Saturday, 11 April 2015

కవిత నెం 99:హాయైనా జీవితం

కవిత నెం :99

హాయైనా జీవితం
అందరికీ అద్బుతం
జీవించటం అవసరం
జననం మరణం normal 

అందివచ్చే ఆనందం దరిచేరగా
చెంతవుండే కన్నీరు తడి అవునుగా

కష్టాలు తెలిసుంటే అవిరావుగా
సుఖాలు మరుగుతుంటే అవిపోవుగా

అడగకుండా అదృష్టం అడుగిడినా
నిన్నే కోరుకుంటూ దురదృష్టం వెంటాడునుగా

అష్టైశ్వరములు అధికారం ఇచ్చినా
ఆర్దికఇబ్బంది అవకాసం ఇవ్వదుగా

చల్లని నీడ నీకు విశ్రాంతి నిచ్చినా
మండే ఎండ నీమాడు పగలగోట్టునుగా

విద్యలందు నీకు విజ్ఞానం యుండినా
అమాయకమైన లోకజ్ఞానం శూన్యం చేయుగా

నీవు ఆశించినవి నీడగ్గారికి వస్తున్నా
దాన్ని నీడలా తరిమే నిరాశ వచ్చునుగా

చేలిమిచేసే వారు నీకు తోడున్నా
శత్రుత్వం వచ్చునుగా మరో రూపేనా

ఎలా చెప్పుకుంటూ పొతే ఈ భావనలరూపం
అంతిమ తీరం ఉండదు దానికి ప్రతిరూపం
ఎలాగైనా మానవజన్మలో ఇవి సాదారణం
తెలుసుకుంటూ జీవించు ఓ మానవబంధం

!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా

Related Posts:

  • కవిత నెం 220 :హాయ్ చెప్పాలని ఉంది కవిత నెం : 220 హాయ్ చెప్పాలని ఉంది  నన్ను  పిలిచే సూర్యునికే  హాయ్ చెప్పాలని ఉంది  నిద్ర లేపే ''మార్నింగ్ ''కే  హాయ్ చెప్పా… Read More
  • కవిత నెం 222 :తప్పు కవిత నెం :222 *తప్పు* తప్పు  చేయకున్నా తప్పేనని ఒప్పించనేల తప్పు చేసి తప్పించుకొనెడివాడి తల తీయకుండనేల తప్పులలో కొన్ని ఒప్పులున్నా తప్పే అనెడి… Read More
  • కవిత నెం 223: హాయ్ బంగారం కవిత నెం :223 హాయ్ బంగారం నీకు నేను గుర్తొస్తున్నానా ? కాని నాకు మాత్రం నువ్వు గుర్తొస్తూనే ఉంటావు అనుక్షణం ......... అనునిత్యం ....... నీ జ్ఞా… Read More
  • కవిత నెం 221:నా ప్రేమాక్షరాలు కవిత నెం :221 *నా ప్రేమాక్షరాలు * నీ మందారవింద సుందరమోము చూసి  నాలోన తేజము ఉత్సాహముగా ఉద్భవించే  నీ నోటి  ముత్యపు పలుకులను శ్రవించగా&… Read More
  • కవిత నెం 219:ప్రయత్నే కార్యసిద్ది కవిత నెం : 219 *ప్రయత్నే కార్యసిద్ది * ఒక ప్రయత్నం .... దానికి లేదు నిర్దేశం  ప్రయత్నిస్తూ - విఫలమవుతూ  అందుతూ - జారిపోతూ  ఊరిస్తూ -వె… Read More

0 comments:

Post a Comment