Saturday 11 April 2015

కవిత నెం91:ATM

కవిత నెం :91

ATM

ఓయ్ నేనే
అంటే నీకు తెలుసా ?
తెలియదు ఎందుకు తెలుస్తుంది
నా పేరు ATM
ALL TIME MONEY అని నన్ను పిలుస్తారు
అవసరమైన టైం లో
ఆకస్మాత్తుగా డబ్బు పుట్టించే
యంత్రం అన్నమాట
కొందరికి నేనో మెషిన్ మాత్రమె
మరి కొందరికి నేనో ''మినీ బ్యాంకు ''
నేనెప్పుడూ చలాకీగా పని చేస్తుంటాను
కాని అప్పుడప్పుడు ''అవుట్ అఫ్ ఆర్డర్ ''
ఎందుకంటే నాకు జ్వరం వస్తూ ఉంటుంది
ఒక్కొక్క సారి నాలో డబ్బు అయిపోతుంటుంది
మీకు ఆహారం కావాలి బ్రతకటానికి
నాకు డబ్బు కావాలి పని చెయ్యాలంటే
నాకూ రోగం వస్తూ ఉంటుంది సుమీ అప్పుడప్పుడు
అంటే నా ఒంట్లో ఏదో ఒక అవయవం
పని చేయకపోవటం అన్నమాట
నాకు ఒక గ్రేట్ థింగ్ ఉంది తెలుసా!
సినిమా చూడాలంటె టికెట్ కావాలి
అలాగే నన్ను కలవాలంటే  కార్డ్ కావాలి
దానికి ముందే మీరు
సంభందిత  బ్యాంక్ లో అప్లికేషను పెట్టుకోవాలి
మనిషి పనిచేసేది 8 గ// లు మాత్రమె
కాని నాకు 24 గ// లు సర్వీస్
మీరు బిల్డింగ్స్ కట్టుకోవాలి
నాకైతే కట్టి ఇస్తారు
ఎయిర్ కండీషనర్ తో సహా
నన్ను అందరూ వాడుకుంటారు
లైక్ ఒక ఫ్రెండ్ లాగా
అది వారి డబ్బే అనుకోండి
నాకు దునియా మొత్తం ఫ్రెండ్స్ అనడోయ్
కులం ,వర్గం, వర్ణం
అంటూ తేడా నాకుండ దండోయ్
ఓకే మరి ఉంటాను
కాస్త రిలాక్స్ అవ్వాలి కదా
నా చేతులు లాగుతున్నాయ్
బాయ్ !



0 comments:

Post a Comment