Saturday, 11 April 2015

కవిత నెం107:మౌనం

కవిత నెం :107 //మౌనం //

అంతరంగంగా తరంగాలను సృష్టించే ధ్వని ఈ ''మౌనం'' 
సుముఖంగా భావాలను దాచ గని ఈ ''మౌనం'' 
సూర్యోదయం రాకముందే తన ఉషస్సుతో 
సవ్వడి చేసే ఓ మంచుపోగ ఈ ''మౌనం'' 
వర్షపు నీరు భూమిని తాకగానే 
వెదజల్లే పరిమళం ఈ ''మౌనం'' 
సంక్రాంతి ముగ్గులో గొబ్బెమ్మలా 
పోదిగియున్దేడే ఈ ''మౌనం''
శీతాకాలం చలిబిందువులా 
వెచ్చని ఆవిరి ఈ ''మౌనం''
పండువెన్నెల లో పుత్తడి కాంతుల మాటున 
పయనించే నీడ ఈ ''మౌనం'' 
పెదవుల బయటికి రాకుండా 
గొంతులోపల గరళంలో దాగివుండేది ఈ ''మౌనం''
ఏ  చప్పుడు రాని శబ్దం ఈ ''మౌనం''
మన గుప్పిట మూగ భావం ఈ ''మౌనం''

!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 

Related Posts:

  • కవిత నెం31:సాగిపో కవిత నెం :31 సాగిపో ....  * ఫలితం ఆశించకుండా  పనిచెయ్యి కష్టాన్ని మరచి శ్రమించవోయి ఆనందం చెదరిపోకుండా బ్రతుకవోయి చెడుతో విసిగిపోకుండా మంచిచ… Read More
  • కవిత నెం :19 //జెండా // కవిత నెం :19 //జెండా // మూడు రంగుల జెండా ఇది మువ్వన్నెల జెండా  రెప రెప లాడుతూ రివ్వున ఎగిరే జెండా  కులమత బాష బేదాలకు అతీతమై వెలసిన జెండా… Read More
  • కవిత నెం 28:ఈ వేళ కవిత నెం :28 నా కనుల ముందు నీ తోడు లేక  దాచి ఉంచా అది నీకు చెప్పలేక నీ జత లేని నా జీవితంలో హరితం హరించుకున్న వేళ  నీ కోసం రాహదారిలో బాటసా… Read More
  • కవిత నెం27:నా దేవి కవిత నెం :27 నాలో సగం నా రూపంలో ప్రతి రూపం నా భావాలకు అక్షర రూపం నా కన్నులకు నీవు కార్తీక దీపం నా మనసుతో ముడిపడిన మరో వసంతం నా హృదయములో నిలచిన పారిజ… Read More
  • కవిత నెం 17:అమ్మంటే కవిత నెం :17 అమ్మంటే ప్రేమకు అపురూపం  అమ్మ  అను పిలుపే ఆయుష్షునిచ్చే అమృతం  కనిపించే మమతల కోవెల అమ్మ  కదిలొచ్చే  ఆమని … Read More

0 comments:

Post a Comment