Monday, 13 April 2015

కవిత నెం145:నన్ను మార్చిన నీవు

కవిత నెం :145
*నన్ను మార్చిన నీవు * కదలని బండరాయిలా ఉన్నా ఇన్నాళ్ళు 
నన్ను కదిలే శిల్పాని గా చేసావు 
గాలికి ఊగని గోడగా  నిలుచున్నా ఇన్నాళ్ళు 
చల్లగాలిని చూపి స్పందించే  సరాగాన్ని గా చేసావు 
మెదలని మట్టిముద్దగా పోదిగియున్న ఇన్నాళ్ళు 
మెరిసే ముత్యంలా మార్చి మధురాన్ని  ఇచ్చావు 
వలలో చిక్కిన చేపపిల్లలా ఉన్నా ఇన్నాళ్ళు 
వసంతరాగాన్ని వినిపించే వీణ గా నన్ను మార్చావు 
సుడిగుండంలో ఊపిరి అందని ఇసుకరేణువు గా ఉన్నా ఇన్నాళ్ళు 
సువాసనలు పుట్టించే పుష్పాన్ని గా నన్ను చేసావు 
ఇన్నాళ్ళు నేనేరుగని ప్రపంచం 
నా కాళ్ళ ముందుకు తెచ్చావు 
నాకు తెలియని 
ప్రేమాబిమానాన్ని చూపావు 
ఆరిపోయే దీపంలా  ఉన్నా ఇన్నాళ్ళు 
ఆశలు పెంచుకుని పునర్జన్మ ను 
పొందినట్టుగా 
కొత్త జీవితాన్ని నాకు ఇచ్చావు 
నా హృదయాన్ని నిద్దుర లేపావునేస్తం 

!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా

Related Posts:

  • @@@@అడుగడుగునా అనుబంధాల మూటలుఆత్మీయత , అభిమానాల గొడవలుకమ్ముకొస్తున్న కపట ప్రేమ సువాసనదూరమవుతున్న బందాల అన్వేషనదగ్గరగా ఉన్న , పరిచయాలే పక్కన… Read More
  • నువ్వు యాదికొస్తేనువ్వెక్కడున్నా ఓ వెన్నెలలానేను నీ వైపే చూస్తుండే నేలలాతనివితీరని నీ రూపం అపురూపమై నా హృదిలో దాగుంది దప్పిక తీరని ప్రేమ దాహమేదోనీ ప్రేమ ప్రవ… Read More
  • కవిత నెం76 (స్త్రీ..ఆవేదన) కవిత నెం :76  //స్త్రీ..ఆవేదన.  // ఆడదంటే అగ్గిపుల్ల ,సబ్బుబిళ్ళ కాదురా ఆడదంటే ఆదిశక్తి ,నీ జన్మ కారణం తానురా భూమాత లాంటి సహనగుణం ఉంది… Read More
  • కవిత నెం 80(మరణం) కవిత నెం :80 నేడు సంభవిస్తున్న మరణాలను చూసి  మనసు వేదన చెంది మరణాన్ని ప్రశ్నిస్తున్న వేళ నా ఈ ''మరణం '' పై కవిత  //////మరణం ////////// మర… Read More
  • కవిత నెం75(తెలుగమ్మాయి) కవిత నెం :75 తెలుగమ్మాయి **********************************  కాటుక సొగసుల మాటున కలువల్లాంటి కళ్ళు  దోరతనం  పూసుకున్న దొండప… Read More

0 comments:

Post a Comment