Monday, 13 April 2015

కవిత నెం134:నువ్వంటేనే

కవిత నెం :134

నువ్వంటేనే మోహం 
నువ్వంటేనే ద్వేషం 
ఎందుకు చెలియా నాలో ఈ రోషం 

నువ్వంటేనే  ప్రాణం 
నువ్వంటేనే శూన్యం 
ఎందుకు చెలియా నాకీ అయోమయం 

నువ్వంటేనే ఇష్టం 
నువ్వంటేనే కష్టం 
నువ్వంటేనే నాలో ఉన్న ఉద్రేకం

చెలియా చెప్పే కధలా
చెలియా చెరుగని వ్యధలా 
ఏముందే  ఇంతలా మన మధ్యనా 

గుండెలో బరువై నీవు
కళ్లలో  వెలుగై నావు
కనిపించక కసి రేపావు

గుండెచాటున చెలిమై నీవు
నా నీడమాటున అడుగైనావు
నేనంటే నీవుగా మార్చేసావు

ఇన్నాళ్ళు తెలియనే లేదే - ఎడబాటంటే
ఇప్పుడే అలవాటవుతుందే - ఒంటరి అంటే             

నువ్వంటేనే మౌనం
నువ్వంటేనే ఒక ఉదయం  
నువ్వంటేనే నా చుట్టూ తిరిగే భూగోళం      

Related Posts:

  • కవిత నెం 346(నా స్వప్నం (నా స్వప్నం గెలిచిందినిజజీవితంలో చేయలేనివాటిని సాధించమనిఎన్నో  మైళ్ల దూరంలో మిగిలిపోయే ఆశల్నిగుర్తుచేస్తూ, గమ్యం చేరమంటుంది *నా స్వప్నం*ఒంటరిగా మొ… Read More
  • గరిమెళ్ళ కవితలు నెం.1సంపుటిలోని కవితలు యొక్క క్రమం1. అమ్మ విలువ2. అజరామరం -నా తెలుగు3. సమయం లేదా మిత్రమా4. మేలుకో నవతేజమా5. ఆగకూడదు నీ గమనం6. జీవనమంత్రం7. పెనుమార్పు8. కోప… Read More
  • కవిత నెం 248 ( ఒక చిన్న మాట) కవిత నెం : 248 మాట మాట ఒక చిన్న మాట  మనసుని హత్తుకున్న మాట  మౌనంలోన దాగి ఉన్న మాట  గొంతు గ్రంథిలో తిరుగుతున్న మాట  గుప్పెడంత గు… Read More
  • కవిత నెం 213(ఎదురుచూపుల సంక్రాంతి ) కవిత నెం :213 ఎదురుచూపుల సంక్రాంతి  ఎంతమంది నానమ్మ ,తాతయ్యల ఎదురుచూపులో  ఈ సంక్రాంతి పండుగకైనా తమ మనువడు వస్తాడని  ఎంతమంది అమ్మా ,న… Read More
  • కవిత నెం :342 (ఒక స్వప్నం కోసం )*ఒక స్వప్నం కోసం *•••••••••••••••••••నిద్రించే నిన్ను మేల్కోలిపేదే స్వప్నంఅలజడితో మొదలై ఆశను పుట్టించి ఆశను మలుపుకున్నావో ఆశయమే నీదినీ స్వప్నం ని… Read More

0 comments:

Post a Comment