Monday, 13 April 2015

కవిత నెం140:ప్రేమ సందేశం

కవిత నెం :140

ప్రియా అంటూ మొదలెట్టాను 
ప్రేమను నా మనసులోంచి బయటపెట్టాను 
మొట్టమొదటి సారిగా నిన్ను చూసాను 
నీతో చెలిమి చేయాలని సంకల్పించాను 
నిన్ను ,నీ నీడని అనుసరించాను 
నీ పాదముద్రలో నా అడుగు కొనసాగించాను 
ఏనాటి జన్మలోని మన బందమో 
ఈనాడు నిన్ను నన్ను కలుపుతుందని 
హృదయస్పందన వ్యక్తపరుస్తున్నా 


మొదటిసారిగా నే  రాస్తున్న లేఖ 
తొలిసారిగా నీకై పంపుతున్న లేఖ 
తొలిసారి తోలకరిజల్లుల కాంతుల్లో 
నెమలిలా నడుస్తూ వస్తున్నా 
నిన్ను చూసి నా మనసు ఆగలేక
నీ రాస్తున్న చెలి ఈ ప్రేమ లేఖ  
నీ అందమో ,నీ మనసుతో నాకు 
పెనవేసుకున్న బందమో 
నీవు తప్ప వీరే ఈ కాంతిని 
చూడనంతుంది నా నయనం
నిన్నే నిన్నే కోరుకుంటుంది నా ప్రాణం 


''నా మనసును కుంచెగా చేసి 
ఆ హరివిల్లుని ప్రేమలేఖగా చేసి 
ఆకాశంలోని మేఘమాలలతో 
పంపుతున్న చెలి ఈ ప్రేమ సందేశం ''


అక్షరాల సత్యం - నేను నిన్నుప్రేమిస్తున్నా 
ఆకాశమే సాక్ష్యం - నేను నిన్ను ప్రేమిస్తున్నా
అనునిత్యం -నిన్ను ప్రేమిస్తూనే ఉంటా 
రేపటి రోజున నీ జవాబుకోసం -నీ వేచి ఉంటా 


!!!!!!!!!!!!!!!!
గరిమెళ్ళ రాజా 





Related Posts:

  • కవిత నెం139:నీ పిలుపు కవిత నెం :139 ప్రియా నీ పిలుపు విన్న ఈ క్షణం  మరణలోకాల అంచులకి వెళ్ళిపోతున్న నా మనసుకి  మరోజన్మ ఎత్తినట్టుగా ఉంది.  నీ ప్రేమే నాకు వర… Read More
  • కవిత నెం137:143 కవిత నెం :137 చెలియా నీ 143  నా కదే 2  by 3  అదే కదా హ్యాపీ హ్యాపీ  143 అంటే అర్ధం ఎముంటుందే అనుకున్నా నే ఇంతకూ ముందే&… Read More
  • కవిత నెం140:ప్రేమ సందేశం కవిత నెం :140 ప్రియా అంటూ మొదలెట్టాను  ప్రేమను నా మనసులోంచి బయటపెట్టాను  మొట్టమొదటి సారిగా నిన్ను చూసాను  నీతో చెలిమి చేయాలని సంకల్పి… Read More
  • కవిత నెం141:మరచిపో మనసా కవిత నెం :141 మరచిపో మరచిపో మరచిపో మనసా  విడిచిపో విడిచిపో విడిచిపో మనసా  గతం జ్ఞాపకాలు -గుర్తు రానీయకు  గుర్తుచేస్తూ గుర్తుచేస్త… Read More
  • కవిత నెం138:నా ప్రేమకిరణం కవిత నెం :138 ఒక వెన్నెల దీపం నాకెప్పుడూ కావాలి  నా నీడతో పాటు నడవాలి  నా తనువులో నాకు తోడూ కావాలి నా అడుగుల వెంట తన కాంతి ప్రసారం కావాలి&… Read More

0 comments:

Post a Comment