Monday, 13 April 2015

కవిత నెం135:ప్రేమంటే

కవిత నెం :135

కవిత పేరు : ప్రేమంటే
రచన : రాజేంద్ర ప్రసాద్
రచన సంఖ్య : మార్చి (3 ),త(27 )
 స్థలం : హైదరాబాద్, ఆంద్ర ప్రదేశ్
తేది: 30 -03 -2012 
సమయం : 6  గం // 52  ని. లు

ప్రేమంటే ఒక ఆకర్షణ
రెండు హృదయాల సంఘర్షణ 
రెండు తనువుల బంధం తో సాగే ఆత్మీయ ప్రేరణ 
ఇది స్నేహంలా పరిచయమవుతుంది 
మోడులా మారిన వృక్షానికి చిగురు నిస్తుంది 
గుండెలో ఎగసిపడే మంటకి దాహాన్ని తీరుస్తుంది 
సున్నితమైన చిచ్చర పిడుగు ఇది 
చిరునవ్వులా నిన్ను చుట్టేస్తుంది
మరుమల్లెలా పరిమళిస్తుంది
నీ నీడలా నిన్నే follow  అవుతుంది 
క్షణకాలంతో మొదలై
ఈ కాలాంతరం నీతో ఉండిపోతుంది
వర్షపు చిన్నుకులా వచ్చి వరదై పొంగుతుంది 
సంద్రంలోని అలలా నీ గుండెలో చేరిపోతుంది
నీకోసం ఒక తోడును ఏర్పాటు చేస్తుంది 
ఆ తోడుతోనే నీ ప్రయాణాన్ని లిఖిస్తుంది 
అద్బుతమైన ఆంతర్యం ఈ ప్రేమ
సంచలన సంగమం ఈ ప్రేమ
చరితలను సృష్టించేది ఈ ప్రేమ
జన్మ జన్మల బంధం ఈ ప్రేమ 
జనమంతా వెంటాడే చెలిమి ఈ ప్రేమ
ప్రేమ పుట్టుకకు పునాది ఉండదు
ప్రేమకు మరణం సంభవించదు
కాని ఈ ప్రేమ రక రకాలుగా ఉంటుంది
దీనికి ఒక రూపం అంటూ ఉండదు
కాని ఊసరవెల్లిలా రంగులను మారుస్తుంది
ప్రేమకు నిర్వచనం చెప్పలేము
ఎందుకంటే అది నిర్వచించ టానికి అందదు

Related Posts:

  • కవిత నెం :333(తెలంగాణ వేమన) కవిత నెం :333 కవిత శీర్షిక : తెలంగాణ వేమన ''వినుడి  మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరకుప్ప కవికుప్ప కనకమప్ప'' ఈ యొక్క మకుటం తలచిన చాలు జ్ఞప్… Read More
  • కవిత నెం :331(కల) కవిత నెం :331 ''కల '' కల కలలో కదిలే కల పాములా మెదిలే కల నీడలా నడిచే కల నిజంలా అనిపించే కల అందంగా అగుపించే కల అపురూపంగా మెప్పించే కల క్రీడలా కవ్వించ… Read More
  • కవిత నెం :310(జీవన మంత్రం) కవిత నెం :310 *జీవన మంత్రం * కోపమొస్తే సహించు మౌనమొస్తే వహించు భాదవస్తే భరించు భాద్యతగా ప్రవర్తించు కష్టమొస్తే కృషించు సుఖాలను అనుభవించు కన్నీళ్లొ… Read More
  • కవిత నెం :336(నా భాషలో -నా తెలుగు) కవిత నెం :336 * నా భాషలో -నా తెలుగు * సంద్రంలో పొదిగిన ముత్యపు వర్ణం పుడమిజడలో పరిమళిత ''పద కుసుమం ''  గగనవీధిలో స్వరాగల గమగతుల సంగమం వెన్నెల … Read More
  • కవిత నెం : 330(నై -వేదం) కవిత నెం : 330 కవితా శీర్షిక : నై -వేదం మనుషులగానే కనపడతారు మనసులోని విషయాన్ని నవ్వుతూ వెదజల్లుతారు పొగడ్తలకు పొంగిపోయే రోజులు నిశ్శబ్దాన్ని ఎలా సహ… Read More

0 comments:

Post a Comment