Sunday, 28 January 2024

కవిత(360)

కవిత ఓ కవితఅందమైన వనితనీ పేరులో ఉంటుంది బావాత్మకతనిన్ను చూడగా ఎదలో ఏదో కలవరింతనీ స్నేహంతో మొదలైంది నాలో పులకరింతఆగదేమో ఇప్పట్లో ఈ కేరింతఅలజడిలా అనిపిస్తుంది తనువంతానా మనసు కోరుకుంటుంది నీ జతకవిత ఓ కవిత ఒక కావ్యరూపానివి న...

Saturday, 27 January 2024

ప్రేమ సిద్దాంతం (359)

ప్రేమ సిద్దాంతం ప్రేమించేటప్పుడు నువ్వే నా ప్రాణమనిపిస్తుందిప్రేమలో ఉన్నప్పుడు నువ్వే నా సర్వమనిపిస్తుందిప్రేమలో గెలిస్తే ,కల నిజమైంది అనిపిస్తుందిప్రేమలో విఫలమయితే ,కల కలలానే ఉండిపోతుందిప్రేమ విఫలమయ్యి ,దూరం పెరిగితేమనసులోని బాధ వ్యాదిలా మారిపోతుందిప్రేమంటే సత్యమైన ఆరాధన నీకుంటేఎంతటి భారమైనా బంధంలా అనిపిస్తుందిప్రేమలో ప్రేమించినవారిని వదులుకున్నాకఅర్ధం చేసుకుంటే వారి ఆంతర్యం తెలుస్తుందిఅపార్ధం చేసుకుంటే వ్యర్ధం అనిపిస్తుందిఒక్కసారి ఒంటరైతే తెలుస్తుందిప్రేమంటే ఏమిటో ప్రేమించిన వారి మనసు ఏమిటోఅనుకోని ప్రేమ నీకోసం తిరిగి మళ్లీ వస్తేఅంతకుమించి...

Monday, 22 January 2024

358 (వలపుతెర)

 నా మనసు నీ సాంగత్యం కోసం ఎదురుచూస్తుంటేనువ్వేమో నా మనసుని ఎప్పుడు గెలుద్దామా అని చూస్తున్నావ్నువ్వు నాతో ఉన్నావని తెలుసుగా నీ జతలేని నేను ఒంటరి నే కదామరి తుంటరిగా ఎందుకు తూట్లు పొడుస్తున్నావ్గాయమైనా భరించగలనేమో కానినువ్వు పెట్టే ఈ పరీక్షను లిఖించల...

Thursday, 18 January 2024

నేనేప్రేమా(357)

 నాకు లేడీస్ తో మాట్లాడటం రాదునా మాట కరుకునాకు ఉండదు బెరుకుఅందుకే నేనంటే అందరికీ చిరాకునువ్వు దూరంగా ఉండాలనిఅనుకోవటంలో తప్పు లేదుఆడపిల్లలతో కేరింగా ఉండటంనాకు చేత కాదుఅందుకే నాకు అమ్మాయిలతోకాంటాక్ట్స్ తక్కువచాలా రోజుల తర్వాతనాతో మాట్లాడుతున్నావ్నీకు అర్ధం కావలంటే చాలా టైం పడుతుందిఅస్సలు అర్ధమే కాకపోవచ్చునువ్వు ఎంతో సుకుమారం గా పెరిగి ఉండవచ్చుఅందరూ నిన్ను గారాభంగా చూసుకుంటూ ఉండొచ్చునాకు అంత ఔధార్యం లేదునేను ఊరికే అలుగుతానునాకు త్వర్గా కోపం వస్తూ ఉంటుందినా మనసు మంచిది కాదుఅస్సలు నేను అనేవాడినే మంచోడిని కాదుపిచ్చోడిని అంటారేమో నాకు తెలియదునాతో...

Sunday, 14 January 2024

కవిత నెం27

కవిత నెం :27 మనసును చదవగలరా ఎవరైనా ఆత్మను అవగాహన చేసుకోగలరా ఎవరైనా అర్ధం పర్ధం లేని జీవితంలో 'అపార్ధాల' పంటలు పండిస్తున్నారు  మమకారం చూపించే మనసును 'మనోవేదనకు' గురిచేస్తున్నారు  అందరిలాగే మనము ఆలోచిస్తాము  అందరిలాగే మనము కూడా చేస్తాము  తప్పు ,ఒప్పులను నిర్దేశిస్తాం  మనము మాత్రం ఒక్క మాట కూడా పడలేము  ప్రేమ అనేది నీకు ఉంటది ,జంతువుకీ ఉంటదీ  బ్రతికినంతకాలం అందరిలోనూ బ్రతకాలి  నీవు చూపించే ఆధరణ ,ప్రేమ నీకు నచ్చిన వాళ్ళ పైన మాత్రమే కాదు  నీవంటే అభిమానించే వాళ్ళ పైన కూడా ఆ ప్రేమ జల్లులను కురిపించు  చీమకైనా...

కవిత నెం 26:అర్ధనారీశ్వర తత్వం ...

కవిత నెం :26 అర్ధనారీశ్వర తత్వం ...  అవనిలో కొలువై యున్న దైవ సమానత్వం  విధి రాసిన వింత ఫలితం  అనాధలు కాదు , మన తోటి సమానులు  శుభ కార్యాలకు కావలి వీరి దీవెన  అసంకల్పితంగా కనిపిస్తే చూపలేరు  ఆదరన  ఆక్రోశించే గుండెలు వారు చేయకండి అవహేళన  గౌరవించి ,మీ హ్రుదయాన్నందించండి అదే వారికి ప్రేరణ  ఆ బ్రతుకుని దూరం చేసేలా చెయ్యకండి దూషణ  మన లాగా బ్రతికే అవకాశం వారికి ఇవ్వండి  మనసున్న వారే వారు ... క్రూరులు...

కవిత నెం 25(అంతా ఒక్కటే)

కవిత నెం : 25 కాలానికి లేదు సమాంతరం  ధనిక ,బీద గొప్పల తారతమ్యం  మానవ జన్మ అంటే ఇంతేరా  మంచి చెడు ,కష్ట సుఖాల బ్రతుకేరా  దనముకు ఖర్చు చెయ్యటం తెలియదు  పేదరికానికి అలుపంటూ ఎరుగదు  రెండూ పుట్టిన నేలఒక్కటే  ఇద్దరు తినే తిండి ఒక్కటే మానవత్వమనేది మనకున్నదొక్కటే  మన ఉనికిని మరువక ,జీవించినంతకాలం  సంతోషంగా బ్రతికే ఈ బ్రతుకూ ఒక్కటే ...

కవిత నెం24:పట్న వాసం

కవిత నెం :24 *పట్న వాసం *  పల్లెలన్నీమాయమై - పట్నాలవుతుండే  పెరుగుతున్న పట్నాలలో - ఇరుకుటిల్లు పెరిగెనే  ఎదుగుతున్న సమాజం -స్వార్ద రహితమై  మనసు ఉన్న మనుషులేమో - మజ్జిగ నీరై  విలాసవంత జీవితాలకు -విలువలు పెరిగే  పేదవారు కనిపించని -ధనప్రభంజనమయ్యే భూ మాత  బిక్కు బిక్కున నలుగుతూ ఉండే  భవనములు ఆకాశానికి ప్రాకుతూఉండే  సహజ వనరుల ఆనవాలు కరుగుతూ ఉండే  మనిషి పెట్టుకున్న విధానాలే ఈ సమస్యలు  మంచి అన్న పదానికేమో పుట్టే కష్టాలు  మారని మనుషులలో ఇరుకు బంధాలు&nbs...

కవిత నెం : 23 //మామిడి //

కవిత నెం : 23//మామిడి // ఫల జాతుల్లో రారాజు పసందైన ఫలరాజు మధురమైన తియ్యదనం మధురంగా అందించేను  అందరికీ ఇష్టమైన ఫలం -అన్ని కాలాలకు ఉంది దీని అవసరం  ఆయురారోగ్య సుగుణములున్న ''అమృతఫలం '' వేసవికాలంలో దాహాన్ని తీర్చే ''అక్షయఫలం ''   రుచిలో దీనికిదే సాటి - దీనిని మరువగలగటం ఎవ్వరి పాటి  పండుగ దినములలో ''మామిడి తోరణం '' స్వాగతానికి చిహ్నం  వంటలలో ''మామిడి పప్పు ''ఆస్వాదించగల వంటకం  తెలుగు సంవత్సరారంబానికి ''ఉగాది పచ్చడి...

కవిత నెం : 22 //కర్ణుడు //

కవిత నెం : 22 //కర్ణుడు // భాస్కరుని తేజంతో జన్మించిన కుంతీ వరపుత్రుడు పుట్టుకతోనే సహజ కవచకుండలములు దరియించినవాడు అర్జునుడితో సమానంగా సకలవిద్యల యందు ప్రావీణ్యుడు దానము చేయుటలో ''దాన గుణ శీలి '' అని పేరుగాంచిన వాడు కుచితబుద్ది గల దుర్యోదనుడితో స్నేహమోసగినవాడు కర్ణుడు లేనిదే 'భారతం ' లేదు అన్పించుకున్న యోధుడు విది విదానాలయందు విశ్వాసపాత్రుడు అహంకారమున్నా ధర్మము తప్పని ధీరుడు రణరంగములో శాపగ్రస్తముచే విస్మరింపబడి ప్రాణము కోల్పోయి ఈ దరణి ఒడిలో అమరుడై అజరామరంగా నిలచినవాడు ''కర్ణుడు'...

మల్లె పువ్వు (21)

కవిత నెం :20 ***** మల్లె పువ్వు ***** ఇది మనసును దోచే పువ్వు  ఇది మనసుకు హత్తుకునే పువ్వు  ఇది మన ఊసుల్ని కదిలించే పువ్వు  ఇది హృదయమున్న అందమైన పువ్వు  స్వచ్చతకు మారుపేరై పరిమళించే పువ్వు  పూదోట విరిరాణిగా ప్రకాశించే పువ్వు  వెన్నెల రాత్రులకు విందునిచ్చే పువ్వు విరికాంతులను కురిపించేది పువ్వు  మగువలకు ఇష్టసఖి గా పిలువబడే పువ్వు  మధుమాస మధురాలకు మేలి సోయగం ఈ పువ్వు  సహజాకృతి వన్నెల కిన్నెరసాని ఈ మల్లె పువ్వు  కుసుమాల కమలాంకిత కన్నె పువ్వు ఈ మల్లె పువ్వు  ...

తొలకరి జల్లు(20)

కవిత నెం :20 *తొలకరి జల్లు * ఆకాశం ఆనందించి నాపై కురిపించెనే మంచు ముత్యాలువాన నా మనసు పరవశించి ఆ చిరుజల్లుల పుప్పొడులను నాలో దాచుకోనా నింగిసైతం నా చెంత కొచ్చి హరివిల్లు వెలుగులతో నాతో కలిసి నాట్యమాడా నా తనువు  పులకరించి ఈ ప్రకృతి మెరుపుల సోయగంలో నే నడచిపోనా    ...

ఓ మధూ (6)

ఓ మధూ (6) ఓ మధూ నా మధూ 'మధు' ర మైన నీ నవ్వు  అదే నాకు 'మధు' రామృతము  'మధు'వులను కురిపించే నీ కనులు  నా రూపమును చూపించే దృశ్య బింబములు  నువ్వంటేనే నాకు 'మధు' మాసం  నీ తలపే నాకు 'మధు' ర భావం  నీవు నాతోటి ఉన్న క్షణములే  నాకు 'మధు' ర క్షణములు  ఎంత తెలిపినా చాలదు  నాలోని నీపై 'మధు' ర ప్రేమను  నిన్ను అర్దాంగిగా చేసిన  నా ఆ 'మధు' ర స్వప్నము  నిజమై ,నిత్య సంతోషమై  సాగిపోతున్న మన ఈ 'మధు' ర బంధము  'మధు' ర వసంతాలను అందుకోవాలని  'మధు' ర జ్ఞాపకాలను దాచుకోవాలని  'మధు'...

manogna(4)

కవిత నెం : 4 ...

మానవ శిధిలాలు(9)

కవిత నెం : 9 *మానవ శిధిలాలు * మానవుడు చేస్తున్న అమానుష చర్యలకు మనిషి తనలో తానూ నలిగిపోతున్న వైనం తనను తానూ ఆత్మ వంచన చేసుకున్నప్పుడు చేసిన పాపములకు శిక్షను ఊహించుకుంటూ శిధిలమై పోతున్నట్టు అగుపించే దృశ్యం నీవు చేసిన క్రియలే నిన్ను వెంటాడుతుంటాయి నీవు జీవించి ఉన్నంతకాలం ............ మట్టిలోనుంచి పుట్టిన మనం మట్టిలోన కలిసిపోక తప్పదు కాబట్టి ఎక్కువగా ఏదీ చెడుగా ఆశించవద్దు శ్రమపడి చెడుకొరకు జీవించవద్దు ...

నీవేమి -నేనేమి (8)

// నీవేమి -నేనేమి // నిన్ను చూడక నా మది గది తలుపును తెరువకున్నదే నీవు నాతోన లేని ఈ క్షణమున నా నయనం ఏ దృశ్యమును చూడలేకున్నదే ఎందుకు ఎందుకు ఎందులకు ? నీవంటే అంట ఇష్టం ఎందులకు ? నీవుంటే ఆ ఉత్సాహం నా మనసుకు ఎందులకు ? నీతోటి ఉండినచో నా పలుకు అధికమగును నా స్వరము సుకుమారమగును నా గాత్రం ఏదో ఆలాపన చేయును ఎందుకు ఎందుకు ఎందులకు ? అదే నీవు ,లేదా నీ ఉనికి కాసేపు మాయమైనచో నా మనసు స్ధితి గతి తప్పును నా చేష్టలు ,నా కతీతంగా ప్రవర్తించును ఎందుకు ఎందుకు ఎందులకు ? నీ స్పర్శ చాలునే కదా నాలో జీవమును బ్రతికుంచుటకు నిన్ను తాకిన పావనము చాలును కదా నా శ్వాషకు ఊపిరినిచ్చుటకు ఎంత...

ఓ ఓటరు మహాశయా! (350)

కవితా శీర్షిక : ఓ ఓటరు మహాశయా!మన పోరాటం వ్యవస్థ కోసం కాని ఒక వ్యక్తి కోసం కాకూడదు.మన ఆరాటం చెడుని జయించటం కోసంకాని మంచిని ముంచటం కోసం కాకూడదు.మన లక్ష్యం అభివృద్ది వైపు కోసంకాని అధికార పరపతులకోసం కాకూడదుమనం చేసే యుద్దం ప్రజాహితం కోసం కాని మన స్వార్ధ ప్రయోజనాల కోసం కాకూడదు.మార్పు అనేది మొదలవ్వాలంటేముందుగా మనం మారటానికి సిద్దపడాలిరాజ్యాంగం ఇచ్చిన మన నైతిక హక్కునినిజాయితీగా ,నిర్భయంగా నీ ''ఓటు '' అనే అయుధంతో కొట్టి చూడువాడెవడో ,వీడెవడో అని కాదుమరో వాడు రావాలన్నా ''ఓటు '' కి తల దించాల్సిందేతప్పు చేయరాదని భయపడాల్సిందేప్రజాస్వామ్య పరిరక్షణ...

నిన్ను నిన్నుగానే ప్రేమించా(11)

''నిన్ను నిన్నుగానే ప్రేమించా'' నిన్ను నిన్నుగానే ప్రేమించా నీకోసం నిరీక్షించా ,పరితపించా నా జీవితంలో ఇక నీవే నా పట్టపురాణివి నీ  పలుకుల   సుగంధాలను ఆస్వాదిస్తున్నా నీ ప్రేమ పరువాలలో పయణిస్తున్నా నీవు  రాకముందు నేను ఒంటరి నీవు వచ్చినాక ఆ బాధ లేదు మరి  నువ్వంటే నాకు ఇష్టం ,గౌరవం ,ప్రేమ మాటలకేం ఏమైనా చెప్పొచ్చులేమ్మా అని అనుకుంటావా ఏమోనమ్మా మనిద్దరి తనువులు వేరేమో నీ మనసునెరిగి నే ఒకటిగా ఉంటున్నాగా ! నీకన్నా నాకు వేరే ఎందుకమ్మా ? నీకన్నా నాకు ఎక్కువ ఏమీ లేదు చిలకమ్మా నను నమ్మి అడుగు వేసినావు కాదు కాదు నా అడుగులో నీ అడుగు...

ఐ లవ్ యు ప్రియా (7)

కవిత నెం : 7ఈ సముద్రం సాక్షిగా నింగి సాక్షిగా ,నీరు సాక్షిగా  నేను నిన్ను ప్రేమిస్తున్నా ప్రియా  సముద్రం ఎన్నో జీవరాసులను  తనలో దాచుకుంటూ కాపాడుతుందో  నేను నీ ప్రేమను  నా హృదయంలో  నింపుకున్నా మన  ప్రేమ తోడుగా  ఎగసే అలలు కూడా నా ప్రేమకు  మద్దతుగా నీ పాదాలను తాకి  నా ప్రేమను తెలుసుకోమంటున్నాయి  ఇసుక తుంపరులు సైతము  ప్రేమ అనే సింబల్ ని ఇచ్చి  మన ప్రేమకు దీవెన ఇచ్చుచున్నది   ఐ లవ్ యు ప్రియా  మేరా దిల్ నీదే ప్రియా  ...

మాయ మనిషి(356)

శీర్షిక :మాయ మనిషినిజంగా మేడిపండు ఫలమే కాదుమన జీవితానికి ఉదాహరణగా నిలచే రాశిఫలంఎందుకో ఎత్త ఎత్తుకి ఎదుగుతున్న మనిషితన బుద్ధిలో మాత్రం మందగిస్తూనే ఉంటాడుపైకి మాత్రం మేడిపండులా కనపడుతున్నాతన లోపల మాత్రం కుళ్లుని పెట్టుకుని కంపుకొడతాడుతన విజయంలో ఆనందాన్ని ఆస్వాదించలేడుపక్కవాడి ఓటమిలో కళ్లలో విషపు కాంతిని నింపుకుంటాడుతన ఏడుపుని సైతం దిగమింగుకుని పక్కవాడి బాధలో పైశాసికత్వానికి పురుడుపోస్తాడుఒకడి మాటల్లో మంచి వినటానికి ఇష్టపడని ఈ మనిషిజీవిత సలహాలు ఇవ్వటానికి మాత్రం ముందుంటాడుపైకి మాత్రం పెద్ద మనిషి తరహాగా వ్యవహరిస్తూతన స్వభావాన్ని సమయం వచ్చినప్పుడు రాక్షస...

భోగి పండుగ(355)

పచ్చ తోరణాలుపాడి పంటలుముంగిట ముగ్గుళ్లుసంక్రాంతి గొబ్బిమ్మలుభోగి పండుగ సందళ్లుఈ పండగ అప్పుడూ ఇప్పుడూ ఆ ఆహ్లాదమే వేరుచిన్నా పెద్దా అంతా వారి వారి ఊళ్లకు చేరిమూడు రోజులకి సరిపడా కొత్తబట్టలుపండించిన పంట ఇంటికొచ్చే తరుణంప్రొద్దున్నే పొగమంచులోనేపాత చెక్క సామాన్లు, కట్టెలతో భోగి మంటలుకష్టాలు -బాధలు అన్నీ ఈ మంటల్లో పోవాలనికొత్త ఆనందాలు సంతోషాలు వెల్లివిరియాలనిఆ మంటలవేడి మధ్య నీళ్లు కాచుకునివాటితోనే స్నానమాచరించిచేసిన పిండివంటలతో పూజలు చేసిఅందరూ కలిసి విందు ఆరగించిసాయంత్రం పసి పిల్లలకు భోగి పళ్లు పోసిభోగ భాగ్యాలతో ,సిరిసంపదలతోతులతూగాలని దీవించగాముగుస్తుంది...

Thursday, 11 January 2024

హితమే సన్నిహితం (354)

హితమే సన్నిహితం అంతా అంధకారమే కనిపిస్తుందిఅహం నీకు ఆవహిస్తేప్రశాంతంగా నీ ఆలోచనలు ఉంటేసంతోషం సగం బలమై తోడుంటుందిఎత్తు పల్లాలు ,ఎండ మావులు వస్తుంటాయి ,పోతుంటాయిదూరంగా భారాన్ని చూసి భయపడితే ఎలాఅసాధ్యమంటూ ఏదీ లేదూనీ అంతరాత్మలోకి తొంగిచూసుకుంటూ ఉండుసమాజం నిన్ను ప్రశ్నిస్తుంది అంటేఎక్కడో నీ గురించే ప్రస్తావన వస్తుంది అంటేఅక్కడే నీ శక్తి ఏమిటో ,యుక్తి ఏమిటో తెలుస్తుందివిజయం నీ వైపే వేచియుంది.పిడుగువచ్చినా ,సునామీ వచ్చినాభయపడని మనిషిసాటి మనిషితో మాట అనిపించుకోవాలంటే భయపడ్తాడుకారణం తన ఆత్మ గౌరవం సగర్వంగా బ్రతకమని సూచిస్తుందినిలదొక్కుకుని...

కవిత నెం 353 నా గుండె వెనుక ఇంకొక చప్పుడు నా మాటల్లో మరొక శృతి ఇప్పుడు చుట్టూరా జనంతో కూడిన వాతావరణం నా కళ్లలోకి ప్రవహించెను ఏదో మెరుపు వేగం నా అడుగులు వాటి కదలికల్ని మరిచాయి నా శరీరంలో కదలికలకు లేదు చలనం కాలమంతా ఒకేసారి తిరిగినట్టు ఉన్నది గడియారం కాసేపు స్తంభించి యున్నది నన్ను వీడిన నీడ నా ప్రక్కకు వచ్చినట్టు నేను వదిలిన జ్ఞాపకం నా బుర్రకు తట్టినట్టు నీ కనుసైగలను చూస్తూ ఉండిపోయా నా చెలినేనా అని అయోమయంలో పడిపోయా అమాంతం బిగిసిన పెదవులు మౌనంలోనే కుశల ప్రశ్నలు వేసుకుంటున్నాయి నలుగుతున్న నిశ్శబ్దంలో మౌనం మాటల్ని వెతుక్కోవటం మొదలెట్టింది బాగున్నావా అని అడగాలా? ఏమటిపోయావు అని అడగాలా? కొన్ని సంవత్సరాల తర్వాత నీ రూపాన్ని చూస్తూ పసివాడినయ్యిపోయాను తడిచిన కనులతో స్వాగతం చెప్తున్నాను తనివితీరా పలకరించలేక బరువెక్కిన గుండెతో విలపిస్తున్నాను నీ ప్రశ్నలు కావాలి, నీతో ముచ్చటించాలి ఆ పాత హృదయం పలకాలి నీ స్పర్శ నాకుకావాలి నువ్వేనా నా చెలీ అనీ తెలియాలి

హ...