Monday, 13 April 2015

కవిత నెం138:నా ప్రేమకిరణం

కవిత నెం :138

ఒక వెన్నెల దీపం నాకెప్పుడూ కావాలి 
నా నీడతో పాటు నడవాలి 
నా తనువులో నాకు తోడూ కావాలి
నా అడుగుల వెంట తన కాంతి ప్రసారం కావాలి 
తను ఇచ్చే కాంతికి నా హృదయద్వారాలు తెరుసుకుని  
నా మనసు ఈ కాలంతో పాటు నడవాలి 
అలా సాగిపోయే నా మనసుకు నా వెన్నెల నవ్వే కదా
నా మనసుకు అందం ,ఆనందం 
నా వెన్నెల చల్లని చూపుకు నా నడకకు ఊపిరి రావాలి 
నా ఊపిరి నా వెన్నెల కోసమే ప్రతిక్షణం కరిగిపోవాలి  
నా ఊపిరి కరిగిపోతున్నా నేను బ్రతికివున్నట్లే కదా 
నా వెన్నెల కాంతుల్లో 
కరిగే కొవ్వొత్తి లాగా 
నా ప్రాణం అంతా తనకోసమే 
నా ప్రనవస్వరూపం తన ధ్యానమే 
నా ప్రేమకిరణం తనే తనే తనే 




!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 




Related Posts:

  • కవిత నెం 10:తెలుగు భాష కవిత నెం : 10 * తెలుగు భాష * … Read More
  • కవిత నెం274:మన ఆవు గురించి మనం తెలుసుకుందాం కవిత నెం  : 274 అంశం : మన ఆవు గురించి మనం తెలుసుకుందాం (వ్యాస రచన ) గోవు అందరికీ తల్లి . అందుకే వాడుకలో గోమాత అని పిలుస్తాము . గోవు పవిత్రతకు … Read More
  • కవిత నెం12:ఎడబాటు కవిత నెం : 12 *ఎడబాటు * నన్నొదిలి నీవు వెళ్ళావో నిన్ను వదిలి నేను ఉంటున్నానో తెలియదు కాని నీకు నాకు మధ్య నిలచిన ఈ దూరం మాత్రం నీవు వదిలిన అడుగు గుర్త… Read More
  • కవిత నెం 277:*కారులో ...... * కవిత నెం :277 *కారులో ...... * కారులో షికారుకెళ్ళండి నాయనా రోడ్లపై క్యూలో వెళ్ళండి నాయనా నీకున్నది ఒక్కకారు చూసుకుంటూ మురిసేవు నాజూకుగా నడిపేవు నీ… Read More
  • కవిత నెం276:తెలుగు వెలుగు కవిత నెం :276 శీర్షిక పేరు :  తెలుగు వెలుగు  మరో జన్మకేగినా , మరల జన్మించినా మాతృభాష  తెలుగవ్వాలనీ విదేశాలకేగినా ,విచ్చలవిడి తిరిగినా… Read More

0 comments:

Post a Comment