కవిత నెం :186
వినాయకుడు - గణ నాయకుడు
సమస్త పూజలను ముందు అందుకునేవాడుసప్త సముద్రాలు దాటి వస్తున్నాడుదేవుళ్ళందరిలో ప్రధమ ఆరాధ్యడు ముల్లోకాలను చుట్టుకుంటూ వస్తున్నాడునాయకుడు అధినాయకుడు వినాయకుడుదండాలు పెట్టించుకుంటూజై జై లు కొట్టించుకుంటూమూషికవాహనం పై వేగంగా వస్తున్నాడుప్రతి చవితి నాడు పలకరిస్తుంతాడుసంవత్సరానికి ఒక్కసారి వస్తుంటాడుసకల ఐశ్వర్యాలాను వెంటతీసుకుని వస్తాడుకుడుములు ,వడపప్పు ,కర్జూర ,పాయసం ,పాలతాలికలుఎన్నోన్నో పూలతో ,ఎన్నోన్నో పత్రిలతో అలంకరణప్రియుడుచల్లంగా చూసేడు ఈ బొజ్జ గణపయ్యప్రతి వారింట కొలువు తీరేనయ్యానీ నామస్మరణం - పాప నివారణంనీ...
Wednesday, 16 September 2015
Monday, 7 September 2015
కవిత నెం185:చెలియా నీవే
కవిత నెం :185
చెలియా నీవే
న కన్నుల్లో నీవే
న గుండెల్లో నీవే
నాతో వచ్చే నీడలో కూడా నేవే
ఎటు చూసిన నీవే
ఎవ్వరిలో వున్నా ఎదురుగ వచ్చేది నీవే
నా ప్రతి మాటలో నీవే
నిద్రపోతున్న ఆ నిదురలో నీవే
నిదూరలోనుంచి పుట్టే ఆలోచన నీవే
కనుపాపల్లో నీవే
కంటిలో తిరిగే నీళ్ళల్లో నీవే
నే చేసే పనిలో నీవే
నా ప్రతి ఆలోచన నీవే
నా మనసులోని సంబాషణ నీవే
ఎ జంటను చుసిన గుర్తుకువచ్చేది నీవే
నా గుండెల్లో ఆనందం నీవే ,విషాదం నేవే
నన్ను నేనుగా చూసుకుంటున్న కనిపించేది నీవే
తింటున్న తాగుతున్న ఆ తలంపులో నేవే
ఆకలి ,దాహం లేకున్నా నన్ను జాగ్రత్తగా చూసుకునే తోడూ...
కవిత నెం 184:నువ్వంటే ఇష్టం
కవిత నెం :184
*నువ్వంటే ఇష్టం *
స్వచ్చమైన నీ చిరునవ్వంటే నా కిష్టం
వెన్నెలమ్మ హాయిని చూపే నీ చూపంటే నా కిష్టం
లోకం మరచి,నీతో ఉండి ,మాట్లాడటమంటే నా కిష్టం
నీ వైపు చూస్తూ , వినాలన్పించే - నీ పలుకులు అంటే నా కిష్టం
నిన్నే తాకి, నన్నే సోకిన చిరుగాలి అంటే నా కిష్టం
నీ రూపం చూపుతూ ,వచ్చే ప్రతి కల అంటే నా కిష్టం.
నీ వాలుజడలో కొప్పున వుండే సంపెంగ అంటే నా కిష్టం.
నీ కాలికింద మువ్వలు చేసే ,సవ్వడులు అంటే నా కిష్టం.
నీకై వేచి నిరీక్షించిన ,సమయమంటే నా కిష్టం.
నీకోసం నే తలచే ,ఆ తలంపులు అంటే నా కిష్టం.
నన్నే తిడుతూ కదిపే...
కవిత నెం 183:ఆశ
కవిత నెం :183
నీతో నడవాలనే ఆశ
నీతోపాటు ఉండిపోవాలనే ఆశ
నీ నవ్వు చూడాలనే ఆశ
నిన్ను నవ్వించాలనే ఆశ
నీతో ఎకాంతంగా గడపాలనే ఆశ
నీ చెంతనే ఉండి సేద తీరాలనే ఆశ
నీ కోసం నేను మారాలనే ఆశ
నా కోసం నీవు మారాలనే ఆశ
నీ కళ్ళల్లో చూస్తూ నిల్చిపోవాలనే ఆశ
నీ ఒడిలో ఒదిగి ఉండాలనే ఆశ
నువ్వెప్పుడూ నన్నే తలవాలనే ఆశ
నీ పెదవులపై నా పేరు ఉండాలనే ఆశ
నీ కోసం వేదన చెందాలనే ఆశ
ఆ వేదన నే కౌగిలితో మాయమవ్వాలనే ఆశ
నీతో నిరంతరం మాట్లాడుతూ ఉండాలనే ఆశ
నీ ద్యాసలో నన్ను నేను మర్చిపోవాలనే ఆశ
నా కలవరం - నీవే అవ్వాలనే ఆశ
నీ ఊహల్లో - నా ఉనికే కదలాలనే ఆశ
నా...
కవిత నెం182:ఓ ప్రియతమా !
కవిత నెం :182
ఓ ప్రియతమా !
కలలో చూసిన సౌందర్యరూపం
అది నే మేను యొక్క అందం.
చంద్రబింబం లాంటి నీ సోయగం
నా మదిలో రేపెను కలవరం
ప్రియా ! నీ పరిచయం ఒక వరం
అది ఈ జన్మకు మరువలేని తీయని జ్ఞాపకం.
ప్రియా కనులు మూసినా నీవాయే
కనులు తెరిచినా నీవాయే
ప్రియతమా తొలిసారి నిన్ను చూడగానే నా మనస్సు
నాకు తెలియకుండా నీకు చేరువ అయ్యింది అది నీకు తెలుసు.
మందు వేసవిలో ఆ చంద్రుని చల్లదనం పువ్వులకోసం
నీ కంటి చూపు చల్లదనం నా కోసం, నా ప్రేమ కోసం
ప్రియా నీవు లేని జీవితం వ్యర్ధం
ప్రియా నీ ప్రేమే నా జేవితనికి ఒక అర్ధం , అదే నాకు పరమార్ధం
చెరుగని...
కవిత నెం 181:ఒంటరితనం
కవిత నెం :181
ఒంటరితనం మన ఊసుల్ని గుర్తుచేస్తుంది
ఒంటరితనం మన మనసు బాసల్ని గుర్తుచేస్తుంది
ఒంటరితనం నీతో ఉన్న మదుర క్షణాలని గుర్తుచేస్తుంది
ఒంటరితనం నీతో ఉన్న ఏకాంత సమయం విలువని గుర్తుచేస్తుంది
ఒంటరితనం నీ మాటలని గుర్తుచేస్తుంది
ఒంటరితనం మన గుసగుసల్ని గుర్తుచేస్తుంది
ఒంటరితనం మన గిల్లికజ్జాలని గుర్తుచేస్తుంది
ఒంటరితనం మన సరదాలని గుర్తుచేస్తుంది
ఒంటరితనం మన తీయటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది
ఒంటరితనం మన మదుర బావాలను గుర్తుచేస్తుంది
ఒంటరితనం మన ఎడబాటుని గుర్తుచేస్తుంది
ఒంటరితనం నీకై ఆలోచింపచేస్తుంది
ఒంటరితనం నీ గురించే కలవరింప...
కవిత నెం180:నీవే కదా
కవిత నెం :180
నా చుట్టూ ఉన్నది నీవే కదా
నా మనసులో ఉన్నది నీవే కదా
నా రూపం నీవే కదా
ప్రతి రూపం నీవే కదా
నా శ్వాశలో ఊపిరి నీవే కదా
నా నీడలో నిజమూ నీవే కదా
నాకు సాక్ష్యం నీవే కదా
ప్రతి పక్షం నీవే కదా
కథలాంటి కధ కాదు
కన్నీళ్లకి అది చేదు
మిగిలున్నా నీ తోడు
ఓ మరుమల్లె ఇటు చూడు
నిలువని నిముషంలో ,సగమై నిలిచున్నా
కదిలే కాలంలో, కలమై సాగుతున్నా
మేఘాలలో మాయవు నీవా?
మెరిసే ముత్యపు పువ్వా
జాజికళ్ల జామురాతిరి
జగడమాడే నిన్ను చూడనీ
గాలికి చిక్కని గంధమా
పరిమళాలకు బంధమా
!!!!!!!
గరిమెళ్ళ రాజా
...
కవిత నెం179:నీ జ్ఞాపకాలే
కవిత నెం :179
నీ జ్ఞాపకాలే నన్నిలా
దాచాయిలే గుట్టుగా
నమ్మానులే మత్తుగా
విరజాజి పువ్వువు నువ్వా?
వికసించే కుసుమం నువ్వా?
నా చక్కిలి గింతవు నువ్వా ఓ వెన్నెలా?
నీవే నా తరగని కల
నిదురించే నేనీ వేళ
నీ చంటి పాపాయిలా
లాలించాలి నన్నిలా ఓ వెన్నెలా !
దివికి దిగి వచ్చిన తారవు నీవా?
నీలగిరి సొగసువు నీవా?
హిమాచల బిందువు నీవా?
నీవున్న ప్రతి ఇల
అవుతుంది ఒక కోవెల
కిలకిల రాగాల కోకిల
పిలుస్తోంది నిన్నీ వేళ
సముద్రంలోని అల
నీకై పరుగులు ఏల?
ఒక్కసారి అందరాదా ఓ వెన్నెలా ?
నా నిరీక్షణ ఫలించాల
నిన్ను చూసిన ఈ క్షణాన
ఓదార్పుగా నీ...
కవిత నెం178:హాయ్ - హలో
కవిత నెం :178
హాయ్ ; హలో
సముద్రమంతా ఎంత సరదాగా విహరిస్తుందో
ఆకాశమంతా ఎంత నిర్మలంగా వికసిస్తుందో
అలాగే నా మనసు నీతో సరదాగా తిరగాలని
మాట్లాడాలని సరదాపడుతుంది సముద్రం లాగా
నీ ఒడిలో నా తలపెట్టి నిద్రిస్తుంటే
నీ నిర్మలమైన హృదయంలో అన్ని బాధలు మర్చిపోయి
నీ ఒడిలో ఒదిగిపోవాలని వుంది - మేఘాలలోని చంద్రుడిలా
కానీ నీవేమో వాగులాగా కొండలోతుల్లోనుంచి
కొండల మీద నుంచి జారిపోతున్నావు.
నీవేమో చేపవి కాదు - జాలరిలాగా వలవేయటానికి
నీవు ఒక పక్షివి కాదు - పంజరంలో బంధించటానికి
పట్టుకుంటే పాములాగా...
కవిత నెం177:శశి కళ
కవిత నెం :177
నిద్రపోదామన్నా నీ నీడ నన్నే వెంటాడుతుంది.
నిదురిస్తే నీ రూపం తట్టి లేపుతుంది.
మేల్కొని వుంటే నీ తలంపు మైమరపిస్తుంది.
మైకంలో వున్నా మనిషి ఎలా ఉంటాడో
అల నీ మైకంలో పది మత్తులో మునిగి తేలుతున్నా
మొహమాటంతో ఈ మాట నీతో చెప్పలేకున్నా చెలీ !
నే పడుకుంటే పక్కమీద - పరుపు లాంటి పాన్పు నీవే
నా తలకింద దున్డులాంటి - వెచ్చని ఒడి నీదే
నీ కప్పుకునే దుప్పటి లాంటి - పరువం నీదే
పగలూ - రేయీ తేడా లేదు
కలలు అలలై సముద్రాన్ని దాటివేస్తున్నాయి.
నీ సోయగాలు అనే కిరణాలలో
ఇది కల - లేక జాలరి పన్నిన వలా?
విలవిలా చిక్కాను చేపలాగ
నీ...
కవిత నెం 176:నీ కోసం
కవిత నెం :176
నీకోసమే ఉన్నా
నీకోసమీ జన్మా
నీ కోసమై అన్వేషణ
నీ కోసమై ఆలోచన
నీ కోసమై నా తపన
నీ కోసమై నిరీక్షణ
నా కన్నుల్లో తడి ఆరదు నీ కోసం
నా గుండెల్లో దడ తగ్గదు నీ కోసం
నా శ్వాసలో ఊపిరి నిలిచే నీ కోసం
నా అడుగుల పయనం సాగెను నీ కోసం
నా మనసులో మౌనం పెరిగెను నీ కోసం
నా గొంతులో రాగం పలికెను నీ కోసం
నా జీవిత గమ్యం నీ కోసం
నా జననం మరణం నీ కోసం
నా క్షణ క్షణ కాలములో అక్షరం నీవు.
నీ నామ జపముతోనే ,నా రాతను రాస్తున్నాను
విది తీరు ఎలాగున్నా , నా వేదన ఆగదు ప్రియా
నీ తోడు కోసం , ఎదురుచూస్తుంటా నా జన్మంతా
గరిమెళ్ళ రాజా
...
కవిత నెం 175:తెలుసా ?
కవిత నెం :175
తెలుసా ?
(27 .07 .11)
మౌనంగా ఎగిరే ఆ పక్షుల బాష తెలుసా !
ఒక దిక్కుకై నిలిచే ఆ పువ్వుల శ్వాస తెలుసా!
నేనంటూ నడిచే - నా పయనం ఎటో తెలుసా !
నువ్వేనంటూ తలిచే - నా ఊపిరి సాగెను తెలుసా !
నువ్వే చెంతన ఉంటె - ఆ పొంతన తెలియదు తెలుసా !
నువ్వే విరహము అయితే - ఆ వేదన బరువు తెలుసా !
నీ కన్నా మించే ఆనందం లేదని తెలుసా!
నీ చిన్న చూపుతో అది పోతుందని తెలుసా!
నీతోటి ఉండగా - నా తుంటరి పనులు తెలుసా!
నీ ద్యాసలో ఉంటూనే - నా ఒంటరి బ్రతుకు తెలుసా!
"నువ్వే నా ప్రాణం" అనే అనుకున్న మాటలు తెలుసా!
నీతో రాలేని ఈ జీవం ఏమవుతుందో తెలుసా!
చేయి...
కవిత నెం174:చెలియా గుర్తోస్తున్నావే
కవిత నెం :174
చెలియా గుర్తోస్తున్నావే
(13 .07 .2011 )
చెలియా గుర్తోస్తున్నావే
చెలియా చంపెస్తున్నావే
చెలియా జ్వాలనే పుట్టిస్తున్నావే
చెలియా కవ్విస్తున్నావే
చెలియా కలవవుతున్నావే
చెలియా ఎదనే నలిపేస్తున్నావే
నీ అందమే ఆనందమే
నువ్వెప్పుడూ నా సొంతమే
అంటూ అనిపిస్తూనే ,నన్ను నమ్మిస్తూనే
ఏదో ఏదో ఏదో ఏదో ఏదేదో చేస్తున్నావే
నీ నవ్వులే చిరుజల్లులై
నీ చూపులే నన్ను తడిపేనులే
ఏ చోటకి నే వెళ్తున్నా - ఆ చోటే నువ్వు ఎదురయ్యేనా
నను నేను అద్దంలో చూస్తున్నా
నాలోనే నువ్వే ఉంటున్నా
ఎంత మత్తుగా ఉంది చెలి ఆ పరిమళం
ఏంటో...
కవిత నెం 173: నీ ప్రేమ కావాలి
కవిత నెం :173
నీ ప్రేమ కావాలి.
(05 .07.11)
ప్రేమ కావాలి - ప్రియా నీ ప్రేమ కావాలి
నన్నే కళ్ళల్లో దాచుకునే - నీ ప్రేమ కావాలి.
నన్నే నీ పెదవులపై నిలిపే - నీ ప్రేమ కావాలి.
నీ గుండెల సవ్వడి చూపే - నీ ప్రేమ కావాలి.
నీ మనసుని హత్తుకునే - నీ ప్రేమ కావాలి.
నీలో నేనే నిలిచే - నీ ప్రేమ కావాలి.
నీలో సగమై నిలిచే - నీ ప్రేమ కావాలి.
స్వచ్చమైన వెన్న లాంటి - నీ ప్రేమ కావాలి.
వెన్నెల లాగా హాయి నిచ్చే - నీ ప్రేమ కావాలి.
వర్షం లాగా బాధను చూపే - నీ ప్రేమ కావాలి.
వేకువలాగా పలకరించే - నీ ప్రేమ కావాలి.
చిరుగాలిలా సృచించే - నీ ప్రేమ...
కవిత నెం172:నా గమ్యం
30.05.2006
కవిత నెం :172
నేస్తమా నీ ఒక నీడ
అది ఒక తెలియని జాడ
స్నేహమగునా ఈ ఎడారి ఓడ .......
రహదారిలో గోదారిలా నా దారిలో చేరావు
నా గుండెకే మార్గం లేక గోడను నిలిపావు.
ఎవ్వరు నువ్వో? ఓ మొగలి పువ్వా
నా ఎద తాకినా తారాజువ్వా
నీ చేలిమన్నది చేరువ లేదు
చెరగని ఏ అక్షరం కాదు.
శిదిలమయ్యేది స్నేహం కాదు
శిల లాగ నను చేసినావు.
మబ్బు ఐనా కరిగి వాననిస్తుంది
మన చెలిమికి నాంది నీ మన్నన ఏమయింది.
ఎవ్వరికి ఉండదా జీవితంలో ఇలాంటి పయనం.
ఎవ్వరిని ఒదలబోదు ''చెలిమి'' అనే ఈ నయనం
నా కేమి బారం ఆగదుగా నా గమ్యం
తెలియనంత మాత్రాన నీ తీరం.
!!!!!!!
గరిమెళ్ళ...
కవిత నెం 171(ప్రేమా ఏదమ్మా నీ చిరునామా)
కవిత నెం :171
ప్రేమా ఏదమ్మా నీ చిరునామా
ప్రేమా ఏదమ్మా నీ చిరునామా
రెండు మనసులు కలుసుకుంటే
వాటి యొక్క కలలు - వెన్నెల కాంతులు
కానీ నీవు మిగిల్చేది - వెన్నెల్లో నీడలు
సముద్రంలోని అలలు ఎగసిపడతాయి
కానీ అవి ఆకాశాన్ని అందుకోలేవు.
ప్రేమికులు గాలిలో మేడలు కడతారు
కాని గాలిలో ఏ మేడైనా నిలువటం అసాద్యం కదా !
అవి సాధ్యమైతే ప్రేమికుల గమ్యానికి గండం ఏముంటుంది.
పగటికలల్లోనే పదహారేళ్ళ జీవితానికి పునాది కట్టిస్తావు
తీరా అది నిజం కాబోతుంటే నిరాశ , నిట్టూర్పు మిగులుస్తావు.
ప్రేమించటానికి మనసు ఉండాలంటారు
కాని ఆ ప్రేమ దక్కకపోతే తట్టుకోవటానికి మనసు...
కవిత నెం170:వెన్నెల
కవిత నెం :168
వెన్నెల వెన్నెల.... విరిసే ఓ వెన్నెల
వెన్నెల వెన్నెల.... విరిసే ఓ వెన్నెల
నీ యొక్క సుమధుర కాంతులతో
నా యదలో వెలుగు బాట పరిచిన వెన్నెల
నీవు,
వెండితెరపై నుంచి బొమ్మలా,
సముద్రంలోనుంచి కెరటంలా
జడివానలో నుంచి చినుకులా,
మేఘాలలో నుంచి మెరుపులా,
నదిలో నుంచి కదిలే అలలా
సూర్యుని నుంచి కిరణంలా,
ఆకాశంలో నుంచి తారలా,
చేరావే నన్నిలా,
మరపించావే నన్నిలా
వెన్నెల వెన్నెల .......ఓ వెన్నెల
నీవై,
నా గొంతులో గానం నీవై,
నా రూపంలో ప్రతిరూపం నీవై,
నా శ్వాసలో ఊపిరి నీవై
నా నడకలో ప్రతి అడుగు నీవై,
నా శరీరంలో ప్రతి...
కవిత నెం 169:మనసు మాయజాలం
కవిత నెం :169
*మనసు మాయజాలం *
నా మనసు మాయజాలలో విహరిస్తుంది
స్వప్నలోకాలలో సంచరిస్తుంది
నిన్ను చూడని ప్రతి నిముషం
నా హృదయంలో మొదలు పరవశం
ఎదలో ఏదో మోహన రాగం
ఆ రాగాల గొంతులో కొత్త అనురాగం
ఏ కారణమో తెలియదు కాని నాకు
నిన్ను వీక్షించ కుండా ఉండలేను , అది సాకు అనుకోకు
ఎలా గడుస్తుందో కాని ఈ కాలం
కన్నె మనసుల ఆంతర్యాలు తెలియని ఈ కలికాలం
మనసు అనేక చోటులకి పరిగెడుతుంది
నిన్ను చూశాక అది స్తిరంగా ఉంది.
నింగి -నేల ఎదురుబొదురుగా ఉండకుండటం
ఎలా అసాద్యమో
నేను నిన్నుచూడకుండా ఉండకుండటం
అంతే అసాద్యం .
!!!!!!!
గరిమెళ్ళ...
కవిత నెం168:ఆమె
కవిత నెం :168
ఆమె
ఆమె పేరంటే ఇష్టం.
ఆమె రూపంటే ఇష్టం
ఆమె కాలికున్న మువ్వలంటే ఇష్టం
ఆమె చెవులకు అమరినదుద్దులంటే ఇష్టం
ఆమె ముక్కుని అంటుకున్న ముక్కెర అంటే నా కిష్టం
ఆమె చేతికున్న గోరింటాకు అంటే నా కిష్టం
ఆమె కలువపూలలాంటి కన్నులు అంటే నా కిష్టం
ఆమె ను తాకి నన్నే తాకే చిరుగాలి అంటే నా కిష్టం
ఆమెలో కలిసే నా ధ్యాస అంటే నా కిష్టం
ఆమె కోసం నాలో ఉరికే అంటే నా కిష్టం
ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోవడమంటే నా కిష్టం
ఆమె పెదవులు పలికే నా పేరంటే నా కిష్టం
ఆమె చిరుదరహాసం అంటే నా కిష్టం
ఆమె కొంటె చూపంటే...
కవిత నెం167:వెంటాడే వలపు
కవిత నెం :167
*వెంటాడే వలపు *
నిద్రపోదామన్నా నీ నీడ నన్నే వెంటాడుతుంది
నిదురిస్తే ,నీ రూపం తట్టి లేపుతుంది
మేల్కొని వుంటే , నీ తలంపు మై మరపిస్తుంది
మైకంలో ఉన్న మనిషి ఎలా ఉంటాడో
అలా నీ మైకంలో పది మత్తులో మునిగి తేలుతున్నా
మొహమాటంతో ఈ మాట నీతో చెప్పలేకునా చెలీ
నే పడుకుంటే పక్కమీద పరుపులాంటి పాన్పు నీవై,
నా తలకింద దుండు లాంటి వెచ్చని ఒడి నీవై,
నే కప్పుకునే దుప్పటిలాంటి పరువం నీవై,
ప్రతి రూపం నీవే , ప్రతి చోటా నీవే
ప్రకృతి జారవిడిచిన పసిడి వెన్నెల లేడివి నీవై
చేరాయి నా ఊహలు నీ సుమధుర కెరటాల లోగిళ్ళలో
!!!!!!!!!!!!
గరిమెళ్ళ...
కవిత నెం166:ప్రేమా నువ్వు
కవిత నెం :164
ప్రేమా నువ్వు
దూరమయ్యావు ప్రేమా నువ్వు -దగ్గరగా ఉంటూ
బారమయ్యావు ప్రేమా నువ్వు - బ్రమ చూపిస్తూ
కలిసియున్నావు ప్రేమా నువ్వు - నాలో నువ్వే ఉంటూ
విడిపోతున్నావు ప్రేమా నువ్వు - నన్నే ఓదారుస్తూ
కలత రేపావు నాలో నువ్వు - నీ కలల నందిస్తూ
బాధ పెంచావు నాలో నువ్వు - నీ చిరునవ్విస్తూ
బండమేశావు నాలో నువ్వు - నన్నే బ్రతిమాలుతూ
ముళ్ళు గుచ్చావు ప్రేమా నువ్వు - నీ మనసు నందిస్తూ
ఆశ రేపావు ప్రేమా నాలో - నీ అడుగునే కదుపుతూ
వదిలివేసావు ప్రేమా నువ్వు - నీ జ్ఞాపకాలనిస్తూ
బ్రతికిస్తున్నావు...
కవిత నెం 165:అంతా ప్రేమమయం
కవిత నెం :163
*అంతా ప్రేమమయం*
ప్రేమలేని ప్రక్రుతి ఉండదు
ప్రేమలేని జీవం ఉండదు
ప్రేమలేని సృష్టి ఉండదు
ప్రేమలేని బంధం ఉండదు
ప్రేమలేని మనస్సు ఉండదు
ప్రేమలేని ఉషస్సు ఉండదు
ప్రేమలేని ప్రణయం ఉండదు
ప్రేమలేని ప్రయాణం ఉండదు
ప్రేమలేని గేయం ఉండదు
ప్రేమలేని కావ్యం ఉండదు
ప్రేమలేని చోటు ఉండదు
ప్రేమలేని బాట ఉండదు
ప్రేమలేని గమ్యం ఉండదు
ప్రేమలేని జననం ఉండదు
ప్రేమలేని మరణం ఉండదు
ప్రేమలేని లోకం ఉండదు
!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా ...