Saturday, 11 April 2015

కవిత నెం117:వెక్కిరింపు

కవిత నెం :117
*వెక్కిరింపు * చందమామను చూసి సూర్యుడు వెక్కిరిస్తాడా 
నువ్వెంత చల్లగా ,హాయిగా ,అందంగా ఉంటావని 
ఆకాశాన్ని చూసి నెల వెక్కిరిస్తుందా
నీవు నా కన్నా పైన వున్నావని 
మెరుపుని చూసి మబ్బు వెక్కిరిస్తుందా 
నా కన్నా వేఘం నీవని ,చురుక్కు నీవని 
సంద్రాన్ని చూసి ఎడారి వెక్కిరిస్తుందా 
నీవు కొన్ని జీవరాసులకు నిలయం అని 
నీటిచుక్కను చూసి మండే అగ్ని వెక్కిరిస్తుందా 
నీలాగా దాహం నేను తీర్చలేనని 
ప్రకృతికే లేని గుణాన్ని 
మానవుడు అలవరచుకున్న వైనం 
చుట్టూ ఉన్న వాటినుంచి నేర్చుకోవాల్సినవి ఉన్నా 
తన తిమ్మిరితనంతో అవహేళన నేర్చాడు 
తన గొప్పలకు ఆడంబరం నేర్చాడు 
ఎదుటివారి బాగుకు కన్నెర్ర నేర్చాడు 
కులమనే కుంపటిలో కూరుకొని 
మతమనే మహమ్మారి వంచన చేరి 
బాష అనే బట్టలు కట్టుకుని 
వేషం అనే విచ్చలవిడితనం తో 
ప్రాంతీయం నుంచి జాతీయం దాకా 
ఇంటినుంచి ఆరుబయట దాకా 
తప్ప ఒప్పా అనే తలంపు లేకుండా 
నీతి బీతి అనే జంకు లేకుండా 
నీది నాది 
నీకు నాకు 
తన మన 
అనే తారతంయభేదలు లేకుండా 
ఆఖరికి తల్లిపాలను సైతం వేరు చేసి 
తన వాటా కోసం ఆరాట పడుతున్నాడు 
ఇతరుల నుంచి అబిమానం పంచి ,
అత్మేయ్యం ఇచ్చి ఆతిద్యం చూపే 
మన సంప్రదాయభేషజాలను
మట్టిలో మరుకున పెడుతూ 
పునాదులతో సైతం పెకిలింపచేసి 
వెటకారమే వినోదంగా 
వెక్కిరించడం నేర్చాడు 

!!!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా





Related Posts:

  • కవిత నెం27 కవిత నెం :27 మనసును చదవగలరా ఎవరైనా ఆత్మను అవగాహన చేసుకోగలరా ఎవరైనా అర్ధం పర్ధం లేని జీవితంలో 'అపార్ధాల' పంటలు పండిస్తున్నారు  మమకారం చూపించే మన… Read More
  • కవిత నెం 26:అర్ధనారీశ్వర తత్వం ... కవిత నెం :26 అర్ధనారీశ్వర తత్వం ...  అవనిలో కొలువై యున్న దైవ సమానత్వం  విధి రాసిన వింత ఫలితం  అనాధలు కాదు , మన తోటి సమానులు  శుభ… Read More
  • కవిత నెం 25(అంతా ఒక్కటే) కవిత నెం : 25 కాలానికి లేదు సమాంతరం  ధనిక ,బీద గొప్పల తారతమ్యం  మానవ జన్మ అంటే ఇంతేరా  మంచి చెడు ,కష్ట సుఖాల బ్రతుకేరా  దనముకు ఖ… Read More
  • కవిత నెం24:పట్న వాసం కవిత నెం :24 *పట్న వాసం *  పల్లెలన్నీమాయమై - పట్నాలవుతుండే  పెరుగుతున్న పట్నాలలో - ఇరుకుటిల్లు పెరిగెనే  ఎదుగుతున్న సమాజం -స్వార్ద రహి… Read More
  • నేనేప్రేమా(357) నాకు లేడీస్ తో మాట్లాడటం రాదునా మాట కరుకునాకు ఉండదు బెరుకుఅందుకే నేనంటే అందరికీ చిరాకునువ్వు దూరంగా ఉండాలనిఅనుకోవటంలో తప్పు లేదుఆడపిల్లలతో కేరిం… Read More

0 comments:

Post a Comment