కునందు సుబ్రమణ్యేశ్వరుడు , చెవులందు అశ్వనీ దేవతలు , నేత్రములందు సూర్యచంద్రులు , నాలుకయందు వరుణుడు , గోవు ''హిం' కారమున సరస్వతీ దేవి , గండ స్థలాల యమ ,ధర్మ దేవతలు , కంఠమున ఇంద్రుడు , వక్షస్థలాన...

Friday, 17 February 2017

కవిత నెం 273:ఆటో వాలా

కవిత నెం :273 *ఆటో వాలా * జీవన భృతి కోసం మనిషి పట్టిన మూడు చక్రాల రధం ......... ఒకప్పుడు ఒకటి ,రెండు ,మూడు ఇప్పుడు వందలు కాదు వేలు ఒకడి కింద నలుగుతూ ఉండే కన్నా సొంతంగా సులువైన ఉపాధి ఆటో ఒక కిరాయి కోసం ఎదురుచూపులు కొన్ని సర్వీసులు వస్తే పూట జీతం ఆ ఆటోపైనే ఆధారపడే కుటుంబాలు సాయంత్రానికి లెక్కల ఎక్కాల జాబితాలు వెతుకులాట నుంచి ఆన్ లైన్లో సేవలు అప్పు చేసి మరీ ఆటో నడిపే మేధావులు అణుకువగా ఉండేది కొందరైతే అజమాయిషీ చేసేది మరి కొందరు ఆటో యూనియన్లలో చిక్కేది కొందరు స్వేచ్ఛగా విహరించి సంపాదించేది ఇంకొందరు మండుతున్న  డీజిల్ ధరలు ఒక వైపు పెరుగుతున్న...

Wednesday, 15 February 2017

కవిత నెం 272:అమ్మమ్మ

కవిత నెం :272 * అమ్మమ్మ * అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు రేపటి వెలుగమ్మ అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు భవితకు గతమమ్మ మా అమ్మకు అమ్మవు మమతల పందిరివు ఇంటికే ఇలవేల్పువు మా కంటికే కోవెలవు ముద్దుల అమ్మమ్మ నువ్వే మా పేదరాశి పెద్దమ్మ కల్లాపు జల్లేవు కన్నతల్లిగా సాకేవు పాలు పితికేవు మా ఆకలి కాసేవు అమ్మ అంటే చిరు భయం నీతోనే మా సరదా సమయం అటుకులు బెల్లం అందిచేవు ఆవకాయ రుచిని చూపావు మా అల్లరిని భరించేవు అది చూసి నువ్వు మురిసేవు ఎన్నో కబుర్లు కొత్తగా చెప్పేవు ఆ చందమామలా మమ్ము చూసేవు మా ఆట పాటలకు అమ్మవు నువ్వు మాకు ప్రేమ పంచే అనురాగం నువ్వు మా కష్టం చూసి నొచ్చుకునేవు మా...

కవిత నెం271: ఇదే జీవితం ... !!

కవిత నెం :271 శీర్షిక పేరు : ఇదే జీవితం ... !! ఏది సత్యం ఏది నిత్యం ఏది కృత్యం ఏది నృత్యం ఏది భావం ఏది జాలం ఏది రాగం ఏది త్యాగం ఏది పైత్యం ఏది దౌత్యం ఏది పంతం ఏది శాంతం ఏది రుద్రం ఏది రౌద్రం ఏది ధైర్యం ఏది స్థైర్యం ఏది లౌక్యం ఏది సౌఖ్యం ఏది బంధం ఏది అందం ఏది భోదం ఏది బేధం ఏది కష్టం ఏది నష్టం ఏది స్పష్టం ఏది శ్రేష్టం ఏది లక్ష్యం ఏది సాక్ష్యం ఏది గీత ఏది రాత ఏది భాద ఏది గాధ ఏది భవం ఏది భయం ఏది మూలం ఏది స్థూలం ఏది జన్మం ఏది మర్మం ఏది రమ్యం ఏది ఖర్మం ఏది సాయం ఏది న్యాయం ఏది ఉదయం ఏది సమయం ఏది అంతం ఏది సొంతం ఏది రంగం ఏది భంగం ఏది...

Tuesday, 14 February 2017

కవిత నెం 270: నిన్నే ప్రేమిస్తా

కవిత నెం :270 *నిన్నే ప్రేమిస్తా ** ప్రేమను ప్రేమగా పొందాను ,పొందుతున్నాను ప్రేమను ప్రేమగా చూడటమంటే తెలుసుకున్నాను ప్రేమకు అర్ధమే నీవని ,నీవుంటే ఏమీ అవసరంలేదని ప్రేమలోన దాగున్న ప్రేమను నాకోసం పంచావు ప్రేమతో నన్ను ప్రేమిస్తూ నా ప్రాణమై నిలిచావు ప్రేమాక్షర భీజాలను నాలో నాటావు ప్రేమాక్షయ పాత్ర లాగా నిరంతర ప్రేమను ఇస్తున్నావు నిన్ను ప్రేమిస్తూ ,నాలోన నీపై ప్రేమను ప్రేమిస్తూ ''ప్రేమ '' మంత్రం జపిస్తూ ప్రేమికుడిలా పయనిస్తూ నీ ప్రేమ హస్తంతో ప్రేమమయం లో విహరిస్తూ ప్రేమతో నిండిన హృదయాలతో జీవిస్తున్నాము ప్రేమంటే కలవరం అనుకున్నా కాని నువ్వొచ్చాక...

Monday, 13 February 2017

కవిత నెం269: నిశీధిలో నేను

కవిత నెం :269 * నిశీధిలో నేను * నిశీధిలో నేను  దిక్కులు  చూస్తున్నాను  ఆరుబయట మంచం మీద  చల్లని గాలి మెల్లగా చేరి  సేద తీరమని  నా  మేను ను తాకగా ఆకాశంలోని చుక్కలు లెక్కెడుతూ ఏదో ఆలోచనలో నా మనసు పాలపుంతలను పరీక్షగా చూస్తూ ఆ చందమామను చూసి పొంగిపోతూ నిలబడిపోయాను నేను ఒక రూపుగా చలనం లేని రాతి స్తంభంలా కొంచెం కొంచెం నా కనురెప్పలు తమ స్పర్శను నా కనుపాపలకందిస్తూ ఏదో మౌనాన్ని నా చెవులను వినమంటూ అప్పుడప్పుడు లాలాజలాన్ని గుటకలుగా వేస్తూ అలసిపోయిన హృదిని ఊరుకొమ్మంటూ ఏదో కాస్తయినా ఊరట కమ్మంటూ ఒకవైపు వెలుతురు...

Sunday, 5 February 2017

కవిత నెం 268:సొంత గూటి బంధాలు

కవిత నెం  : 268 భావగీతి కవన సంకలనం కోసం  కవిత నెం :3 * సొంత గూటి బంధాలు * పొద్దున్నే లేవగానే శుభోదయం , శుభదినం అంటూ అందరినీ పలకరిస్తావు పక్కనున్న పెళ్ళాన్ని మాత్రం నవ్వుతూ ఒక చూపు గౌరవంగా ఒక మాట మౌనమే మీ ఇద్దరి మధ్య గోడ ఎవరో ముక్కూ , మొహం తెలియని వారిని భావ - మామ , అన్నయ్య -వదిన అంటూ సంబోదించి మరీ పిలుస్తాం నీ సొంత చెల్లెలతో , అక్కలతో ఒక్కసారి అయినా పద్దతిగా మాట్లాడావా ? ఇంట్లో బంధాలకు జైలు వాటం ఆన్ లైన్లో స్నేహాలకు ఉండదు మొహమాటం నీకు కష్టమొస్తే ఆర్చేది , తీర్చీది వారేనా సంతోషంలో ఏ సొంత బంధం గుర్తు రాదు భాదలో మాత్రం అందరూ కావాలనిపిస్తుంది నీకన్నా...

Saturday, 4 February 2017

కవిత నెం267:భవిష్యత్తు ప్రణాళికలు

కవిత నెం :267 భావగీతి కవన సంకలనం కోసం  కవిత నెం :2 *భవిష్యత్తు ప్రణాళికలు * నిశ్శబ్దంగా మౌనం  సంకోచంలో మనసు  నన్ను నాలోనే కుదిపేసే ప్రశ్నలు  నీ గమ్యం ఎటువైపు అని ఎదురుచూసే దిక్కులు  మధ్యతరగతి ఈదురు బ్రతుకులు  గాలి వానలో కొట్టుమిట్టాడే కిటికీలు  వర్షం ఆగిపోయాక ఒక చోట నిలిచిపోయే నీరు  ఒక్కసారిగా ప్రశాంతత వైపు చూసే నా చూపు  ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగటం  తోచిందల్లా చేసుకుని పోతుంటాం  కాసేపు కుందేలు పరుగులు  పున : పరిశీలనతో తాబేలు నడకలు  మన ఎదురుగా అల్లుకుపోయి అగ్గిపెట్టె మేడలు  ఫోజులు...

కవిత నెం266:అది చాలు

కవిత నెం :266 *అది చాలు* కన్నులతో పలకరిస్తే పులకరించిపోతావు   కలలోన కిన్నెరవై వీక్షించిపోతావు నా మాటల మృదులతకు మురిసిపోతుంటావు నా సాంగత్యం కొరకు తపించి తపించిపోతావు నిన్నెలా వదులుకోను నా ముద్ద మందారం నీవిలా ప్రేమిస్తుంటే అది చాలులే బంగారం - గరిమెళ్ళ గమనాలు           ...

Friday, 3 February 2017

కవిత నెం265 :* భార్య బాదితులం *

కవిత నెం  : 265 భావగీతి కవన సంకలనం కోసం  కవిత నెం :1 * భార్య బాదితులం * (హాస్య కవిత - సరదాకు మాత్రమే) భార్య బాదితులం మేం భార్య బాదితులం పెళ్ళితోనే మొదలవుతుంది మాకు బెండ్ అవ్వమని మా బెండ్ తీస్తారు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మనం సుకుమారంగా వారి తలపై చెయ్యి పెడితే మనల్ని అణగదొక్కేట్టు గట్టిగా ఒత్తుతారు పెళ్ళిలో దండలు మార్చుకునేటప్పుడు మనం వారికన్నా ఎత్తుగా ఉంటే ఎగిరెగిరి మరీ సాధించుకుంటారు అరుంధతీ నక్షత్రం చూపించబోతే మనకు చుక్కలు ఎలా చూపిద్దాం అని అక్కడే ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటారు ఏవండీ అని పిలవటానికి వారికి ఇబ్బంది అండి అందుకే...